గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జనవరి 02, 2014

ఎంత కుటిలత?


మొదటినుండియు మొండితనమున
తెలంగాణమునడ్డు కుట్రయె
పూనుచుండెను ముఖ్యమంత్రియె!
మూర్ఖుడతడయ్యా!!

నిన్న శ్రీధరుబాబు శాఖను
చట్టసభ నుండియును మార్చుట
తెలంగాణమునడ్డు కుట్రయె!
మూర్ఖుడతడయ్యా!!

ఏల మార్చగవలసివచ్చెనొ?
మార్చవలసిన అవసరమ్మెదొ?
చర్చ చేసియు తెలుపకుండనె
ఎటుల మార్తురయా?

అహంకారము పదవి గర్వము
వక్రబుద్ధియు నీచగుణతయు
తెలంగాణమునడ్డు కుట్రలు
ముఖ్యమంత్రివయా!

కామ క్రోధాల్ లోభ మోహాల్
మదము మాత్సర్యమ్ములతనికి
మనమునందున చేరి నిలిచియు
చుట్టములెయయ్యెన్!

స్వీయ ధర్మము సక్రమమ్ముగ
తాను నెరవేర్చుటయె శ్రీధరు
బాబు తప్పా? మరొక కారణ
మున్నదా అయ్యా!

బిల్లు చర్చకు పెట్టకుండుట
కేంద్రయత్నము సాగకుండుట
తెలంగాణము నాపు చుండుట
కిదియె మార్గమ్మా?

తెలంగాణను దోచి దోచీ
పీల్చిపిప్పిని చేయు కుట్రయె
సాగుచున్నది నిజము కాదా?
దౌష్ట్యమే కాదా?

ఎంత మందిని శాఖమార్చిన
ఎన్ని కుట్రలు చేయుచుండిన
ఎంత మూర్ఖత కలిగియుండిన
వచ్చు తెలగాణా!

కేంద్రమే అట పూనియున్నది!
చర్చ చేసిన చేయకున్నను
తెలంగాణా రాష్ట్రమాపగ
తరము కాదయ్యా!!

ఎంత విషమును చిమ్ముచుండిన
అంత విషమే మిమ్ము కాల్చును!
పరువు పోవును! దుష్టుడందురు!
నష్టమే మిగులున్!!

మంచితనమున చర్చ చేసియు
రాష్ట్రపతికిని బిల్లు పంపిన
గౌరవమ్మే నిలుచునయ్యా!
మెప్పు కలుగునయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


2 కామెంట్‌లు:

rajiv raghav చెప్పారు...

మధు గారు,
పద్యం రూపంలో రూపొందించిన అర్టికల్ చాలా బాగున్నది...
కల్సి ఉండడానికి మీ కన్నా, మేమే ఎక్కువ సుముఖంగా లేము...
దీనికి కారణం ఇరుప్రాంతాలు రాజకీయ నాయకులు కారణం అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను...
అది ఎంత వరకు నిజమో కాలము సమాధానము చెప్పగలదు....
ఇకపోతే తెలంగాణా కోసం మీరు ఎంతగా పొరాడరో, కొత్తగా మరియు భారీగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రయెజనాలను విభజన బిల్లులో విస్మరించడం కారణంగానే ఆ బిల్లు పై సీమాంధ్రలో వ్యతిరేకత ఉందని అర్ద్రం చేసుకోగలరు.....అంతే తప్ప తెలంగాణా మీద వ్యతిరేకత ఎక్కడ లేదు... కలిసి ఉండడం అంటే ఇక్కడ ప్రతిఘటన వచ్చే విధంగా పరిస్దితులు మారిపోయాయి... కాబట్టి రాష్ట్రం సమైక్యంగా ఉంటుందేమోనన్న అనుమానాలు మీకు ఏ కోశానా అవసరం లేదు....
సరయిన విధంగా బిల్లును రూపొందించి ఉంటే బిల్లు చాలా ఈజీగా ముందుకు వెళ్ళగలదని చెప్పదలచుకొన్నాను......

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

రాజీవ్ రాఘవ్‍గారూ! సీమాంధ్ర నేతలలో గల విభిన్న స్వరాలనూ, సమైక్యాంధ్ర నినాదాన్నీ నిత్యం వింటూవున్న నాకు అసలు సీమాంధ్రులకు ఏం కావాలో స్పష్టంగా తేల్చుకోవాలని చురకలాగా ఈ టపా రాశాను! ఇక్కడ "సీమాంధ్రులు" అంటే, సీమాంధ్ర నాయకులూ, పెట్టుబడిదారులూనని మీరు అర్థం చేసుకోవాలి. సీమాంధ్ర ప్రజలపై మా తెలంగాణులకు ఏ ద్వేషభావమూ లేదు. ఏ ఆంక్షలూ లేని తెలంగాణ మాకు కావాలనే కోరికతో బాటు, సీమాంధ్రకు అన్ని వసతులున్న రాజధానీ మొదలైనవి సాఫీగా పరిపాలన సాగడానికి ఉండాలని మేం కోరుకుంటున్నాం. సీమాంధ్ర నాయకులకు తెలంగాణను ఇంకా ఇబ్బందులపాలు చేయాలనే కోరిక ఉండడం వల్ల మేం అశాంతికి గురవుతున్నాం.
బిల్లులో తెలంగాణకూ, సీమాంధ్రకూ ఆర్థికపరమైన ప్రయోజనాల విషయం లేకపోవడానికి కారణం, బిల్లుపై చర్చచేసి తెలంగాణ వాళ్ళూ, సీమాంధ్రవాళ్ళూ ఏమేం కావాలో నిర్ణయించుకుంటారు. చర్చలు చేసి వాళ్ళకేం కావాలో తెలిపింతర్వాతనే బిల్లులో ఆ అంశాలు చేర్చుదాం అని అనుకొని ఉంటారు. అందుకే చర్చలే చాలా ముఖ్యమైనవి! ఆలస్యం కావడం దురదృష్టకరం.
నాయకులే స్వార్థప్రయోజనాల్ని ఆశించి తెలంగాణ బిల్లుకు అడ్డుపడుతున్నారు. అలా కాక చర్చలు చేపట్టి సీమాంధ్రకు ఏం కావాలో అడగవచ్చు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పడుతుందన్నది వాళ్ళకు తెలుసు. ఐనా కుట్రలు పన్నుతున్నారు. తద్వారా చర్చలలో సీమాంధ్రకూ, తెలంగాణకూ ప్రయోజనం చేకూరే విషయాలు రాకుండానే రాష్ట్రపతికి బిల్లు చేరుతుంది. మా ప్రయోజనాల్ని మేం ఎలాగూ సాధించుకుంటాం. నష్టం మీకే. దీన్ని మీరు మీ నాయకుల ఎదుట ప్రతిఘటించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది.
స్పందించినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి