గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మార్చి 24, 2014

ఈ ప్రశ్నకు బదులేది?


"తెలంగాణ సాధనలో
ఎదురుపడిన అడ్డంకులు
అధిగమించి, గెలుపొందిన
వారలకే పదవి దక్కు!

తెలగాణకు చెరుపుచేయు
అంశములకు వ్యతిరేకత
తెలుపనట్టి వారలకిక
ఏ పదవియు దక్కకుండు!

స్వార్థమ్మును విడనాడియు
ప్రతిక్షణము ఉద్యమించు
తెలంగాణ రాష్ట్ర సాధ
కులనె పదవి వరియిందును!"

అనుచు హరీశ్ రావు పలికి,
కాంగ్రెస్సుకు ఈ ప్రశ్నల
సంధించెను బదులుచెప్ప
వలసినదని కోరుకొనుచు!

ఈ ప్రశ్నలు తెలంగాణలో పోటీచేసే అన్ని పార్టీలకూ వర్తిస్తాయి!

వీటికి ఔననే సమాధానం చెప్పే పార్టీలే గెలుస్తాయి!

మౌనంగా ఉన్నా, తలతిక్క సమాధానాలిచ్చినా, ఎదురుదాడికి దిగినా
వారికి తెలంగాణలో నూకలు చెల్లినట్టే!


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి