గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జనవరి 27, 2014

చివరి బంతి ట్రాజెడీ హైడ్రామా!

పగటి కలలు కనుచునున్న
ముఖ్యమంత్రి గారు!
తెలంగాణ నడ్డ నీవు
ఆపుమయ్య జోరు!!


కేంద్రమంత్రివైనకాక,
ఎంపివైన కాక,
పార్లమెంటు అవగాహన
సుంతయైన లేక,


కేంద్ర బిల్లు విషయంలో
మాట్లాడుట యేల?
అజ్ఞానివి నీవయ్యా,
మానుమయ్య గోల!


అసెంబ్లిలో, పార్లమెంట్లొ,
"ముసాయిదా బిల్లు"!
క్యాబినెట్టు ఆమోదము
పొంద, అగును "బిల్లు"!!


బిల్లుపైన తీర్మానము
చేయు హక్కు లేదు!
తప్పులున్నచో "తప్ప"ని
చెప్పుమయ్య ముందు!!


బిల్లు ఎంత అసమగ్రము
అయిన చర్చ చేసి,
చేయవలెను సమగ్రముగ
అభిప్రాయమిచ్చి!


అధికరణము మూడు నీవు
చదువుమయ్య ముందు!
రాజకీయ అజ్ఞానికి
అదే మంచి మందు!!


అధికరణము మూడు ప్రకా
రమ్ము చర్చె యుండు!
ఓటింగ్ జరిపెదమనియెడి
హక్కులేకయుండు!!


విషం కక్కి బిల్లు పంప
అగునయ్యా బలుపు!
ధర్మపక్షమున్న మాకు
అగునయ్యా గెలుపు!!


చర్చ జరుపు, జరుపకపో,
ఆగదయ్య బిల్లు!
గడువు సమీపించినచో
ఇక నూకలు చెల్లు!!


స్పీకరు, మంత్రియు, నీవును
ఆంధ్రవారె కారె?
తెలంగాణ నాప గోరు
వ్యతిరేకులు మీరె!!


బిల్లు త్రిప్పి పంపినచో
అభిప్రాయమే యగు!
బిల్లు తిరిగి రాకపోగ,
తెలగాణము వచ్చు!!


జై తెలంగాణ! జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

nsp చెప్పారు...

Your correct I like your post!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ns p గారూ ధన్యవాదాలండీ! మీ ఆంగ్లభాషాసేవ అభినందనీయము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి