గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 12, 2013

మాయకుల నిలుపు! అమాయకుల గెలుపు!


అమర వీరుల తలపు
స్వీయ రాష్ట్రపు గెలుపు
ఘన చరిత్రకు మలుపు
నా తెలంగాణ!

మనకు స్వేచ్ఛను దెచ్చు
స్వీయ కాంక్షల నిచ్చు
సకల జనులును మెచ్చు
నా తెలంగాణ!

మనదె యిక పాలనము
సంస్కృతుల మేళనము
సన్మార్గ శోధనము
నా తెలంగాణ!

ఇచటి కొలువులు మనవె
ఇచటి నిధులును మనవె
ఇచటి నీళ్ళును మనవె
నా తెలంగాణ!

దౌర్జన్య నాశకము
సౌజన్య పోషకము
సందీప్త భాజకము
నా తెలంగాణ!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

bluecake చెప్పారు...

entha amaayakulante, mem thinnamantaare gaani,em thinnamante lekkalu cheppalentha amaayakulu

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అంత వ్యంగ్యం అక్కరలేదు . మేం అమాయకులం కాబట్టే మీ ఆటలు సాగాయి! మీ దోపిడీ కొనసాగింది! ఇప్పుడే తొందరెందుకు? ముందుంది ముసుర్ల పండుగ! చిత్రగుప్తుని చిట్టా పద్దులు బయటపెట్టే కాలం దగ్గరకొచ్చింది! తినబోతూ రుచి అడగడం ఎందుకు? లెక్కలన్నీ మీరే చూస్తారుగా! తొందరేల?

కామెంట్‌ను పోస్ట్ చేయండి