గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మార్చి 22, 2014

ప్రలోభాలకు లొంగేవారిని బీసీలు క్షమించరు!


చంద్రబాబు తెలగాణలొ
బీసీనే ముఖ్యమంత్రి
జేతునంచు పలుకునట్టి
మాటలన్ని బూటకములు!

తెలగాణలొ టీడీపీ
బలమును గూర్చుకొనగాను
పన్నినట్టి ఎత్తుగడకు
కృష్ణయ ఆకర్షితుడయె!

చంద్రబాబు ఆంధ్రబాబు!
బాబు మాట నమ్మరాదు!
గతంలోన ఆంధ్రవారి
మాట నమ్మి చెడిపోతిమి!!

అరువదేండ్ల బానిసత్వ
మునే అనుభవించినాము!
మరల ఆంధ్రబాబు నమ్మి,
మోసపోవ నేలనయ్య?

తెలంగాణ రాష్ట్రమ్మున
తెలంగాణ పార్టీలే
ఉండవలెను! సీమాంధ్రుల
పార్టీలకు తావులేదు!!

ఆంధ్రబాబు మోసగింప,
కృష్ణయ్యే మోసపోడు,
తెలంగాణ ప్రజలందరు
మోసపోవుటయె నిక్కము!

బీసీనే ముఖ్యమంత్రి
చేతుననియు నమ్మించియు,
అధికారము తన చేతనె
ఉంచుకొనియు, ఆడించును!

తెలంగాణ ముఖ్యమంత్రి
పదవి బీసి కిచ్చినచో,
సీమాంధ్రలొ ముఖ్యమంత్రి
పదవి ఎవరి కిత్తురయ్య?

పార్టీ అధ్యక్షునిగను,
సీమాంధ్రకు ముఖ్యమంత్రి
గా బీసీనే చేయగ
ప్రకటించునె చంద్రబాబు?

దుర్మార్గపుటాలోచన
అర్థమ్మును చేసికొన్న
బీసీలెవ్వరు నమ్మరు!
చెవిని పువ్వు పెట్టుకొనరు!!

కృష్ణయ్యయు చెప్పినచో
బీసీలెవ్వరు వినరయ!
అతని మాటలను వినియును
మోసగింపబడబోరయ!!

తెలంగాణలోన స్వార్థ
కాంక్ష గలిగి, ఆంధ్రపార్టి
ప్రలోభాలకును గురియగు
బీసీ నేతను నమ్మరు!

ఎవరు నెగ్గుచో, బంగరు
తెలంగాణ సాకారము
శీఘ్రగతిన కావింతురొ,
వారినె నెగ్గింపుడయ్య!

ప్రలోభమ్ములకు నెవ్వరు
లొంగకూడదోయయ్యా!
ప్రలోభాలు తెలగాణుల
బానిసలుగ మార్చునయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి