గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, డిసెంబర్ 30, 2013

ఇదే మీకు ప్రాయశ్చిత్తం!

బడా బాబులూ! బడాయి చాలును!
ఎడారి అయ్యిన తెలంగాణమును,
లడాయి చేయక, తడార నీయక,
కాపాడ రేలయా!!
***   ***   ***


ముఖ్యమంత్రి నువు తెలంగాణకా?
సీమాంధ్రక? మరి, యీ రెండిటికా?
సీమాంధ్రకు నీ పక్షమేలనయ?
న్యాయమిద్దియేనా?

"తెలంగాణ నా చేతను లేదయ!
కేంద్రమే యిడిన తలదాల్చెదనయ!"
అని నాడు పలికి, తప్పుటేలయా?
నీ వర్తన మిదియా?


జగను బాబు! నువు నాడేమంటివి?
తెలంగాణదౌ సెంటిమెంటునున్
గౌరవింతునని నీవనలేదా?
బొంకుటేలనయ్యా?

"ఆర్టికలు మూడు ప్రకార మప్పుడు
కేంద్రమే తెలంగాణ మీయవలె!
నా చేత ఏమి లే"దని, ఇప్పుడు
మడమ తిప్ప నేలా?    


రెండు కండ్ల ఓ ఆంధ్రాబాబూ!
తెలంగాణముకు అనుకూలమ్మని
తెరాస పొత్తున ఓట్లను పొందియు,
ఇప్పుడడ్డనేలా?

"అసెంబ్లిలోపల తెలంగాణపై
తీర్మానమ్మును నేను పెట్టనా,
మీరు పెట్టెదర? చెప్పండో"యని,
ఇప్పుడడ్డనేలా?


అశోకబాబూ! శోకమ్మేలా?
దొడ్డి దారిన పదోన్నతి పొందియు,
హైదరబాదున అడుగెట్టిన నువు
న్యాయ పంథివేనా?

అక్రమమ్ముగా మా కొలువులెన్నొ
మీ సీమాంధ్రులు కొల్లగొట్టుటయె
మీకు న్యాయమా? మాకు న్యాయమా?
దౌర్జన్యమ్మేలా?


లోకసత్త మేధావీ! నాడట
తెలంగాణముకు పరిష్కారమును
త్వరగా నిడుడని, నేడు సీమాంధ్ర
పాటపాడుటేలా?

నాడొక రీతిగ, నేడొక రీతిగ
తెలంగాణమును చూచుట తగునా?
విభజన చేయుటె పరిష్కారమని
నీకు తెలియదోయీ?

***   ***   ***
సమ్మతి తెలిపిరి నాడందరలా!
కేంద్రము తెలగాణా నిడునా? యని!
కేంద్రమ్మిప్పుడు పూనుకొనంగను
నీతిమాలిరంతా!!

పశ్చాత్తాపము లేదా మీకిక?
తెలంగాణముకు అడ్డుపడకుండ
ప్రాయశ్చిత్తము చేసుకొండయా!
నీతి నిల్పుడయ్యా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి