గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జనవరి 12, 2014

ఎన్నికల కోడ్, విభజనను ఆటంకపరచబోదు!


[ఇది...ఒంగోలు జిల్లావాసి, సుప్రీం సీనియర్ న్యాయవాది శ్రీ పావని పరమేశ్వరరావుగారితో టీ మీడియా జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూకు, నేనిచ్చిన "గేయరూపం"]

1. బిల్లు పాసయిన తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే?

బిల్లు పాసయిన పిదప ఎన్నికల
నోటిఫికేషను వచ్చినచో,
విభజన ప్రక్రియ, వోటింగ్ ప్రక్రియ
దేని దారి దానిదెయయ్యా!

విభజన ముందే ఎన్నిక జరిగిన
విభజన తదుపరి నవరాష్ట్రమ్మున
ఎచటి వారలట కొనసాగుదురయ!

ఎన్నికల కోడు విభజనమ్మునిట
ఆటంక పరుప బోదయ్యా!!

2. ఒకవేళ సమైక్యరాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఎన్నికల అనంతరం విభజన ప్రక్రియ అమలు ఆగే ప్రమాదమున్నదా?

పార్లమెంటులో బిల్లు పాసయిన
విషయము గెజిట్లొ చేర్చవలెనయా!
కార్యాచరణము కొనసాగునయా!

విభజన చట్టము అమలు పరచుటకు
రెండు రాష్ట్రముల ప్రభుత పాలనకు
సిద్ధము కానిచొ, ఎన్నికల పిదప
సిద్ధపరచినచొ, అమలగునయ్యా!

ప్రస్తుతపు పార్లమెంట్ తీర్మానం
రాబోవు పార్లమెంటమలు పరచును!
ఎన్నిక లెప్పుడు జరిగినగానీ
విభజన ప్రక్రియ ఆగదయా!!

3. అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు తెలంగాణ బిల్లును వ్యతిరేకించినా, పార్లమెంటు ఆమోదించవచ్చా?

ఆర్టికలు మూడు ప్రకారమే ఆ
పార్లమెంటు, ఈ అసెంబ్లి గానీ
వ్యవహరింపగా వలెనయ్యా!

అసెంబ్లీలోన అభిప్రాయమును
మాత్రమే చెప్పవలెనయ్యా!
ఆమోదించుట, వ్యతిరేకించుట,
వోటింగ్ క్రిందికి రాదయ్యా!

అసెంబ్లి తెలిపిన అభిప్రాయములు
తలదాల్చంగను, వ్యతిరేకించగ
కేంద్ర క్యాబినెట్ ఇష్టమయా!
ఆర్టికలు మూడు ఇదె తెలిపెనయా!!

4. అసెంబ్లీ మెజారిటీ సభ్యులు వ్యతిరేకించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడం అప్రజాస్వామికం అవుతుందంటున్నారు కదా!

ఆమోదించిన, వ్యతిరేకించిన
అప్రజాస్వామికము కాదయ్యా!
ఆర్టికలు మూడు ప్రకారమ్ముగా
కేంద్ర నిర్ణయమె చివరిదయా!
ఈ అధికారమె పార్లమెంటునకు
రాజ్యాంగమ్మే కట్టబెట్టెనయ!!

5. ఆర్టికల్ మూడుకు ఇంతటి ప్రాధాన్యం ఎందుకు?

భారతదేశపు రాష్ట్రమ్ములలో,
కేంద్రపాలితపు ప్రాంతమ్ములలో
మార్పులు, చేర్పులు అవసరమైనచొ
అధికారమ్మది ఎవరికుండవలె?

భారతదేశపు రథసారథియగు
భారత ప్రభుత్వమునకుండునయా!

మార్పులు, చేర్పులు చేయుటకొరకై
మన రాజ్యాంగపు నిర్మాతలు ఈ
ఆర్టికలు మూడు నందజేసిరయ!!

6. స్వాతంత్ర్యానంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేయడం కోసమే ఆర్టికల్ మూడును ఏర్పాటుచేశారంటున్నారు!

అదేమి కాదయ! భారతదేశపు
భావి విస్తృతిని దృష్టినిడికొనియు
ఆర్టికలు మూడు నేర్పరచిరయా!

సంస్థానమ్ముల విలీన ప్రక్రియ,
కొత్తరాష్ట్రాల నిర్మాణమ్ములు,
ఆర్టికలు మూడు ద్వారా జరిగెను!

ఆంధ్ర రాష్ట్రమును ఏర్పరచుటకిదె
ప్రధానభూమిక పోషించెనయా!!

7. బిల్లుపై పార్లమెంటులో చర్చా విధానం ఎలా ఉంటుంది?

ఆంధ్రప్రదేశ అసెంబ్లీలోన
చర్చలు ముగిసియు, రాష్ట్రపతి జేరి,
వారి ఆమోదముద్రతో పార్ల
మెంటులొ ప్రవేశపెట్టబడునయా!

దీనికి మూడగు రీడింగ్‍లుండును!
ఉభయ సభలలో ప్రవేశపెట్టుట,
బిల్లును సభయే పరిగణించుట,
తదుపరి చర్చలు ప్రారంభించియు
మార్పు చేర్పులతొ ఆమోదించుట!!

8. పార్లమెంటులో బిల్లు పాసయిన తర్వాత ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

బిల్లు పాసయిన వెంటనె విభజన
చట్టము అమలుకు రాబోదయ్యా!

రాష్ట్రపతియె ఆమోదించిన తరి
గెజిటు ప్రకటనము, విభజన చట్టము
అమలు కాబడెడి తేదీ ప్రకటన,
ఆస్తుల, అప్పుల పంపక ప్రక్రియ,
తదుపరి రాష్ట్రాల్ తమంత తామే
నడుచుట, అన్నియు ధ్రువీకరించియు,
విభజన చట్టము నమలు చేతురయ!
దీనికి కాలపు చట్రము లేదయ!!

9. రెండు రాష్ట్రాలుగా విడిపోబోయే తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం?

తెలుంగు ప్రజలిట అన్నదమ్ములుగ
విడిపోవునట్లు విడిపోవుడయా!
ద్వేషము విడచియు, ప్రేమ బూనియును
పరస్పరము విడిపోవలెనయ్యా!

వేషము భాషయు సంస్కృతి ఒకటే!
కావున మనము ఒకటేనయ్యా!
ద్వేషభావాలు ఇరుప్రాంతాలకు,
దేశానికి మంచివి కావయ్యా!

రెండు రాష్ట్రాలుగా విడిపోయియు
శాంతి కాములై కలిసుండుడయా!!

***     ***     ***     ***     ***

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

(నమస్తే తెలంగాణ దినపత్రికకు, శ్రీ పి.పి. రావుగారికి కృతజ్ఞతలతో...)

1 కామెంట్‌:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

Trader పేరుతో అడ్డమైన కూతలు కూసే ఓ కుసంస్కారీ! ఉడుకుమోతు తనంతో పిచ్చికూతలు ప్రేలుతున్నావు. నోటిని అదుపులో పెట్టుకో. అంత కుళ్ళు, అంత విషం నీ శరీరం నిండా నింపుకుని, నంగనాచి కబుర్లు ఎందుకు చెపుతావు? మా తెలంగాణ వాళ్ళపై పడి ఇంకా పరాన్నభుక్కులా ఆధారపడడానికి మేం అవకాశం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటున్న్నామనా నువ్వు సొల్లు కూతలూ, కారు కూతలూ కూస్తున్నావ్. మా తెలంగాణ మా నేతల ఐక్య ప్రయత్నంతో తప్పక వస్తుంది. మీ నేతలు మీ కళ్ళల్లో కారం కొట్టి, వంచించి, అధికారం కోసం కొట్టుకు చస్తున్నారు. ముందు అది చూసుకో! నీ సీమాంధ్రకు ఏం కావాలో వాళ్ళు కేంద్రానికి చెప్పేట్టుగా చెయ్. మమ్మల్ని తూలనాడటం, నోటి గుల తీర్చుకోవడం మాని నీ ఇల్లు తగలబడకుండా కాపాడుకో! వెళ్ళు...వెళ్ళు!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి