పోలవరం నిర్మాణం వల్ల తెలంగాణ చారిత్రక, ఆధ్యాత్మిక, భౌగోళిక ఆధారాలు అంతరించిపోనున్నాయి. ఎంతో విలువైన అటవీ సంపద, కొండరెడ్లఆటవికజాతి నాశనమై, ఎంతో విలువైన భూమి, భూ అంతర్భాగంలో ఉన్న ఖనిజసంపద పనికిరాకుండాపోతుంది. పైగా తెలంగాణకు ఇది శాపంగానూ, పెద్ద గుదిబండగానూ మారుతుంది. దీనివల్ల నష్టాలేగానీ, లాభాలేవీఉండవు. ఇంతటి వినాశకారకమైన ఈ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నది సీమాంధ్ర పెట్టుబడిదారులేనన్న విషయం మరువరాదు. తద్వారా వారు లక్షలకోట్ల ధనార్జనే ధ్యేయంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దీనివల్ల సీమాంధ్ర నాయకులకు ముడుపులు పెద్దఎత్తున ముడుతాయి. ఈ స్వార్థంతో తెలంగాణలోని భద్రగిరినే సర్వనాశనంచేయ సంకల్పించారు ఈ దుర్మార్గ సీమాంధ్రులు. అందుకని దీన్ని ప్రతి ఒక్క తెలంగాణుడూ వ్యతిరేకించి, ఉద్యమించవలసిన అవసరం ఉన్నది.
ఈ క్రింద ఈయబడిన వ్యాసం "మురళీరవం" శీర్షికన ఆంధ్రప్రభలో శ్రీ ఎన్. వేణుగోపాల్ గారు రాసిన వ్యాసం.
(శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
4 కామెంట్లు:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పక పూర్తి అవుతుందని ఆశిస్తున్నాను. ఒక పది సంవత్సరాలలోనే తిరిగి తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలు కలిసిపోతాయి. చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది
ఇది పగటికల. డిజైను మార్చకుండా నిర్మించడం సాధ్యంకానిపని. అలాగే నిర్మిస్తామంటే పెద్ద ఉద్యమాలే జరుగుతాయి. ఈ సమస్య మీరనుకున్నంత సులభమైన పని కాదు. ఇకపోతే, తెలంగాణ సీమాంధ్రతో పదేండ్లలో మళ్ళీ కలుస్తుందనుకోవటం కూడా పగటికలే! దోపిడీ దొంగలతో తెలంగాణ ఎలా కలుస్తుంది? మళ్ళీ దోపిడీకి గురికావడానికా? సీమాంధ్రతో తెలంగాణ కలవడం అసంభవం. అరవైఏండ్ల దోపిడీ మా తెలంగాణకు సరియైన గుణపాఠం నేర్పింది. ఇంకా నమ్ముతామా దోపిడీ దొంగల్ని?
పోలవరం ఒకవేళ కట్టినా లాభం పెద్దగా ఉండదు. ప్రతిపాదిత పోలవరం ఆయకట్టులో సింహభాగానికి ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందుతున్నాయి. కొత్త ఆయకట్టు స్వల్పమే.
పోలవరం నిర్మాణం ఖచ్చితంగా ఆగి తీరుతుంది. 3 లక్షల మంది ఆదివాసులను నిరాశ్రయులను చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఆంద్రా నాయకులకు అంత అత్యాశ పనికిరాదు. కొందరు నాయకులు ఆదివాసుల జీవితాలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం మానుకోవాలి. భౌగోలిక వాస్తవం కూడా దిగువ ప్రాంత ప్రజలు గుర్తించాలి. నాయకుల మాటలు నమ్మొద్దు. సరైన పునాది (భూ స్వభావం: ఇసుక మట్టి రాయి) లేని ఆ ప్రాజెక్టు దిగువ ప్రాంతాలను ముంచేస్తుంది. దిగువ ప్రాంత ప్రజలు కూడ వ్యతిరేఖ ఆందోళనలు ఉదృతం చేయ్యాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి