ఏకాభిప్రాయ మనెడు
మాట నేడు చెప్పగాను
నాడు మీరు ఏకాభి
ప్రాయంతో విడిపోతిరె?
విడిపోవుటకై మద్రాస్
ఏకాభిప్రాయమ్ముకు
వచ్చినదా చెప్పుమయ్య!
అసత్యాలు పలుకుటేల?
ఏకాభిప్రాయ మడుగ,
నాడు మీరు మద్రాసును
వీడి వచ్చువారేనా?
నేడు మీరు కోరుటేల?
మద్రాసును వీడునపుడు
ప్రజ అనుమతి పొందితిరే?
తెలంగాణ నాంధ్ర గలుప
మా అనుమతి పొందితిరే?
ఏకాభిప్రాయ రహిత
దౌర్జన్యం దౌష్ట్యంతో
ప్రజల నోరు నొక్కి మీరు
మాతోడను కలువలేదె?
మా నోళ్ళను నొక్కి నాటి
నుండి సకల సంపదలను
కొల్లగొట్టగాను మీకు
హక్కు మేము ఇచ్చితిమా?
విడిపోవుట కేకాభి
ప్రాయమవసరము ఉన్నచొ,
మీతో మేం కలిసుంటకు
ఏకాభిప్రాయమొద్దె?
ప్రజల నోళ్ళు నొక్కినట్టి
మీకు అడుగ అర్హతేది?
మీ ప్రజలే ప్రజలైనచొ,
మా ప్రజలిక ప్రజలుకారె?
దౌర్జన్యం మీ ప్రకృతియె!
దౌష్ట్యమ్ములు మీ కృతములు!
అసత్యాలు మీ వాక్కులు!
నమ్మకద్రోహులె మీరలు!!
ఇట్టి మీతొ కలిసి యుంట
ఇకపై మరి చెల్లదయ్య!
తెలంగాణ ఏర్పడునయ!
మా బాధలు తొలగునయ్య!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి