ఎంతగ సమైక్య రాగము పాడిన
పలువిధములుగా చర్చల జరిపియు
కేంద్రము విభజన కంగీకృతమును
వెనుకడుగేయక తెలిపినదయ్యా!
అడ్డంకులు సృష్టించిన గానీ
బిల్లు రాష్ట్రముకు పంపించెనయా!
చర్చలు జరుపక అడ్డిన గానీ
ఏదో విధముగ చర్చ జరిగెనయ!!
చర్చలు వలదని పలికినవారే
చర్చల కొరకయి గడువును కోరిరి!
బిల్లును తప్పుల తడకగ నెంచిరి!
సీమాంధ్రకు మోసమ్మును జేసిరి!!
మంత్రివర్గ ఆమోదము లేకయె
త్రిప్పి పంపుటకు నోటీసిచ్చిరి!
ఆర్టికలుమూడు చెప్పుచునున్నను
వోటింగునకై యోచన చేసిరి!!
నానా యాగీ చేసిరి వారలు,
కుట్రకుతంత్రాల్ చేసిరి వారలు,
విషం కక్కి, దుర్భాషలనాడిరి!
తెలగాణమ్మును కించపరిచిరయ!!
ఎన్ని చేసినను, ఎంత ఆపినను
బిల్లు ముందుకే పోవుచున్నదయ!
భోగి మంటలలొ బిల్లును కాల్చగ
అగ్ని పునీతగ బిల్లు వెల్గెనయ!!
సమయమిచ్చినా, గడువునిచ్చినా,
కాలము దుర్వినియోగము చేసిరి!
సీమాంధ్రకు కావలసిన వాటిని
తెలుపకుండగనె గడిపి వేసిరయ!!
నేటి దినమ్మున దొరికిన కాలము
అనవసరపు చర్చలనిక సేయక
సద్వినియోగము చేసికొన్నచో
వారలకిప్పుడు పరువులు దక్కును!
విభజన ఖాయము! ఆపిన ఆగదు!
ఆగనిదానిని తెలిసి తెలిసియును
ఆపగబూనుట మూర్ఖత్వమ్మగు!
సంయమనమ్మును చూపిన మేలగు!!
తెలంగాణ సీమాంధ్రలు తెలుగుల
రెండు రాష్ట్రములు శ్రేయమునందును!
సత్వరమే అభివృద్ధిని పొందును!
భరతదేశముకె తలమానికమగు!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి