రాష్ట్రమేర్పడినది మొదలు
ఇప్పటి దాకా దోచిరి!
అమాయకులు తెలగాణుల
మోసమ్మెంతో చేసిరి!!
ఊహించని రీతిగాను
మోసమె మోసమె మోసమె!
"సమైక్యాంధ్ర" అని చిలుకల
పలుకులనే పలుకుచుండ్రి!!
"మన అందరిదొకే జాతి!
మన జాతియె తెలుగుజాతి!!"
అని పలికిన సీమాంధ్రులె
తెలగాణను మోసగించ్రి!!
గడచిన పది వత్సరాల
భారత పోస్టలు స్టాంపుల,
రాష్ట్రమునకు చెందినట్టి
స్టాంపులు పదిహేడు కలవు!
అవి అన్నియు సీమాంధ్రకె
సంబంధము గల యట్టివి!
తెలంగాణ సంబంధిత
స్టాంపొక్కటి కూడ లేదు!!
ఇంత పక్షపాతమున్న
సీమాంధ్రుల పలుకులలో
"తెలుగుజాతి" అర్థమేమి?
"సమైక్యాంధ్ర" అనగ నేమి?
మేకతోలు కప్పుకున్న
క్రూరమైన పులులు వారు!
మానవత్వమింతలేని
దానవత్వమున్నవారు!!
ఇట్టి వారితో ఇంకా
కలిసుండుట యుక్తమా?
తెలంగాణె మన గమ్యము!
తెలంగాణె మన ధ్యేయము!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
(తేది:28-12-2013 నాటి MISSION TELANGANA ప్రచురించిన http://missiontelangana.com/seemandhras-discriminated-in-releasing-postal-stamps-too/ వార్తకు కృతజ్ఞతా పూర్వక స్పందన)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి