గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, డిసెంబర్ 01, 2013

రాయల తెలగాణమ్ము పేరిటను మాయలు చేయుట మానండయ్యా!“పది జిల్లాలతొ కూడిన కేవల
తెలగాణమ్మును ఇచ్చెదమయ్యా!
హైదరబాద్ మీ తెలంగాణదే!” 
అనుచును కేంద్రము ప్రకటన చేసియు, 
సీమాంధ్ర నాయకుల లాబీతో 
రాయల తెలగాణము నిచ్చెదమని 
మాయలు పన్నుట సబబేనా? 
మమ్ముల దోచిన వారినె మళ్ళా 
మాతో కలుపుట సబబేనా? 

మా అస్తిత్వము మాకు కావలెను!
మా ప్రాంతీయుల కోరిక యిదియే!

“అసెంబ్లీ పార్లమెంటు సీట్లను
రెండు వైపులా సమము చేయుటకు
రాయల తెలగాణమ్మే యుక్తము!”
అనగ తగదయా! నీతి కాదయా! 

భారతదేశమ్మందున నుండిన
యితర రాష్ట్రములతో సమమ్మగునె?
రాష్ట్రములన్నీ సమముగ నున్నవె?
సమము సమమ్మన, సమమే దిచ్చట? 

అఱువది యేడులు మ్రగ్గితిమయ్యా!
సీమాంధ్రులె మము దోచి రెంతయో!
అట్టివారలే మాతో కలియుట 
పాలించుటకే! దోచుకొనుటకే! 
మఱల మఱల ఇక మాకన్యాయము 
చేయుట కేంద్రమునకు తగదయ్యా! 

రాయల తెలగాణమ్ము పేరిటను
మాయలు చేయుట మానండయ్యా!
కుట్రలు చేయుట మానండయ్యా! 
తెలంగాణ అస్తిత్వము నిప్పుడు 
దెబ్బతీయుట తగదు తగదయా! 

హైద్రబాదుతో కూడినట్టిదౌ
పదియు జిల్లాల తెలంగాణమే
మాకు కావలెను! మాకు కావలెను! 
వేరే దేనిని ఒప్పుకోమయా! 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Bahusa meeku teliyademo............rayala telangana ki oppukunnadi madhyemargam ga.....asalu aa pratipaadana techindi .....koodaa ka cha ra kutumbame. Nijaalu vetukkondi chetanaite....evarino deniki aadiposukovadam.......chivariki meeku dakkedenti?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

జవరావా! ప్రత్యేక తెలంగాణకోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీ.ఆర్.ఎస్. ఎలా రాయల తెలంగాణ ప్రతిపాదనతెస్తుందనుకొన్నావ్? పైగా తెలిసినట్టు పోజులు! ఇప్పుడు తెలిసిందా, కేంద్రం ఏ తెలంగాణకు నడుం బిగించిందో? ఆడిపోసుకొనేవారు మీరా, మేమా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి