గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మార్చి 21, 2014

ఉద్యమంలో పాల్గొనని మొహాలకు, ఓట్లడిగే హక్కెక్కడిది?


జలయజ్ఞం, ధనయజ్ఞము
గాను మార్చి, జేబునింపు
కొన్నవాడు వరంగల్లు
పొన్నాల్లక్ష్మయ్యకాడె?

సీమాంధ్రలొ జలకేటా
యింపులేని ప్రాజెక్టులు
కట్టగాను సమ్మతిడిన
పొన్నాలయు నీతిపరుడె?

భారినీటిపారుదలకు
మంత్రియయ్యు, తెలగాణలొ
ఒక ప్రాజెక్టైనగాని
పూర్తిచేయగలిగినాడె?

తెలంగాణ యుద్యమమ్ము
ఉద్ధృతముగ జరుగునాడు
అమెరికాకు, ఆస్పత్రికి
పొన్నాలయె వెళ్ళలేదె?

వరంగల్లు కలెక్టరా
ఫీసులోన విద్యార్థులు
ఉద్యమించ, పారిపోయి,
దాగినట్టి ముఖమతనిది!

ప్రత్యక్షముగా ఎపుడును
ఉద్యమమున చేరలేదు!
పదవిపైన మోజుతోడ
రాజినామ చేయలేదు!!

తెలంగాణలో ఎనిమిది
వెనుకబడిన జిల్లలుండ,
ప్రత్యేకపు ప్రతిపత్తిని
ఎందుకు కోరడు ఆతడు?

పోలవరపు ముంపు మండ
లములను సీమాంధ్రలోన
కలుపునట్టి ఆర్డినెన్సు
ఏల ధిక్కరించడతడు?

సచివాలయమందు నేడు
అక్రమముగనున్న ఆంధ్ర
వారి నాంధ్రకే పంపగ
అతడెందుకు కోరడయ్య?

ముంపు కలుగకుండ పోల
వరపు డిజైనును మార్చగ
కోరడేల కేంద్రమ్మును?
వారి తొత్తు అతడు కాడె?

పోతిరెడ్డిపాడు నీటి
తరలింపును సమ్మతించి,
తెలగాణకు ద్రోహమ్మును
చేసినట్టివాడు కాడె?

తెలగాణకు అనుకూలము
అంటూనే, వైయెస్సార్
"తెలంగాణ వీస" నుడిని
విని, వ్యతిరేకించలేదు!

తెలంగాణకొక్కపైస
నీయనన్న కిరణ్ రెడ్డి
పలికినట్టి మాట నాడు
విని, వ్యతిరేకించలేదు!

బానిస తత్త్వము తోడను
సీమాంధ్రుల కొమ్ముగాయు
నీచబుద్ధి వదలలేని
తెలంగాణ ద్రోహి యతడె!

ఢిల్లిలోని ఏపీభవ
నమ్ము తెలంగాణ హక్కు!
అడుగడేల కేంద్రమ్మును?
వారి తొత్తు అగు కతననె!

తెలగాణకు ఏ లాభము
చేయనట్టి పొన్నాలకు,
తెలగాణలొ ఓట్లనడుగు
హక్కు నెవ్వరిచ్చిరయ్య?

తెలగాణకు న్యాయమ్మును
కోరునట్టి కేసీఆర్
నడ్డగించు అతని నెట్లు
తెలగాణను గెలిపింతురు?

మేలుచేయుమని కోరడు,
కోరువారినడ్డగించు,
"అమ్మ పెట్ట, దడుగుకొనగ
నివ్వ"దనియు అన్నట్లుగ!!

ఇంకా తెలగాణు లిపుడు
చెవిని పువ్వు పెట్టుకొనియు
నున్నవారె, పొన్నాలయు
చెప్పుమాట నమ్ముటకును?

ఉద్యమమున పాలుగొనని,
తెలగాణకు కృషిచేయని,
టీనేతకు తెలగాణలొ
ఓట్లు అడుగు హక్కు కలదె?

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి