గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, డిసెంబర్ 15, 2013

ఇదేనా నీ ఔన్నత్యం?


వచ్చెనసెంబ్లీముందుకు తెలంగాణ బిల్లు;
కేంద్ర విధేయుడవైతే కాకోయీ ముల్లు!

బిల్లునడ్డుతానంటే చూస్తూ ఊర్కుంటామా?
న్యాయమైన తెలంగాణ సాధింపక మానెదమా?

జగనుబాబు, చంద్రబాబుతోడ కలసిపోరినా;
కేంద్రం ప్రతిపాదనమ్ము వ్యర్థం అయిపోవునా?

కుక్కయె బెదరించి చెప్పునెత్తుకొనియు పోయినట్లు;
మీరలు బెదరించి యిపుడు తెలంగాణ నాపుదురా?

ఇప్పుడు కాకున్న రేపు తెలంగాణ వచ్చునయా!
కల్లు తాగినట్టి కోతివలె చిందులు వేయకయా!

ఔన్నత్యం ప్రదర్శించి ఘనతను సాధించుమయా!
ముఖ్యమంత్రి పదవికున్న గొప్పతనం పెంచుమయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


2 కామెంట్‌లు:

sandeepreddykothapally చెప్పారు...

అడ్డగాడ్దుల కెట్ల అర్ధమైతదే అన్న
అమ్మపాలు తాగి వాళ్లు రొమ్ము గుద్దె బడుపలు

ఆవేదన అక్కర్లేదు
పోరాటం మన ఊపిరి
ఎవ్వడొచ్చినా తెలంగాణ
రాష్ట్ర మొచ్చి తీరుతుంది

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సోదరా! మనలోని ఈ పోరాట పటిమ వల్లనే మనకు తెలంగాణ రాబోతోంది. పోరాటం తప్పేటట్లు లేదు. మనం సిద్ధంగా ఉండాలి. స్పందించినందుకు ధన్యవాదాలు తమ్ముడూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి