-ఈ విషయంలో ఏపీ మంత్రి నాతో మాట్లాడలేదు
-మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ
శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తిని ఆపే అవకాశం ఏమాత్రం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. "మా పంటలను ఎండబెట్టుకుని మీకు (ఆంధ్రప్రదేశ్‍కు) నీళ్ళు ఇవ్వాలా ? తెలంగాణ రైతులు ఇబ్బందుల్లో ఉన్న సంగతి మీకు తెలియదా?-మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ
తెలంగాణలో విద్యుత్‌లోటు ఉందన్న సంగతి మీ కంటికి కనబడటం లేదా? విద్యుత్తులో తెలంగాణ వాటా (53.89శాతం) ఇవ్వకపోగా మా రైతులకు అన్యాయం చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం?" అని ఆయన ప్రశ్నించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏపీ మంత్రి దేవినేని ఉమా తనకు ఫోన్ చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఏపీ సర్కారు అక్కడి రైతాంగం రెండో పంటకు నీళ్ళ గురించి ఆలోచిస్తుండగా.. తాము తెలంగాణ రైతన్నల మొదటి పంట గురించి ఆలోచిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి