“పది జిల్లాలతొ కూడిన కేవల
తెలగాణమ్మును ఇచ్చెదమయ్యా!
హైదరబాద్ మీ తెలంగాణదే!”
అనుచును కేంద్రము ప్రకటన చేసియు,
సీమాంధ్ర నాయకుల లాబీతో
రాయల తెలగాణము నిచ్చెదమని
మాయలు పన్నుట సబబేనా?
మమ్ముల దోచిన వారినె మళ్ళా
మాతో కలుపుట సబబేనా?
మా అస్తిత్వము మాకు కావలెను!
మా ప్రాంతీయుల కోరిక యిదియే!
“అసెంబ్లీ పార్లమెంటు సీట్లను
రెండు వైపులా సమము చేయుటకు
రాయల తెలగాణమ్మే యుక్తము!”
అనగ తగదయా! నీతి కాదయా!
భారతదేశమ్మందున నుండిన
యితర రాష్ట్రములతో సమమ్మగునె?
రాష్ట్రములన్నీ సమముగ నున్నవె?
సమము సమమ్మన, సమమే దిచ్చట?
అఱువది యేడులు మ్రగ్గితిమయ్యా!
సీమాంధ్రులె మము దోచి రెంతయో!
అట్టివారలే మాతో కలియుట
పాలించుటకే! దోచుకొనుటకే!
మఱల మఱల ఇక మాకన్యాయము
చేయుట కేంద్రమునకు తగదయ్యా!
రాయల తెలగాణమ్ము పేరిటను
మాయలు చేయుట మానండయ్యా!
కుట్రలు చేయుట మానండయ్యా!
తెలంగాణ అస్తిత్వము నిప్పుడు
దెబ్బతీయుట తగదు తగదయా!
హైద్రబాదుతో కూడినట్టిదౌ
పదియు జిల్లాల తెలంగాణమే
మాకు కావలెను! మాకు కావలెను!
వేరే దేనిని ఒప్పుకోమయా!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
మీకు రాయల తెలంగాణా వద్దు అనేంత సీన్ లేదు. ఈ రోజు రాజ నరసిమ్హం గారు అధిష్టానం దె నిర్నయం అంట్టు మళ్లి పాత పాట అందుకొన్నాడు. అక్కడికి మీ పొరాటాల వలన తెలంగాణా ఇస్తున్నట్లు భావిస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టి ఎన్నికలలో గెలవటానికి ఇస్తున్నారని. రోజు మీ కవితలతో మా బుర్ర తినకండి.Thanks,
చూడు అజ్ఞాతా! సూటిగా ఎదుర్కొనే సత్తా లేక, పేరుచెప్పుకొనే ధైర్యం లేక, దొంగలాగా వ్యాఖ్య రాస్తునావంటేనే తెలుస్తోంది...ఎవరికెంత సీనుందో! మా పోరాటాల వల్లనే తెలంగాణ వస్తోంది.
అంత ఏడుపు ఉంటే...నిన్నెవడు ఈ బ్లాగును చూడమన్నాడు, ఇలా కొజ్జా వ్యాఖ్యలెవడు రాయమన్నాడు? నా కవితలు అంతగా నీలాంటి పనికిరానివాళ్ళ బుర్రలు తింటున్నాయంటే, చాలా ఫలితం సాధించినట్టే మరి! కవితలు చదవడం వద్దనుకొంటే చూడకు, నన్ననటానికి నీ కెవడిచ్చాడు అధికారం? అనామకుడివి అలాగే వుండు. స్పందించకు. పెద్ద తెలిసినట్టు ఫోజులూ నువ్వూ. ఇంకోసారి అజ్ఞాతగా పనికిరాని వ్యాఖ్యలు రాయకు. రాస్తే హుందాగా వ్యవహరించు. లేకుంటే మానెయ్. వెధవ సలహాలివ్వకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి