గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, డిసెంబర్ 25, 2013

విలీనం చేస్తే...అమరవీరులు బతికొస్తారా?


టీఆరెస్‍పై "వేటు" వేయుటకు
టీడీపీ సమకట్టుట సబబా?
ఆంధ్రాబాబును ఆశ్రయించుటయె
తెలంగాణముకు ద్రోహముకాదా?

తెలగాణ మిడిన టీఆరెస్సును
విలీనము చేతునని కేసీఆర్
చెప్పిన మాటలు నిజమే కానీ
ఎప్పుడు చెప్పెనొ గుర్తుకున్నదా?

ఎన్నో సమ్మెలు ఉద్యమాల్ జరిగె
అన్నీ చూచి సహింపలేకయే
కేసీఆర్ విలీనమ్మనెనయ!
అప్పుడు కేంద్రము తెలగాణమిడెనె?

ఆలస్యమ్మే ఎంతో జరిగెను!
వేయిమంది బలిదానాల్ జరిగెను!
తెలగాణకెంతొ నష్టము జరిగెను!
అయినా తెలగాణమునిచ్చారా?

నేడు తెలగాణమిత్తుమనుటలో
స్వార్థమ్మే మరి దాగున్నదయా!
కాంగ్రెసు లాభము కోరి తెలగాణ
నీయబూనెనయ! ప్రేమ కాదయా!

వేయిమంది బలిదానము పిమ్మట
తెలగాణమ్మిడ బ్రతికివత్తురే?
విలీన మెట్టుల చేయుమందురయ?
బానిస మాటలు మానండయ్యా!

మూడు వాదాలు గల టీడీపీ
వదలకుండి తము పట్టుకొనుటయే
తెలగాణమునకు ద్రోహము కాదా?
మూడు నాలుకల ముచ్చట్లేలా?

సమన్యాయమ్మును ఒక్కండడుగును!
"సమైక్యాంధ్ర"మని వదరు నింకొకడు!
బెదరుచు తెలగాణిమ్మను నొక్కడు!
మూడు నాలుకల వాదమిదయ్యా!!

ఆంధ్రాబాబును వీడండయ్యా!
తెలంగాణకై ఉద్యమింపుడయ!
పరుల నిందించు మాటల వీడియు
ప్రజాభీష్టమును నెరవేర్చుడయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

13 కామెంట్‌లు:

Trader చెప్పారు...

evado sachchadu ani telangana istunnara ?? lol.. aa bhrama nunchi baitaki Randi.. votelu, seat lu raavu ante anni party lu reppoddune TG ni theeskelli moosi nadhi lo padestai..

Jai Gottimukkala చెప్పారు...

తెరాస విలీనం కావడం సరి కాదు. తెలంగాణా పునర్నిర్మాణం కావాలంటే తెరాస తన సొంత ఉనికిని కాపాడుకుంటూ పోరాటం కొనసాగించాలి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఓ Usine de Largent !

నువ్వు మాట్లాడే మాటలు మా అమరవీరుల బలిదానాలను కించపరుస్తున్నాయి. హృదయం లేనట్టు మాట్లాడకు. తెలంగాణకై తాము తమ ప్రాణాలనే బలిచేసుకున్నారంటే వాళ్ళ త్యాగం ఎలాంటిదో అర్థం చేసుకో. ఎగతాళి చేయకు. వాళ్ళ బలిదానం వల్లనే నేడు తెలంగాణ ఏర్పాటుకు బాట పడింది. సీమాంధ్ర నాయకుల దగుల్బాజీ వేషాలు వెల్లడయ్యాయి. ఓటు రాజకీయమే తెలంగాణకు మార్గం సుగమం చేసింది. తెలంగాణ ఇస్తేనే కాంగ్రెస్‍కు బతుకుదెరువున్నది. ఓట్లు సీట్లు రావు అని తెలిస్తే, తెలంగాణను మూసీలో కలిపేస్తారని నువ్వంటున్నావు. తెలంగాణ రాకుంటే, ఈ పార్టీలను తీసుకెళ్ళి మూసీలో వేస్తారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణకు ఏ పార్టీ పూనుకుంటే ఆ పార్టీకే తెలంగాణలో మనుగడ ఉంటుంది. తెలంగాణ వస్తుంది. మా అమరవీరుల త్యాగం ఫలిస్తుంది!

మీ వ్యాపారంలో మీరు లాభనష్టాలవైపు ఊగిసలాడినట్టే, రాజకీయనాయకులు ఓట్లకై జయాపజయాలవైపు ఊగిసలాడుతూ ఉంటారు. మీకు లాభమో, నష్టమో ఉన్నట్లే, వాళ్ళకు కూడా జయమో, అపజయమో ఉంటుంది. ఏం చేస్తే గెలుస్తామో తెలుసుకోవడంలో తప్పటడుగులు వేస్తుంటారు. తెలంగాణ టీ.డీ.ఫీ.వాళ్ళుకూడా దానికి అతీతులు కారు. ప్రజల అభీష్టం తొందరగా ఎలా నెరవేరుతుందో ఆ దారిని ఎంచుకొంటే విజయం తథ్యం. తెలంగాణ కోసమే ఏర్పడిన టీఆర్‍ఎస్‍ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే అంతే సంగతులు.

నీవు వ్యంగ్యంగా అమరవీరులను చులకన చేయడం కుసంస్కారానికి నిదర్శనం. ఇది అజ్ఞాన వాక్కుగా మన్నిస్తున్నాం.

ఆ భగవంతుడు ఇతనికి సంస్కారం ఇచ్చుగాక.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిజం చెప్పారు ’జయ్’ గొట్టిముక్కలగారూ!

Unknown చెప్పారు...

చెయ్యకుంటే మాత్రం, తెలంగాణా వస్తే మాత్రం అమరవీరులు బ్రతికి వస్తరా? తెలంగాణా వస్తే మీ KCR విలీనం చేస్తనని చెప్పిండు.ఇప్పుడొచ్చాక విలీనం చెయ్యమంటే అమరవీరులు బ్రతికొస్తరా అంటూ లొల్లి చేస్తుండ్రు. ఇప్పుడు మా కాంగ్రెస్ ఇస్తుంటే స్వార్థం అంటుండ్రు. తెరాస ఇప్పుడు విలీనం కాకుంటే తెరాసది కూడా స్వార్థమే అనాల్సి వస్తుంది.

వజ్రం చెప్పారు...

తెలంగాణా రాకపోతే బతకలేమని ప్రచారం చేసి ముక్కుపచ్చలారని పిల్లల ప్రాణాలు తీసుకున్నారు. తిరిగి దానికి కూడా మరెవరినో భాధ్యులను చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. పిల్లలలో ఆత్మ విశ్వాసం పెంచండి. వారికి బతకడం ఎలాగో నేర్పండి.
సత్యం శాశ్వతం. ధర్మం సార్వజనీనం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి Unknown గారూ! అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయకండి. మీ కాంగ్రెస్ కేసీఆర్ విలీనం చేస్తానన్నప్పుడే తెలంగాణ ఇచ్చి, టీఆర్‍ఎస్‍ను విలీనం చేసుకోవాల్సింది. సమయం మించిన తర్వాత, మా వేయి మంది అమరవీరులు బలిదానం చేస్సిన తర్వాత, ఇంతకాలానికి సంపూర్ణ తెలంగాణ, షరతులు లేని తెలంగాణ ఇవ్వకుండా, అసంపూర్ణ తెలంగాణ బిల్లును పంపి, ఉద్యమపార్టీని నిందించడం తగదు. ఇప్పటికైనా సంపూర్ణ సర్వ స్వతంత్ర తెలంగాణకై కృషిచేయండి. సకల ప్రజల ఆదరాభిమానాలు చూరగొనండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

వజ్రంగారూ! ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు, మనకు కాదన్నట్టున్నాయి మీ మాటలు! మీ సీమాంధ్ర (నేతలు, పెట్టుబడిదారులు, అక్రమోద్యోగుల) వల్లనే మా తెలంగాణ దోపిడీకి గురైంది. ఇంకా దోచాలని కుట్రలు పన్నుతున్నారు. ఈ నీతులు మీ వారికి చెప్పండి. మేం అణచివేతకు గురై ఉన్నాం. ఇంకా మమ్మల్నే అనడం సబబుకాదు. ఉద్యమ పార్టీ ఎవరినీ బలితీసుకోలేదు. మీ సీమాంధ్ర నాయకుల కుతంత్రాలవల్లనే బలియైనారు. వాళ్ళ మరణవాఙ్మూలాల్ని చదవండి. తెలుస్తుంది. మేం పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచడం కోసమే, స్వార్థ నేతలకు బుద్ధి రావడం కోసమే నిరంతరం ప్రయత్నిస్తున్నాం. అస్త్యపరులు, అధర్మపరులు ఐన సీమాంధ్ర నేతలకు నీతులతోపాటు ఇంత గడ్డి పెట్టండి. వాళ్ళు కేంద్రానికి ఏం చెప్పి, లేఖలు రాసి, కేంద్రాన్ని తెలంగాణ ఇవ్వడానికి సమ్మతింపజేశారో తెలుసుకోండి. కేంద్రం తెలంగాణ ప్రకటించింతర్వాత ఎందుకు మాటమార్చారో కనుక్కోండి. గాయం మీ దగ్గరే ఉంటే, మందు తెలంగాణకు పూస్తారెందుకు? ధర్మపన్నాలు సీమాంధ్రకు చెప్పండి.
స్పందించినందుకు కృతజ్ఞతలతో...

hari.S.babu చెప్పారు...

బలే తెలివి! విలీనం చేస్తే బతికొస్తారా అని మీరే అంటున్నారు, మళ్ళీ యెదటి మనిషి మీ మాటనే రెపీట్ చెయ్యగానే అతనేదో తప్పు మాట్లాడినట్టు గద్దిస్తున్నారు!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా మాటలు మనసున్నవాళ్ళకు అర్థం అవుతాయి. కాంగ్రెస్, మా వేయి మంది పిల్లలు ఉద్యమానికి ఆహుతికాకముందే తెలంగాణ ఇచ్చి, తె.రా.స.ను విలీనం చేసుకోవలసింది. ఇప్పుడు విలీనం చేస్తే, ఆ అమరవీరులను బ్రతికించి తెస్తారా? కాంగ్రెస్ నేతలు, సీమాంధ్ర నేతలు వేయిమంది పిల్లల్ని బలితీసుకున్నారు. ఇంకా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. పైగా మీలాంటి వాళ్ళూ మమ్మల్నే "బలే తెలివి" అంటూ హేళన చేస్తున్నారు. మనస్సుపెట్టి ఆలోచించండి. తెలుస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టి వాళ్ళను వెనకేసుకురావడం మీకే చెల్లింది.

Unknown చెప్పారు...

"ఇప్పుడు విలీనం చేస్తే, ఆ అమరవీరులను బ్రతికించి తెస్తారా?"అని మాటిమాటికీ అంటుండ్రు. విలీనం చేయకుంటే మాత్రం మీరు బ్రతికించి తెస్తరా అంటున్నము.అవునండీ.మేము చేతులు కాలాక ఆకులు పట్టుకున్న వాళ్ళమే అనుకోండ్రి. ఐనా తెలంగాణను ఇప్పుడిస్తున్నది మా కాంగ్రెస్సే అని గుర్తు పెట్టుకోండ్రి.మా కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినంక మీరు ఇంతకాలం విలీనం అనే ప్రశ్నే రాకపోవడం ఏరు దాటినాక తెప్ప తగలేసే రకం అని అనుకోవల్సివస్తుంది.

Unknown చెప్పారు...

మా వేయిమంది పిల్లలు అంటున్నరు, "మా" కాదు "మన" అది గుర్తుపెట్టుకోండ్రి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అయ్యా Unknown గారూ! పనుల ఒత్తిడి వల్ల మీ వ్యాఖ్య ప్రచురించడంలో, నా స్పందన తెలపడంలో ఆలస్యమయినందుకు మన్నించండి.

మీ ఆవేదన నాకర్థం అయింది. కాస్త నా ఆవేదన కూడా అర్థంచేసుకోవాలని మనవి.
(నేను ఏ పార్టీకీ ప్రతినిధిని కాను. తెలంగాణ విముక్తికై తపించే కేవలం ఒక "ప్రజ"ను మాత్రమే.)

"మా ప్రజలు కోరుకొనే తెలంగాణ ఇస్తే తె.రా.స.ను కాంగ్రెస్‍లో విలీనం చేస్తాను" అని కేసీఆర్ ఎప్పుడన్నారో, అప్పుడే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్ల మనస్తాపానికి గురైన వేయి మంది తెలంగాణ ముద్దు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాల్సివచ్చింది. ప్రజలంతా రోడ్లపైకొచ్చి, సకలజనుల సమ్మె చేయాల్సివచ్చింది. ఐనా కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వలేదు. ఇప్పుడు ఏ కారణం వల్లనో తెలంగాణ ప్రకటించింది. అయితే ఆంక్షలులేని తెలంగాణ ఇది కాదు. రాష్ట్రం వస్తుందో, రాదో ననే భయాందోళనలతో ప్రజలున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల...ముఖ్యంగా సీఎం అడ్డగోలు అడ్డంకి మాటలకు కళ్ళెం వేయకుండా, తెలంగాణకు ప్రతికూల వాతావరణం కల్పించి, తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. నిజానికి తెలంగాణ ప్రజలు కోరుకొనేది ఏ ఆంక్షలు లేని తెలంగాణ. తెలంగాణ రాజధానిని పది సంవత్సరాలు ఉమ్మడి పేర సీమాంధ్రులకు ఒప్పగించి, అధికారం గవర్నర్‍కు ఒప్పగించి, స్వేచ్ఛలేని తెలంగాణను కేంద్రం ఇస్తానంటుంటే, వ్యతిరేకించడంపోయి, బానిసల్లా తలూపడం తగని పని! కాంగ్రెస్ తెలంగాన ఇస్తోంది...అభినందించదగిన విషయమే ఐనా, ఇందులో అనేకమైన మెలికలున్నాయి. వాటికోసం మనంమంతా కలిసికట్టుగా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇందుకు పరిష్కారం తెరాస విలీనం కావడం కాదు. ముఖ్యమంత్రి జుట్టుపట్టుకొని వంచడమో, దించడమో చేయాలి. ఆయన ఇంతగా వ్యతిరేకిస్తున్నా కేంద్రం చర్య చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనంత బలంగా టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ వాదాన్ని కేంద్రానికి వినిపించాలి.
ఇకపోతే, టీ టీడీపీ నేతలు తమ నిస్సహాయతను, బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి "తె.రా.స. విలీనం" గురించి అరిచి, గోల చేస్తున్నారు. కేంద్ర కాంగ్రెస్ నేత ఈ మధ్యనే "విలీనానికీ", "విభజనకూ" లింకులేదని తేల్చి చెప్పారు కూడా! ఐతే నేను "విలీనం చేస్తే...అమరవీరులు బతికొస్తారా?" అని టీ టీడీపీ నేతల నడుగుతున్నాను. కేంద్ర కాంగ్రెస్ ఆలస్యం వల్లనే వేయిమంది పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారే...అనేది నా ఆవేదన. విలీనం గూర్చి కాంగ్రెస్ అడగడం లేదు...టీ టీడీపీ కెందుకు దురద? అనేదే ప్రశ్న. టీ కాంగ్రెస్ నేతల్ని నిందించడం నా అభిమతం కాదు. ఐనా తెలంగాణ నేతల్ని అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చి, తెలంగాణ ఐకమత్యాన్ని నిరూపించవలసిన అవసరం టీ కాంగ్రెస్‍కుంది. అప్పుడే మీ పార్టీ తెలంగాణలో మనగలుగుతుంది. తెలంగాణ ఏర్పడే వరకు నిద్రకూడా పోకుండా, అప్రమత్తంగా ఉండి, సీమాంధ్ర నాయకుల జిత్తుల్ని చిత్తు చేయాల్సిన అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత...జాగ్రత!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి