గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జనవరి 25, 2014

కుక్కకాటుకు చెప్పుదెబ్బ!


మొన్న జరిగినట్టి సభను
లగడపాటి చేసినట్టి
ఉపన్యాస ఫలితమ్మే
తెలంగాణ సన్మానము!!

రెచ్చగొట్టు మాటలాడి,
అహంకారమును జూపియు,
నా సత్తా చూపుదునన,
తెలంగాణ ఊర్కొనునా?

కేంద్రమునకు వ్యతిరేకపు,
తెలంగాణ వ్యతిరేకపు,
దుమారమ్ము రేపునట్టి
ప్రసంగాలు చేయదగునె?

తెలంగాణ కన్యాయము
చేసి ధనము నార్జించియు
ధనగర్వముతోడ తిట్ట
తెలంగాణ ఊర్కొనునా?

అధర్మాన్ని పోషించుచు,
ధర్మమ్మును నిందించిన,
"కుక్కకాటు చెప్పుదెబ్బ"
వలె జరుగును తగినశాస్తి!!

తన నైజమె తనకిప్పుడు
పరమ శత్రువయ్యెనయ్య!
స్వభావమ్ము మారకున్న
తలవంపులు అగుట నిజము!!

తెలంగాణ వ్యతిరేకత
మార్చుకొనియు సుముఖుడయ్యి
మెలగినచో మెచ్చుకొండ్రు
తెలంగాణ ప్రజలు తనను!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి