గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జనవరి 26, 2014

ఎక్కడైన, దొంగలు పడ్డంక ఆర్నెళ్లకు కుక్కలు మొరుగుతయా???

తెలంగాణ ప్రజలకు, బ్లాగు వీక్షకులకు, కవి పండితులకు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

"బిల్లు తప్పుల తడక" యంచును
"త్రిప్పిపంపగ వలయు"నంచును
ముఖ్యమంత్రియె నడుము గట్టుట
ఎంత అజ్ఞానం?

బిల్లు వచ్చియు నేడు నల్వది
రెండు రోజులు గడచి పోయెను!
గడువు వారము పెంచ, బిల్లును
త్రిప్పిపంపుటయా?

బిల్లు సక్రమముగను లేనిచొ
నాడె త్రిప్పియు పంపగావలె!
ఇన్ని రోజుల పిదప ఇప్పుడు
త్రిప్పిపంపుటయా?

నాడు మీకును తెలివి లేదే?
గాడిదలనే కాసినారే?
సిగ్గులేకయు ఏ ముఖమ్ముతొ
త్రిప్పిపంపుదురో?

నాడు బీఏసిలో తీర్మా
నమ్ము చేసెడి వేళ తప్పులు
కానుపింపక దాగికొనియెనె?
కండ్లు పోయినవా??

ముద్దు కృష్ణమ తెలిపినప్పుడు
బుద్ధిలేదా వినగ మీకును?
ఇన్ని రోజుల పిదప ఇప్పుడు
త్రిప్పిపంపుదురా??

మొన్న "బిల్లు తిరస్కరించుట
సభాధ్యక్షునిగాన? వ్యక్తిగ
తమ్ముగానా?" అనియు నడుగగ
నోరుమెదిపితివా??

నాడు నోటిని మూసి, యిప్పుడు
నంగనాచి కబుర్లు చెప్పుట,
నిజముగా అవకాశవాదమె!
నోరుమూయుమయా!!

బిల్లు వెనుకకు త్రిప్పిపంపగ,
తెలంగాణుల నడిగినారా?
ఏకపక్షపు నిర్ణయమునే
చేయగానేలా??

దొంగదోచిన ఆరు నెలలకు
కుక్క మొరిగిన రీతి, మీరలు
ఇన్నిరోజుల పిమ్మటను బిల్
త్రిప్పిపంపుదురా?

అసెంబ్లీలో నుండి బిల్లును
రాష్ట్రపతికిని త్రిప్పిపంపగ,
అటే పోవును! తిరిగి వచ్చునె?
తెలుసుకొండయ్యా!!

బిల్లులోపల లేని అంశాల్
ఏవి ఎట్టుల ఉండవలెనో,
చర్చ సేసియు, తెలుపకుండా,
త్రిప్పిపంపుదురా?

బిల్ ప్రజాస్వామ్యపు విరుద్ధము
అయిన, దానిని త్రిప్పిపంపక,
గడువు పెంపును కోరి రెందుకు?
అజ్ఞులా మీరల్??

బిల్లు అయినను, డ్రాఫ్టు అయినను
తేడ ఏమిటి, చర్చ సేయగ?
ఏది అయినను విషయ మొకటే!
తెలుసుకొండయ్యా!!

బిల్లు వచ్చియు నేడు నల్వది
రెండు రోజులు గడచిపోయెను!
కోర్టునకు పోయినను మీరలు
గెలువలేరయ్యా!!

ఇన్ని రోజులు గడిపి, పిమ్మట,
అదియు తప్పని, ఇదియు తప్పని,
అదియు లేదని, ఇదియు లేదని
పలుకనేలయ్యా?

బిల్లు నిప్పుడు త్రిప్పిపంపుట
రాష్ట్రపతికిని, కేంద్రమునకును,
ధిక్కృతమ్మును తెలుపుటే యగు!
అవినయమె కాదా?

ఇంత కాలము ఆగి పిమ్మట
బిల్లునిట్టుల త్రిప్పిపంపుట,
తెలంగాణుల ఆశ ద్రుంచుటె!
దౌష్ట్యమేనయ్యా!!

అధిష్ఠానము ధిక్కరించుట,
రాష్ట్రపతిని తిరస్కరించుట,
ముఖ్యమంత్రిగ నీకు తగునే?
పదవి వీడుమయా!!

అసెంబ్లీలో నేటి వరకును
చర్చ చేసిన యవియె చాలును!
బిల్లు పంపిన, అటే పోవును!
వచ్చు దెలగాణా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

జై హింద్!

6 కామెంట్‌లు:

Chiru Dreams చెప్పారు...

దొంగ అని నిరూపించాలంటే ఆ మాత్రం సమయం తీసుకొవాలి. లెదంటే, చూస్తున్నాం కదా! నిజాలు మట్లాడిన ప్రతిసారీ బలిదానాల తీసుకొచ్చి పబ్బం గడిపేస్తున్నారు. మీరు దొంగలని ఒప్పేసుకున్నారు.

Chiru Dreams చెప్పారు...

మీరు చెప్పడానికి ఎన్నుకున్న పద్దతి బాగుంతుంది.. కాని, అందులో వివేకం కొల్పోతున్నరేమో అలొచించండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సామెతను మీరు వక్రీకరిస్తున్నారు! ఇక్కడ దొంగలు మా తెలంగాణులని మీ అభిప్రాయంగా తోస్తున్నది. నిజంగా దొంగలు సీమాంధ్ర నేతలే! వాళ్ళు మాట్లాడేవి నిజాలు కావు, అబద్ధాలు! సీమాంధ్రులను అబద్ధాలతో మభ్యపెడుతున్నారు. వాళ్ళ మనస్సుల్లో దుర్మార్గపుటాలోచనలూ, వోట్లూ, సీట్లూ సంపాదించే ఆలోచనలూ తప్ప , సీమాంధ్రను వృద్ధి చేయాలనే ఆలోచనేలేదు.
మీ నేతలు మమ్మల్ని దొంగలని నిరూపించనవసరం లేదు. ఎందుకంటే దొంగలైనవాళ్ళే "దొంగ...దొంగ" అని అరుస్తూవుంటే మీలాంటి వాళ్ళకి దొంగలే దొరల్లా కనబడుతున్నారు. ముందు మీ సీమాంధ్ర దొంగల్ని పట్టుకోండి. ఆ తర్వాత మాట్లాడండి!
ఇకపోతే, మీరు మా అమరుల బలిదానాలగూర్చి చులకనగా మాట్లాడడం బాగాలేదు. మా తెలంగాణ మొత్తం ప్రజలు "తెలంగాణ" రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే సీమాంధ్రులు మమ్మల్ని దోపిడీకి గురిచేశారు. మా ఆత్మాభిమానంతో ఆడుకున్నారు. అందుకే మా తెలంగాణ మాకు కావాలంటున్నాం. దొంగలం మేం కాము, మీ సీమాంధ్ర నేతలు!
నేను వివేకం కోల్పోతున్ననేమోననే ఆలోచన మీకెందుకు వచ్చింది? మేం అణచివేతకు గురై ఉన్నాం. మీరు ఒడ్డున ఉన్నారు. ఒడ్డున ఉన్నవాళ్ళకు నీళ్ళలో కొట్టుకుపోతున్నవాళ్ళని చూస్తే కరుణ కలగాలి కానీ వెటకారం చేయాలనే ఆలోచన రాకూడదు.
నేను వివేకం కోల్పోలేదు. మీ నేతలు వివేకం కోల్పోయి, ఇలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు వివేకం ప్రబోధించేదే ఈ బ్లాగు! మీరు ఈ టపా సరిగా అర్థం చేసుకోలేదు. నా ప్రశ్నలకు మీరే మీ నేతగా మారి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఎవరు వివేకం కోల్పోయిందీ తెలుస్తుంది. నా ప్రశ్న సూటిగా, కటువుగా ఉంటుంది. అర్థం చేసుకోండి.

Chiru Dreams చెప్పారు...

మీరు వ్రుత్తం బయటనుండి చూడండి.. మా నేతలు లెక్కలతో సహా మీ ముందు పెడుతున్నారు. మీ నేతలు మాత్రమే మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు..

>> మీరు మా అమరుల బలిదానాలగూర్చి చులకనగా మాట్లాడడం బాగాలేదు.

మేము కాదు. నిజాలు బయట పడ్డ పద్ద ప్రతి సారి మీరే వాల్ల బలిదానాలని బయతకు తెచ్చి చులకన చేసారు . కనీసం మీరైనా లెక్కలు చూపగలిగితె సంతోసిస్తాం .

PS: అసలు అంతంత టైప్ ఎలా చెస్తున్నారండి బాబు. ఈ కొంచానికే నాకు చిరాకొచ్చింది.

Chiru Dreams చెప్పారు...

>>నా ప్రశ్న సూటిగా, కటువుగా ఉంటుంది. అర్థం చేసుకోండి.

కఠువా నా బొందా. బూతులు తప్పితే వేరే మట్లాడని వాళ్ళకంటే, మీరే చాలా బెట్టర్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అన్ని లెక్కలూ అతి త్వరలోనే బయటపడతాయి. దొంగ లెక్కలతో మభ్యపెట్టేవాళ్ళనే దొరలని భావించకండి. ఒక్క పొట్టి శ్రీరాములుగారి బలిదానమే మీకు గొప్పైతే, సహస్రాక అమరవీరుల బలిదానాలు మాకెంత గొప్పకావాలి? మీది గొప్ప గానీ, మా అమరవీరుల బలిదానం గొప్పదికాదా? ఎవరిదైనా బలిదానం బలిదానమే. బలిదానాలను చులకన చేయవద్దని మనవి. స్పందించినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి