గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 26, 2013

దుష్ట శిక్ష శిష్ట రక్ష కర్తవ్యం మీదయ్యా!


రాష్ట్రపతీ కొనుమయ్యా
వందనములు నేటి రోజు!
తెలంగాణ రాష్ట్రానికి
స్వేచ్ఛనిచ్చునట్టి రాజు!!

తెలంగాణ బిల్లు విమా
నమున రెండు గంటలలో
పంప, నదియె చేరె సభ్యు
చేతికి మూడ్రోజులలో!!

బీయేసీ తీర్మానం
మేర సభాపతియె బిల్లు
పైన చర్చగోర, బాబు
నోరుమూయ, వాయిదపడె!

తీర్మానం చేసి రెండు
వారములయె! చర్చలేవి?
మొదలైనా కాకుండనె
నిరవధికపు వాయిదపడె!!

చర్చ జరుపు సమయమునకు
అనవసరపు వాయిదనిడి,
సమయము సరిపోదంచును
గడువు పెంచు మన పాడియె?

దురుద్దేశమున చర్చల
కాలమ్మును వృథాపరచి,
గడువు పెంచుమని కోరుట
విభజనమును అడ్డుకొరకె!

తెలంగాణ రాష్ట్రమునకు
అడ్డంకుల సృష్టించుట
తనదు ఆధిపత్యమ్మున
తెలగాణను ముంచుటకే!

సీమాంధ్రను బాగుపరచి,
తెలగాణను నష్టపరచి,
తమ పబ్బం గడుపుటకై
సీమాంధ్రుల దౌష్ట్యమిదే!

చర్చ జరుపకుండ వారు
సమయమంత వృథాపరచి,
మరల గడువు పెంచుమనగ
జూచు దురుద్దేశమిదే!

తెలగాణను రక్షింపుడు!
తెలంగాణ రాష్ట్రమిడుడు!
దుష్టుల దునుమాడి మీరు
శిష్టుల కాపాడుడయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

resubmitted with minor correction in the poem
గుండువారూ, దుష్ట శిక్ష శిష్ట రక్ష కర్తవ్యం మీదయ్యా అంటూ శీర్షిక పెట్టి రాష్ట్రపతిగారికి విన్నవించుకుంటూ ఆఖరుపద్యంలో చివరకు దుష్టుల దునుమాడి మీరు శిష్టుల కాపాడుడయ్య అని గూడా అన్నారు. ఎవరు దుష్టులు ఎవరు శిష్టులూ అన్నది చూసే దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. అదలా ఉంచి, తునుమాడటం ఏమిటి? పుంఖానుపుంఖాలుగా పద్యాలు వ్రాస్తున్న మీకు ఈ మాట అర్థం అవగాహనలో ఉండే అంటున్నారని స్పష్టమే. మీరు మీ వాదాన్ని వినిపించటం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు కాని మీ మితిమీరుతున్న దురుసుదనం మాత్రం బాగోలేదు. మీ ఉద్దేశం రాష్ట్రపతిగారు సీమాంధ్రులందరికీ మరణశిక్ష విధించాలని కాబోలు! అంత పనిభారం ఆయనకెందుకు లెండి. మీ తెలంగాణావాదుల కొత్తదేవత సోనియమ్మ జరిపిస్తున్న అన్యాయవిభజనపర్వం వలన సీమాంధ్ర ఎలాగూ ఎడారిగా మారి సీమాంధ్రులలో పొట్తచేత బట్టుకొని ఇతర ప్రాంతాలకు పోయేవారు పోగా మిగతావాళ్ళు మాడిచస్తారు. ఆ పొడారి ఎడారి యైన భూభాగాన్ని కూడా మే తెలంగాణావారే ముందుముందు ఏలుకోవచ్చును! లేకపోతే అన్యాయంగా ఏకంగా సీమాంధ్రులను చంపండీ అని కోరటమేమిటండీ? ఎంత గర్వోద్రేకం!!

కం. శిష్టుల మని గర్వంబున
దుష్టులు దుష్టులని మాట తూలి యొరులకున్
కష్టంబు కలుగ జేయుట
శిష్టాచారంబు విడచి చెలరేగుటయే

కాలగతిలో ఏమి వ్రాసి ఉన్నదో అదే జరుగుతుంది లెండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తమ దౌష్ట్యంతో మా వెయ్యిమంది తెలంగాణ అమరవీరులను ఆత్మబలిదానానికి గురిచేసిన సీమాంధ్రులను దునుమాడమంటే...మా తెలంగాణ నిధులు, నీళ్ళు, కొలువులు, భూములు అక్రమంగా కొల్లగొట్టిన సీమాంధ్ర దుర్మార్గులను దునుమాడమంటే...మీకు ఉలుకెందుకు? మా అమర వీరుల బలిదానాలకంటే బాధాకరమైనదా నేను వాడిన "తునుమాడు" అన్న పదం? మాట అన్నందుకే ఇంత బాధ కలిగితే, వేయిమందిని పోగొట్టుకొన్న మేం ఎంత బాధపడుతున్నామో మీకు ఎప్పుడు అర్థం అవుతుంది? "తెలంగాణకు ఒక్క పైసాకూడా ఇవ్వను, రాసిపెట్టుకోండి" అని ముఖ్యమంత్రి అంటే ఖండించని పెద్దమనుషులు, నేనన్న మాటకు...అదీ నేను దుర్మార్గులను, దుష్టులను, దోపికోర్లను అన్న మాటకు ఎంతో బాధపడడం చింతనీయం. మా తెలంగాణ వాళ్ళు మీ సీమాంధ్ర దోపిడి దార్ల చేతలవల్ల, ఉపాధి దొరుకక స్థలాంతరాలకు వెళ్ళి, జీవించగలిగినవాళ్ళు జీవిస్తూ, జీవిక దొరుకనివాళ్ళు చస్తూ ఉన్నారు. మీ నీళ్ళ దోపిడీ వల్ల మా తెలంగాణ ఎప్పుడో ఎడారిలా మారి, మాకు అరవై ఏళ్ళనుండి కష్టాలు పంచిపెడుతూనే ఉంది. మా కష్టాలు కష్టాలు కావు, కానీ, మీకు రాబోయే పగటి కల లాంటి కష్టాలే కష్టాలా? ఎంత న్యాయం మీ మాటల్లో ఉంది? పక్షపాతం అంత మితిమీరి పనికిరాదు. పైగా నిందించడం. మీరు చస్తే చావండి కానీ మమ్మల్ని శాపనార్థాలు పెట్టకండి...అని! మాట్లాడ్డానికి నీతి ఉండాలి. నాది గర్వం కాదు...ఆవేదన. మీకేం తెలుస్తుంది. అనుభవించినవాళ్ళకు తెలుస్తుంది.

శిష్టుఁడనని గర్వంబున
దుష్టతతో నిందమాట తూలియు నన్నున్
దుష్టుని పగిదిని బోల్చుట
శిష్టాచారంబు నగునె? చెలఁగుట కాదే?

కాలగతిలో మా తెలంగాణకు ద్రోహం చేసినవాళ్ళు తప్పక కలిసిపోతారు. మా ఉసురుపోసుకున్నవాళ్ళకు మా ఉసురు తప్పక తాకితీరుతుంది!

కామెంట్‌ను పోస్ట్ చేయండి