గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

తెలంగాణ ప్రథమ విజయం!

నా తెలంగాణ సోదరులకు
శుభాకాంక్షలు!!


సిరులు తొలుకాడు తెలగాణ సీమ నేఁడు
సంతసమ్మునఁ దేలి, ప్రశాంత మాన
సాబ్జ యయ్యెఁ గేంద్రామోద సాక్ష్యమైన
ప్రకటనా పత్రమునుఁ జూచి వఱలి యిచట! (1)

అఱువదేండ్ల నిరీక్షణ హర్షపూర్ణ
మాయె నేఁడు కేంద్రమ్మిడె న్యాయమైన
తీర్పు! సీమాంధ్ర ఘటిత విదీర్ణ హృదయ
మీ దినమ్ము చికిత్సచే మోదమందె!! (2)

నా తెలంగాణ సోదరా! నవ్య రాష్ట్ర
మీ తెలంగాణ, వెలిఁగించు నీదు బ్రతుకు!
స్వేచ్ఛనందిన హృదయానఁ జేయుమయ్య
"జై తెలంగాణ" గానమ్ము సంతసమున!! (3)

కేంద్ర సంకల్ప సాధనా కీర్ణమైన
చర్య నీ దినమునఁ బ్రయోజన కరమని
పరవశమ్మునఁ బ్రజలంత స్వచ్ఛమైన
మనముతో స్వాగతించిరి ఘనముగాను!! (4)

అఱువదేఁడుల యాఁకలి యాఱునంచు
నాశతోఁ జూచు తెలగాణ నాయకులకుఁ
జేతు జేజేలు, నతులు విశేషముగను
నా తెలంగాణ రాష్ట్ర సంజనిత తుష్టి!! (5)

కేంద్ర ప్రకటన మాత్రాన గృహము నలికి,
పండుగను జేసికొనఁగాను వలదటంచు,
మనసు బోధించు చున్నది; మన స్వరాష్ట్ర
మేర్పడెడు దాఁక నిత్యము హితముఁ గోరి,
యెదిరి కదలికల్ తెలివితో నెఱుఁగ వలయు;
దానఁ దెలగాణ రాష్ట్రావతరణ మగును!! (6)

జై తెలంగాణ!                           జై జై తెలంగాణ!!

7 కామెంట్‌లు:

Mandhubabu చెప్పారు...

mee andhari poraataniki thagina prathiphalamu dakkindhi. jai telangana.. sir hats off to u...

Mandhubabu చెప్పారు...

Jai telangana.... mee andhrari porataala palithame e telangana.. mee kandhariki hatss off.

evariki veelina reethilo vaalu porataalu chesaaru.

mee lanti vaaru nternet lo mana telanganaki full support ichharu.

mee andhariki hats off..

plz andharu ee vidanga poratamu chesina mana migitha sulandhirini encourage cheyyandi. vallaki kruthhhhhhhhhhhhhhhhhhhalu telupandi.

valalu enni avamaadhurkunnaro.. enni kastallu paddaro.. enni boothulu chadivaaro. eenni bedirinpu comments chusaaro oka pouridigaa nenu arthamu chesukogalanu.

thanks annaaa..

keep it up.

hats of to u..

jai telanganaaa...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు Mandhubabu గారూ! సీమాంధ్రులు కక్కే విషాన్ని నిర్వీర్యం చేయాల్సిన క్షణాలు ముందున్నాయి. అందరం కలిసికట్టుగా వారి దుశ్చేష్టల్ని ఎదుర్కోవాల్సివుంటుంది. సిద్ధంగా వుండండి. ఈ బ్లాగుని రెగ్యులర్‍గా చూస్తున్నందుకు ధన్యవాదాలు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

చాలా బాగా రాశారు - మీరు సెలవిచ్చినట్లు ఈ సమయంలో జాగరూకత ఎంతో అవసరం.
5 వ పద్యంలో నుతులు రాయబోగా నతులు అని పడిందా అని నాకు సందేహం కలుగుతున్నది?
అలా కాకున్న నాకక్కడ అర్థం గోచరించుట లేదు - వివరించ మనవి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలండీ మాతం మల్లికార్జున స్వామి గారూ!
"అఱువదేఁడుల యాఁకలి యాఱునంచు నాశతోఁ జూచు తెలగాణ నాయకులకు నా తెలంగాణ సంజనిత తుష్టిచే విశేషముగను జేజేలు, నతులుఁ జేతును" అని నా భావన. "నతులు" అనగా నమస్కారములు అని అర్థం.
ఇలాగే ఈ బ్లాగును చూస్తూ నన్ను ప్రోత్సహించగలరు. నమస్కారాలతో....స్వస్తి.

అజ్ఞాత చెప్పారు...

@Madhusudhan,
A question for you since you are 'Telugu' sahityaabhimaani. Suppose your Telugu teacher visits you, what words will you utter while inviting him into the house?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

@అజ్ఞాతకు,
మీరు ఈ ప్రశ్న నన్నడగవలసింది కాదనుకుంటాను. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు తెలుగు వారైయుండి, ఆంగ్లంలో రాశారు. మన తెలుగు భాషకీ దుర్గతి పట్టిందంటే..పట్టదా మరి?
ఇక మీ ప్రశ్నకు నా జవాబు:

మా తెలుగు భాషోపాధ్యాయులు మా ఇంటికి వస్తే....

"ఓ గురూత్తమ! నా కిట్టి యుద్యమమునఁ
బ్రజల మేల్కొల్ప నిచ్చితి పద్య విద్య!
తమదు పాదాబ్జముల వ్రాలి, దండము నిడి,
వేగ తరియింతునయ్య యివ్వేళలోన!!"

అని పాద ప్రక్షాళన చేసి, ఇంట్లోకి ఆహ్వానించి, సేవచేసి, తరిస్తాను!

కామెంట్‌ను పోస్ట్ చేయండి