గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 03, 2014

ఆర్ అండ్ బీలో ఎస్‌ఈలు మొదలు ఏఈల వరకు వారే...!!!

సాహితీ మిత్ర కవి పండిత వీక్షకాళికి
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!



-ఆర్ అండ్ బీలో సీమాంధ్రులదే హవా
-పోస్టింగ్‌లు లేక టీ ఇంజినీర్లకు ఇక్కట్లు
ఆందోళనలో పాల్గొన్న కిందిస్థాయి సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టిన వారు ఇప్పుడు తామూ తెలంగాణ వారమేనని బుకాయిస్తున్నారు. రకరకాల సాకులు చెబుతూ రోడ్లు, భవనాల శాఖలో తిష్ఠవేసేందుకు సీమాధ్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ శాఖలో వివిధ విభాగాల చీఫ్ ఇంజినీర్లుగా తెలంగాణ వారున్నా, జిల్లాల్లో సూపరింటెండెంట్ ఇంజినీర్లు సీమాంధ్రులే కావడంతో వారిదే హవా. కీలక విభాగాల్లో పని చేస్తున్న ఏపీ అధికారులు కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి చుక్కలు చూపుతున్నారు.
వారంతా తమ కుటుంబం సిర్థపడిందిక్కడేనని చిలుక పలుకులు పలుకుతున్నారు. వీరందరికీ మార్గదర్శి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్. ఆయన ఉమ్మడి రాష్ట్ర చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నప్పుడే కీలక పోస్టుల్లో సీమాంధ్ర అధికారులను నియమించారు. కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కృష్ణా జిల్లావాసి తిరుమల అనే మహిళా ఇంజినీర్ డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెను తెలంగాణ ఇంజినీర్లు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నా ఇదే పోస్టులో కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా ఎస్‌ఈ శ్రీధర్ నెల్లూరు వాసి. భవన నిర్మాణ విభాగం ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరెడ్డి రాయలసీమ వాసి. రాజమండ్రికి చెందిన ఆషారాణి రూరల్ సర్కిల్ ఎస్‌ఈగా బల్కంపేట కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్నారు. ఆశారాణి భర్త గోపాలకృష్ణ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజినీర్‌గా పని చేస్తూనే నల్గొండ జిల్లా అడిషనల్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

వీరంతా సీమాంధ్ర జిల్లాలవారే. ఇక కృష్ణా జిల్లాకు చెందిన వసంత అనే అధికారి తాను ఆదిలాబాద్ జిల్లా వాసినంటూ కీలకమైన నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ జిల్లా నందికొట్కూర్ వాసి అయిన మరో అధికారి తన తండ్రి బీహెచ్‌ఈఎల్‌లో పని చేశారని, తాను స్థానికుడినేనని తప్పుడు ధ్రువపత్రాలతో ఆర్ అండ్ బీలో కీలక పోస్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరితోపాటు రాష్ట్రంలోని పది జిల్లాల్లోని వందలాదిమంది డిప్యూటీ ఇంజినీర్లు, జేఈ, ఏఈలు సీమాంధ్ర జిల్లాల వారే. అక్రమార్కులను అందలం ఎక్కిస్తుండడంతో సీనియర్ అధికారులు ఇబ్బందుల పాలవుతున్నారు. కొంతమంది స్థానిక ఇంజినీర్లు పోస్టింగ్‌ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే ఉన్నతాధికారే లేరు.

సీమాంధ్ర అధికారులొద్దు: తెలంగాణ ఇంజినీర్ల డిమాండ్

కీలక పోస్టుల్లో ఆంధ్ర అధికారులు ఉండటం వల్ల రాష్ర్టానికి భవిష్యత్తులో నష్టం జరిగే ప్రమాదముందని తెలంగాణ ఇంజినీర్లు పేర్కొన్నారు. తక్షణం సీమాంధ్రులను బదిలీ చేసి స్థానికులను నియమించాలని ఆదివారం జరిగిన సమావేశంలో తీర్మానించారు. సీమాంధ్ర కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై దోపిడికీ తెరతీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సీమాంధ్ర అధికారులకు అండగా నిలిస్తే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశం తీర్మానించింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి