గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 24, 2014

ఉడుత పరుగు ఎందాక?


ఓ ముఖ్యమంత్రి! నీ వెందాక ఉరికినా
చెట్టువరకే నీవు పరుగెత్తగలవయ్య!
ఓ ముఖ్యమంత్రి! నీ కల్లమాటల జోరు
మా తెలంగాణమ్ము వచ్చువరకేనయ్య!!

నోరు తెరచియు నిజము చెప్పలేదెన్నడును
మనసు నిండా విషమె దాచుకొని ఉన్నావు!
కాలసర్పము లాగ కాటువేసియు మమ్ము
కబళింప జూచుచును ఉన్నాడవోయయ్య!

మా తెలంగాణమును శనిలాగ పట్టితిరి!
మాయమాటలతోడ వంచించుచును ఉండ్రి!
నాడు నమ్మియు మేము మోసపోయితిమయ్య!
ఇంక మిమ్ముల నమ్మి మోసాన పడలేము!!

అన్యాయమును జూచి మేమేమి అనబోము!
అన్నియును దేవుడే చూచుచును ఉన్నాడు!
మీ అధర్మమ్ములిక త్వరలోనె ఓడునయ!
మా ధర్మమే గెలిచి మాకు సంతసమిడును!!

అరువదేండ్లుగ నిరీక్షించుచున్నట్టి మా
తెలగాణ రాష్ట్రమ్ము నవ్య కాంతులు పులిమి
అతిశీఘ్రగతితోడ వస్తున్నదోయయ్య!
వెతలు బాపియు ప్రజకు సుఖములందించునయ!!

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి