విభజనముకై బిల్లు పంపియు
"ఏ యభిప్రాయమ్ము"లను తెలు
పుడని కోరెనొ, "ఆ యభిప్రా
యములు" తెల్పితిరా?
మీ యభిప్రాయములు కావయ,
బిల్లు అంశము పైన మీ అభి
ప్రాయములు తెలుపంగ వలయును!
ఇంతియేనయ్యా!
విభజనమునకు సానుకూల్యత
ప్రాతికూల్యత కోరలేదయ!
బిల్లుపైననె చర్చ చేయగ
వలయునోయయ్యా!
అభిప్రాయాల్ తెలుపువరకే
స్వేచ్ఛయున్నది! కాని, ఓటింగ్
జరుపుటకు మాత్రమ్ము మీ కిట
హక్కు లేదయ్యా!!
ఈ అసెంబ్లీలోన విభజన
కొరకు తీర్మానమ్ము కుదురదు!
మీర లెక్కువ! వారు తక్కువ!!
కాన కుదురదయా!!
అందుకై ఆర్టికలు మూడును
ఆశ్రయించెను కేంద్ర మిప్పుడు!
కాన, ఓటింగ్ జరుపుటకు మీ
కర్హతుండదయా!
బిల్లుపై సవరణలు తొమ్మిది
వేల ఇరువది నాల్గు వచ్చిన,
సవరణలపై చర్చ కోరుట
కుట్రయేనయ్యా!
అసెంబ్లీకిని సవరణమ్ములు
చేయు అధికారమ్ము లేదయ!
సభ్యులిత్తురు అభిప్రాయమె!
అవియె పంపుడయా!!
పార్లమెంట్ నిర్ణయమె అంతిమ
మయ్య! ఇక్కడ సవరణలపై
ఎవరి ఓటింగ్ ఉండరాదయ!
తెలుసుకోవయ్యా!!
పరుల దూషణములతొ కాలము
పుచ్చకుండా చర్చ జరుపుడు!
ఇంతకాలము వృథా సేసిన,
గడువు పెంచెదరా?
బిల్లు రాగనె ఇతర చర్చలు
ప్రక్కనుంచియు బిల్లు పైననె
చర్చ జరిపిన యుక్త మయ్యెడి
దట్లు చేసితిరా?
"మల్లు" చర్చను మొదలు పెట్టగ,
అట్లు కాదని, సాగదీసియు,
సెలవులంటిరి, ప్రక్క బెడితిరి!
కాలమేగెనుగా!!
మనస్ఫూర్తిగ వృథాపరచియు,
గడువు పెంచు మనంచు కోరుట,
మంచికిదియే కాదు కాదయ!
దుష్ట యోచనయే!!
గడువు నలువది రోజు లిచ్చిన,
సక్రమముగా వాడుకొనకయె,
కాలయాపన చేసి, గడువును
కోర, పెంచెదరా?
గడువు పెంచరు! బిల్లు పోవును!
పార్లమెంటున చర్చ జరుగును!!
తెలంగాణము రాష్ట్రమగునయ!
జై తెలంగాణా!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి