గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జనవరి 28, 2014

చెప్పేవి శ్రీరంగనీతులు...


రాజ్యాంగము స్మరియించుచు
రాజ్యాంగ విరుద్ధముగా
మంత్రివర్గ  చర్చ లేక
నోటీసెటు లిత్తువయా?

అధికరణము మూడు ప్రకా
రమ్మె బిల్లు పంపినారు!
బిల్లును వ్యతిరేకించుట
రాజ్యాంగ విరుద్ధమయా!!

కేంద్రమ్మే పంపినట్టి
బిల్లులోన తప్పులెంచ
నీ బిల్లును నీవె తప్పు
పట్టుటకాదా యిప్పుడు?

రాజ్యాంగము పట్ల నీదు
చులకన భావమ్మిట్టుల
తేటతెల్లమాయయెనయ్య!
ముఖ్యమంత్రి వెట్లౌదువు?

నీ చేతలు, నీ మాటలు
రాజ్యాంగ విరుద్ధమయా!
ముఖ్యమంత్రి పీఠమునకు
అర్హుడవే కావయ్యా!!

కేంద్రము నిలబెట్టినట్టి
ముఖ్యమంత్రి వీవయ్యును
కేంద్రముకే వ్యతిరిక్తుడ
 వీవగుటయు సబబేనా?

తిరుపతిలో నీ తమ్ముని
కే ప్రత్యేకతలున్నవి?
ఏ రాజ్యాంగమ్మతనికి
ఆ ప్రత్యేకత నిచ్చెను??

చెట్టుపేరు చెప్పి కాయ
లమ్ముకొనుట యిది కాదా?
అధికారపు దుర్వినియో
గమ్ము చేయు టిదికాదా??

తెలంగాణమందు పుట్టి
పెరిగితి నే నంటూనే,
తల్లిపాలు తాగి, తల్లి
రొమ్ముగుద్దు చేతలేల?

"మాట మార్చునట్టివాడ
నేను కాను" అంటూనే,
పలుమారులు మాట మార్చు
నిన్నేమనవలయు నయ్య?

"బిల్లు త్రిప్పి పంపరాదు"
అని వైసీపీకి చెప్పి,
ఈ సమయమునందు నీవు
చేయునట్టి పనియేమిటి?

కోడలికిని బుద్ధిచెప్పి,
అత్త లేచిపోవు రీతి,
నీ చేతలు ఖండితములు!
నీ మాటలు ఖండితములు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి