గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మార్చి 19, 2014

తెలంగాణ భౌగోళిక, నైసర్గిక స్వరూపంలో ఏలాంటి మార్పు వచ్చినా సహించేదిలేదు!


పోలవరం ఆనకట్ట
నిర్మాణము కొరకు మీరు
డిజైనునే మార్చవలయు,
ఈ డిజైను నొప్పుకొనము!

పోలవరపు ముంపు మండ
లమ్ములాంధ్రలోన గలుప
నొప్పుకొనము, సహియింపము!
ఈ డిజైను మార్చవలయు!!

ముంపు మండలము లాంధ్రను
గలిపినచో తెలంగాణ
భౌగోళిక, నైసర్గిక
స్వరూపమున మార్పువచ్చు!

తెలంగాణ రాష్ట్ర పటము
లో మార్పుల నొప్పుకొనము!
గిరిజనముల జన్మభూమి
నష్టపరుప నొప్పుకొనము!!

తెలంగాణ అసంపూర్ణ
ప్రాజెక్టుల పూర్తిచేసి,
పిదప పోలవరము మీరు
నిర్మింపగవలయునయ్య!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి