తెలంగాణ రాష్ట్రముకై
ఉద్యమించినపుడు ఎవరు
ఆసరగా లేనప్పుడు
నేనున్నా రమ్మంటూ
అభయహస్తమిచ్చిందీ!
మహోన్నతపు లక్ష్యానికి
సాధారణ గ్రామమ్మే
తన స్పందన తెలియజేసి,
తన కడుపున దాచుకొనియు
మమకారం పంచిందీ!
నిష్కల్మష హృదయంతో,
అనురాగం అందించియు,
మనసునిండ తెలంగాణ
ఆకాంక్షను నిలుపుకొనియు,
ఆదరణందించిందీ!
కూటికి పేదను ఐనా
మమతకు పేదను కానని,
నీవిట తలపెట్టినట్టి
ఉద్యమానికే ఊపిరి
నేనందిస్తానని అందీ!
ప్రతి హృదయం తెలంగాణ
కై తపియించంగ, ఎల్ల
వేళల తెలగాణమ్మును
గానము చేయుచు ప్రేమల
మొలకెత్తించిందీ!
తెలంగాణ మట్టి విలువ
దశ దిశలకు ఎరుకపరుప
సువాసనల వెదజల్లుచు
నేతను రప్పించి తాను
ముడుపును కట్టించిందీ!
పదమూడేడుల పిదపయె
తెలంగాణ రాష్ట్రమిపుడు
ఉద్భవించగాను సంత
సమ్మున ఆహ్వానించియు
ముడుపును విప్పించిందీ!
అన్ని ఊళ్ళకును తానే
ఆదర్శముగాను నిలిచి,
రాగబంధ మేర్పరచియు
జగతికి తన ప్రగతికాంక్ష
ఎలుగెత్తియు చాటిందీ!
"మో"దిత "తె"లగాణ గ్రామ
మిదియకాదె! ఈ గ్రామమె
ఉద్యమనేతకు ధైర్యము
నిచ్చి ముందుకును నడిపియు
స్ఫూర్తిదాయకమయిందీ!
*** *** ***
అన్ని ఊళ్ళు ఈ లాగున
ఉద్యమపార్టికి ఊపిరి
ఐ నిలిచిన తెలంగాణ
బంగరు తెలగాణ గాను
శీఘ్రగతిన అవుతుందీ!
ఉద్యమనేత "మోతె"గ్రామసందర్శన వివరములకై
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి