పెదవులపై అమృతమ్మును,
హృదయంలో విషము ఉన్న
చంద్రబాబు తెలగాణకు
పాలకుడుగ కావాలా?
చంద్రబాబు నేతృత్వం
తెలగాణకు కావాలా?
తెలంగాణ వ్యతిరేకిని
గెలిపించుట అవసరమా?
దోపిడికై రకరకాల
జిమ్మిక్కులు చేయునట్టి
ఆంధ్రాబాబుల పార్టీ
తెలంగాణలో ఎందుకు?
సీమాంధ్రా, తెలంగాణ
విడిపోయిన తరువాతను,
ఆంధ్రపార్టి టీడీపీ
మనకెందుకు, మనకెందుకు?
తెలంగాణ బిల్లు పాసు
కాకుండా యత్నించిన
చంద్రబాబు పాలనమ్ము
తెలగాణకు ఎందుకయ్య?
రెండుకండ్ల సిద్ధాంతం,
సమన్యాయం, సమైక్యాంధ్ర,
సామాజిక తెలంగాణ
"ఊసరవెల్లి"యె ఆతడు!
ఇన్నేండ్లుగ ప్రజాభీష్ట
మును లెక్కింపని బాబుకు,
ప్రజాభీష్ట నాయకుడిని
మనమెందుకు ఎన్నవలెను?
ప్రజాలాభమే పట్టని,
స్వీయ లాభమాశించిన
స్వార్థపరుడు, మోసకారి
చంద్రబాబు కాడా యేం?
చంద్రబాబు, వెంకయ్యల,
తెలంగాణ నడ్డుకొనెడి
నాటకాలు కళ్ళారా
చూచికూడ గెలిపింతురె?
తెలంగాణకును లాభము
కలుగకుండ, సీమాంధ్రకె
లాభమ్మొనగూర్చినట్టి
చంద్రబాబు మనకెందుకు?
మన రాష్ట్రము తెలంగాణ;
మన నేతయు తెలంగాణ
వాడై యుండవలెగాని,
ఆంధ్రబాబు మనకేలయ?
కేసీయార్ నిరాహార
దీక్షచేసి సాధించిన
తెలగాణను ఆపినట్టి
వాడు చంద్రబాబు కాడె?
బోధన్ చక్కెర ఫ్యాక్టరి,
వరంగల్లు ఏజేమిల్
మొదలైనవి అమ్ముకొనిన
లాభకాంక్షి చంద్రబాబె!
విద్యుత్తుకు ఉద్యమించు
రైతుల హతమార్చి; యిపుడు
ప్రజలనేతననుచు మొసలి
కన్నీరును కార్చుచుండె!
తెలగాణకు నీళ్ళువద్దు,
తెలగాణకు కొలువులొద్దు,
తెలగాణులు బానిసలే!
ఇవి సీమాంధ్రుల కుట్రలు!!
ఇందుకొరకు సీమాంధ్రుడు
చంద్రబాబు పూనుకొనియు,
తెలగాణలొ టీడీపీ
అధికారము కోరుచుండె!
తెలగాణుల నమాయకుల
జేసి, చెవిని పువ్వుబెట్టి,
ఓట్లు, సీట్లు కొల్లగొట్టి,
నెత్తిన చేతిని బెట్టును!
చంద్రబాబు కుటిల చేష్ట
లకు నిరాశ చెందినట్టి
యువతీయువకులు ఎందరొ
ఆత్మహత్యలకు బూనిరి!
ఇట్టి హంతకునకు మనము
ఓట్లు వేసి గెలిపించుట,
అధికారము నందించుట
అమరులకవమానమగును!
దయ్యమ్ములు వేదమ్ముల
వల్లించిన రీతి నతడు
కపటప్రేమ ఒలకబోత
మన కీడుకె, మనకీడుకె!
మనను బానిసలను జేయు,
మనను దోచుకొనగ బూను,
మనను మోసగింపగోరు
ఆంధ్రబాబు మనకేలయ?
టీడీపీ మనకు వలదు,
వైసీపీ మనకు వలదు,
సమైక్యాంధ్ర పార్టి వలదు,
జనసేనయె మనకు వలదు!
మతతత్త్వము అంటుకొనని
పార్టి మనకు కావలెనయ!
సీమాంధ్రుల పొత్తులేని
పార్టి మనకు కావలెనయ!!
తెలంగాణ సోదరుడా,
నమ్మవలదు సీమాంధ్రుల!
కోరుకొనగ వలదు, వలదు
ఆంధ్రబాబు పెత్తనమ్ము!!
మన బాధలు తొలగించియు,
మనకు రాష్ట్రమిడిన నేత,
మన తోడుగ నిలుచు నేత,
మనకిప్పుడు కావలెనయ!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి