అటు తెలంగాణ, సీమాంధ్ర నిటు బిగించి,
జోడు గుఱ్ఱాల స్వారి మోజున్న నీవు
నెట్లు నడిపెదవోయి? నీ పాట్లు కనఁగ,
నవ్వు పుట్టుచునున్నది! నవ్యమైన
నీదు సీమాంధ్రఁ గోరి, మా నిత్య నూత్న
మౌ తెలంగాణ విడువుము! మాన్యతఁ గన,
నేక ప్రాంతమే సరి నీకు నిజముగాను!
రెండు కండ్ల సిద్ధాంతమ్ము మొండిదాయె!
నీ సమన్యాయ నినదమ్ము నింగి కెగసె!
నేదొ యొక్కటి నీకున్న, నిన్ను నమ్మి,
జనులు గొల్తురు! కాన, నీ స్వాంతమందు
నీకుఁ గలయట్టి కోర్కిని నిపుడు వీడి,
జోడు గుఱ్ఱాల స్వారీని వీడుకొలిపి,
నీదు సీమాంధ్ర మేలెంచ నిలిచి పొమ్ము!
మా తెలంగాణఁ బాలింప మౌఢ్యమె యగు!
ఆశ వీడుము! పదవికై యార్తి వీడి,
ప్రజల మనమున స్థానమ్ముఁ బదిల పఱచు,
సవ్యమౌ కార్యములు సేసి, శాంతిఁ గొనుము!
మా తెలంగాణ రాష్ట్రమ్ము మాకునగును!
మీకు నాంధ్రప్రదేశమ్ము మిగులు సుమ్ము!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!