గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 17, 2014

చర్చకు ముచ్చటగా మూడు విడతలే...అంతే!


ఇటకు బిల్లెపు డొచ్చె?
సభను చర్చలు రచ్చె!
గడువు ఊరక పుచ్చె!
చర్చయేదయ్యా?

ఇటకు రాగనె బిల్లు
చర్చ చేసిరి నిల్లు!
కాలమేగిన చెల్లు!!
చర్చయేదయ్యా?

మొదటి విడతను జార్చి,
విడత రెంటకు జేర్చి,
రెండు పార్టీల్ కూర్చ
చర్చయేదయ్యా?

"సమైక్యాంధ్ర"ని ఒకడు!
"సమన్యాయ" మొక్కండు!
ఓటింగు నొక్కండు!!
చర్చయేదయ్యా?

ఒక పార్టి గడువనును!
ఇంకొకటి వద్దనును!
ఒకటి సస్పెండగును!!
చర్చయేదయ్యా?

రాష్ట్రపతియును బంప!
చేరి ముంచిరి కొంప!
సభకు పట్టెను రొంప!!
చర్చయేదయ్యా?

చేసి ఆలస్య మిల
గడువు కోరగ నేల?
విడత మూడున వ్రాల
చర్చముగియునయా!

సభను నడిపిన దెపుడు?
చర్చ చేసిన దెపుడు?
గడువు అడుగున దెపుడు?
చర్చముగిసెనయా!

పార్టి కొక్కరు చాలు!
కొట్టకండయ డోలు!
చర్చ చేసిన మేలు!
గడువీయరయ్యా!!

మా తెలంగాణమ్ము
మాకేర్పడును సుమ్ము!
మీకు వలసిన సొమ్ము
అడిగికొనుడయ్యా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి