గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జనవరి 29, 2014

వోటింగ్ నహీఁ చలేగా...


అసెంబ్లిలో సీమాంధ్రకు,
తెలగాణకు సభ్యులలో
తేడా ఉండుట వలనను
వోటింగ్ జరుపగరాదయ!

బలవంతులు దుర్బలులను
జయింపగను జూచుచుండ్రి!
అందుకనియె అధికరణము
మూడును కేంద్రము గొనియెను!

సీమాంధ్రులు వోటింగును
కోరుటయే కుట్రయయ్య!
తెలంగాణ నోరునొక్కు
దౌర్జన్యమ్మిదియయ్యా!!

మైనారిటి వారి కోర్కె
పైన ఎట్లు వోటింగును
పెడుదురయ్య మీరిప్పుడు?
ఇది జరిగేపనియేనా??

ఆర్టికలు మూడు ప్రకా
రమ్ముగ వోటింగు వలదు!
అభిప్రాయములు మాత్రమె
చెప్పుటయే జరుగవలయు!!

సీమాంధ్రకు వలసినవియె
చర్చసేసి తెలుపుడయ్య!
సదవకాశ మిదియయ్యా
వినియోగించుకొనుమయ్య!!

దౌర్జన్యముగా వోటింగ్
జరిపినచో చెల్లదయ్య!
గడువు ముగియులోపుననే
చర్చ జరుప వలెనయ్యా!!

కేంద్రమిపుడు తెలంగాణ
ఇచ్చుటకే సమకట్టెను!
బెట్టుమాని కేంద్రమునకు
తోడుపడగ సమకట్టుడు!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి