సమైక్యాంధ్రయె వలయునంచును
తెలంగాణము బిల్లు వచ్చిన
అసెంబ్లీలో ఓడజేతుమ
టంచు పలుకకయా!
బిల్లు వచ్చిన చర్చ సేయుడు!
రాదు ఓటింగునకు నదియే!
ఆర్టికలు మూడునను నిదియే
చెప్పబడెనయ్యా!
అవిశ్వాసమదేమియైనను
పార్లమెంటున తెలంగాణము
బిల్లు పెట్టుట తథ్యమయ్యా!
కండ్లు తెరువుడయా!
గౌరవము కాపాడుకొని మీ
రిట్టి బిల్లును చర్చ సేయుడు!
పెద్దరికమును నిలుపుకొనుడయ!
వెలిగిపోవుడయా!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
4 కామెంట్‌లు:
గుండువారూ,
నా స్పందనను ఆశ..దోశ.. అంటే సరా? అనే టపాలో చూడండి. దయచేసి ఈ నా స్పందనను వ్యక్తిగతంగా తీసుకోవలదని విన్నపం.
తాడిగడపవారూ, వ్యక్తిగతంగా స్పందించి, టపా పెట్టి, అది వ్యక్తిగతంగా తీసుకోవలదంటే ఎలా?
>ఆ టపా శీర్షిక చూస్తే వెక్కిరింత, విషయప్రస్తారం చూస్తే బుజ్జగింపుధోరణిలో బెదిరింపు!
ఇందులో రెండు ఆశలున్నాయి! ఒకటి బిల్లు ఓటింగుకొస్తే ఓడిద్దామనే ఆశ. రెండు అవిశ్వాసం. ఈ రెండూ జరగనివే...! అందుకని వెక్కిరింత! ఇది ’బుజ్జగింతతో కూడిన బెదిరింపు’ కాదు. బుద్ధి చెప్పడం. అపహాస్యం పాలుగాకుండా జాగ్రత్తపడమని హెచ్చరిక! అంతే! నేను మీ అభిప్రాయంతో ఏకీభవించను! ఎవరి అభిప్రాయం వారిది. ఎవరి నమ్మకం వారిది.
స్పందించి టపా పెట్టినందుకు అభినందనలు!
గుండువారూ,
ఎవరు స్పందించినా వ్యక్తిగతంగానే కదండీ, ఒక సంస్థతాలూకు కార్యనిర్వాహకవర్గసభ్యుడు ఐతే తప్ప వేరే విధంగా స్పందించే పరిస్థితి ఉండదు కదా. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించనవుసరం లేదు. మన నమ్మకాలూ, అభిప్రాయాలూ వేరుగా ఉండవచ్చును దానికేమి. ఇందులో ఎవరూ కించపడవలసిన అగత్యం లేదు. మీ అభిప్రాయాలతో విబేధించినా వ్యక్తిగతంగా నాకు మీ పట్ల గల గౌరవభావంలో లోపం ఏమీ లేదండి. మరొక సారి, మీ అభినందనలకు ధన్యవాదాలు.
తాడిగడపవారూ, మొత్తానికి మీ స్పందన వ్యక్తిగతమేనన్నమాట! మొదట కాదన్నారు. ఇప్పుడు ఔనన్నారు. పోనీలెండి ఒప్పుకున్నారు. సంతోషం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి