గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, డిసెంబర్ 28, 2013

కొలువుల దోపిడీకి కుట్ర!!


రాష్ట్ర విభజనపు శుభతరుణమ్మున
సీమాంధ్రుల కుట్రలు ఏలా?
ట్రాన్స్ కో పునర్వ్యవస్థీకరణము
పేరిట మోసము చేయుటకే!

పునర్వ్యవస్థీకరణమ్మెందుకు?
రాష్ట్రమేర్పడగ నున్నదిగా!
ఎవరి రాష్ట్రమున వారలె చేయుడు
పునర్వ్యవస్థీకరణమునున్!

దురాశతో కుట్రలతో సీమాం
ధ్రులు చేపట్టిరి శీఘ్రముగా!
తెలంగాణ ఇంజనీర్లు ఉద్యో
గులకన్యాయము చేయుటకే!

రాష్ట్ర విభజనము జరుగు ఈ తరిని
పదోన్నతుల పేరిట మోసాల్
చేయగ బూనిరి సీమాంధ్రులిచట
తెలగాణకు వ్యతిరేకముగా!

తెలగాణకు దక్కగ వలసిన వగు
మూడు వందల పోస్టులనున్
సీమాంధ్రులు తన్నుకు పోవుటకయి
కుట్రపన్నిరయ దౌష్ట్యముతో!

ప్రతివత్సరమున ఏప్రిల్ నెలలో
ఈ ప్రక్రియ చేపట్టంగన్
టీవోవో స్పష్టము చేయంగను
ఇప్పుడు చేయుట మోసముకే!

నిబంధనమ్ములు తుంగలో తొక్కి
అక్రమపదోన్నతులనిడగన్
తెరలేపుట యిది తెలంగాణమును
దోచుకొనుటకే! దోపిడికే!!

మానుడు మానుడు మానుడు మానుడు
దొంగవేషాలు మానుడయా!
ఇకనుంచియు మీ ఆటలు సాగవు
తోకముడిచి కూర్చొనుడోయీ!!

విద్యుదుద్యోగులారా లెండయ
పదోన్నతులు వద్దనుడయ్యా!
తిప్పికొట్టుడీ కుట్రలనిప్పుడు
ఉద్యమాన్ని చేపట్టుడయా!!

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి