టీఆరెస్ పుట్టుకకును
ఏడు నెలల క్రిందటనే
తెలంగాణ డిక్లరేష
నిచ్చినదట కాంగ్రెస్సే!
రెండువేల వత్సరాన
ఇది జరిగినదని యన్నను,
పదునాలుగు వత్సరాల
పిదప తెలంగాణమిడిరి!
పదునాలుగు వత్సరాల
శ్రీరాముని వనవాసము
శుభసూచకమైన గాని,
తెలగాణకు కాంగ్రెస్సే
వనవాసము చూపించెను!
పదునాలుగు వత్సరములు
ఆలస్యము చేయగాను,
వేయిమంది అమరవీరు
లాత్మహత్యలకు గురైరి!
వేయిమంది బలిదానము
శుభసూచక మెట్టులగును?
రాజకీయ చదరంగము
నందు పావులను జేసెను!
పద్నాలుగు వత్సరాలు
శుభసూచకమైన గాని,
అమరవీరుల ఉసురులను,
మరల దెచ్చి యీయగలరె?
శుభసూచకమెట్టులగును,
రాజకీయమగును గాని?
తెలగాణుల నమాయకుల
జేసి మోసగించ్రిగాదె?
ఇట్టి నష్టమును జేసిన
కాంగ్రెస్సుకు తెలగాణలొ
పుట్టగతులు ఉండబోవు,
ఓట్లు కోరు హక్కులేదు!
ఓట్లు కొల్లగొట్టుకొరకు
కాంగ్రెస్సీమాటలనెను!
చెవిని పువ్వు గలవారలు
తెలగాణలొ ఎవరుండిరి?
కాంగ్రెసీయ దుష్టబుద్ధి
ఇపుడు బయటపడెను గాదె!
తెలంగాణు లిది తెలిసియు
మెలగవలెను రూఢిగాను!
పద్నాలుగు వత్సరాలు
పోరాటము జేసిరెవరు?
టీఆరెస్ లేకున్నచొ
తెలంగాణ మెట్టులబ్బు?
కాంగ్రెస్సును గెలిపించుచొ,
మనకు నూకలే చెల్లును!
టీఆరెస్ గెలిచినచో
బంగరు తెలగాణ వచ్చు!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి