గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 06, 2014

అవినీతి అధికారికి స్థానచలనం...!!!

-వాణిజ్యశాఖలో ఫోకల్ దందాపై సర్కారు కన్నెర్ర
వాణిజ్య పన్నులశాఖలో ఫోకల్ పాయింట్లలో పోస్టింగ్‌లు ఇస్తామంటూ దందా నడిపిస్తున్న ఒక ఉన్నతాధికారిపై సర్కారు కన్నెర్ర చేసింది. పోస్టింగ్‌ల పేరుతో లంచాలు తీసుకోవడంతోపాటు పన్నుల విధింపులో అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో సదరు అధికారిని వాణిజ్యపన్నులశాఖ నుంచి తప్పించి రెవెన్యూశాఖ ఓఎస్డీగా నియమించింది. తెలంగాణకు చెందిన ఉద్యోగులు, అధికారులకు కీలకమైన పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకు సూచనలందాయి.
వాణిజ్యపన్నుల శాఖలో కూడా తెలంగాణ వారికి పోస్టింగుల్లో అన్యాయం జరుగకుండా కీలక స్థానాల్లో నియమించాలని నిర్ణయించారు. ఈ శాఖలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న కర్నూలుకు చెందిన జీ వెంకటేశ్వర్లు దీనిని అదనుగా తీసుకొని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను కీలకమైన స్థానాలలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులుగా నియమించారనే ఆరోపణలొచ్చాయి. ఉన్నతాధికారులు రెండు లేదా మూడు పోస్టులకు సిఫారసు చేస్తే ఆయన ఏకంగా పన్నెండుమంది జాబితా తయారు చేసుకుని కాసులు రాల్చుకున్నట్లు తెలిసింది.

తన షరతులకు అనుకూలంగా వ్యవహరించిన వారికి అబిడ్స్, రాజేంద్రనగర్, సోమాజిగూడ, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో సిటీవోలుగా నియమించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులందాయి. దీనిపై విజిలెన్స్ కూడా విచారణ జరిపినట్లు సమాచారం. విజిలెన్స్ నుంచి అందిన సమాచారం మేరకు సదరు అధికారికి ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. కీలకమైన పదవి నుంచి ఆయనను తప్పించి రెవెన్యూ ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి