గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 03, 2014

అన్నిటికీ నేనున్నా...!


తెలంగాణ ప్రజలారా!
ధైర్యంగా ఉండండి!!
ఎవ్వరెంత అడ్డుకున్న
ఇర్వదిమూడ్వరకెనండి!!

జేజెమ్మలు అడ్డుపడిన,
తాతలు దిగివచ్చినా,
తెలంగాణ బిల్లునిపుడు
ఎవ్వరాపలేరండి!!

చర్చలిపుడు జరుపకున్న,
బిల్లు పూర్తిగా మార్చిన,
ఎంత అరచి గీపెట్టిన,
తెలంగాణ బిల్లునిపుడు
ఎవ్వరాపలేరండి!!

ఉడుత పరుగు ఎందాక?
దాపునున్నచెట్టుదాకె!
సీమాంధ్రుల గోల ఎటకు?
జనవరి ఇర్వదిమూటికె!!

భయపడగా వలదయ్యా!
ఏ నిరాశ వలదయ్యా!
ఎవ్వరెంత అడ్డు పడిన
అన్నిటికీ నేనున్నా!!

కుక్కలు బెదిరించి చెప్పు
నెత్తుకొనియు పోయినట్లు
సీమాంధ్రులు వర్తించిన
ఏమి జరుగబోదయ్యా!
నిశ్చింతగ ఉండుడయ్య!!

తెలంగాణ ఏర్పడునయ!
స్వేచ్ఛ మీకు దొరుకునయ్య!
నిర్భయముగ ఉండుడయ్య!
అన్నిటికీ నేనున్నా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

1 కామెంట్‌:

కామెంట్‌ను పోస్ట్ చేయండి