గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, డిసెంబర్ 08, 2013

మళ్ళీ అవే కూతలు!


తెలంగాణ రాష్ట్ర మిడగ
కేంద్రము సమకట్టగాను,
అసెంబ్లీకి బిల్లు రాగ
నోడింతుమనంగ నేల?

బిల్లు పైన చర్చ జరిపి,
కేంద్రమునకు పంపకుండ,
ఓటింగును జరిపెదనని
బీరమ్ములు పలుక నేల?

రాజ్యాంగములోని ఆర్టి
కలు మూడు ప్రకార మిపుడు
చర్చ చేయవలెను గాని,
ఓటింగ్ అనవసరమె కద!

తెలంగాణ రాష్ట్ర మిడిన
నక్సలైట్లు పెరిగెదరని
ప్రతి చోటను ప్రతి పూటను
మరల మరల వాగ నేల?

నీవుండే సొంత జిల్ల
చిత్తూరున ఉన్నయట్టి
పుత్తూరున ఉగ్రవాదు
లుండి తిష్ఠ వేయలేదె?

హైద్రబాదులోన బాంబు
ప్రేలుళ్ళరికట్టావా?
నీ పాలనలో జరిగిన
ఉగ్రవాదమాపావా?

తెలంగాణ నీళ్ళు దోచి, 
రాష్ట్రమేర్పడంగానే,
నీటి గొడవ లొస్తాయను
నంగనాచి కబుర్లేల?

తెలంగాణలో విద్యుత్
ప్లాంట్ల నేల పెట్టలేదు?
ఆంధ్రలోనె పెట్టగాను
మోసము చేయుట కాదా?

తెలంగాణ “కొలువు”లన్ని
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “వనరు”లన్ని
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “నిధు”లన్నియు
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “నీళ్ళ”న్నియు
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “భూము”లన్ని
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలగాణను నష్టపరచి,
రాష్ట్రమేర్పడిన నష్టము
కలుగునంచు దొంగ ఏడ్పు
లేడ్వంగనె సరియౌనే?

సీమాంధ్రకు మేలుచేయు
పనులెన్నో చేయలేదె?
ఆరువేల కోట్లు నీవు
చిత్తూర్ కొనిపోలేదే?

ముఖ్యమంత్రి మాటలివా?
సీమాంధ్రుని మాట గాని!
నీతి గలుగు చేతలివా?
నీతి లేని పనులు గాని!

కల్లబొల్లి ఏడ్పులాపి,
అడ్డుపడే చేత లాపి,
అబద్ధాల కూత లాపి,
నీతిలేని కుట్ర లాపి,
అరువదేండ్ల కాంక్షయైన
తెలంగాణ రాష్ట్రానికి
స్వాగతమ్ము పలుకవయా!
హుందాగా ఉండవయా!
ఘనతను నువు పొందుమయా!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


2 కామెంట్‌లు:

విశ్వరూప్ చెప్పారు...

మధుసూదన్ గారూ,

మీకవితలు బాగున్నాయి. ఏదైనా పత్రికకు పంపే ప్రయత్నం చేయగలరు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు విశ్వరూప్ గారూ! పత్రికలకు పంపడానికి సరైన దారి తెలియదు. ఉంటే తెలుపగలరు.
నా మెయిల్ చిరునామా: gundumadhusudhan555@gmail.com

నా మరోబ్లాగ్ :మధుర కవనం (madhurakavanam.blogspot.in) చూచి మీ అభిప్రాయం తెలుపగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి