గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జనవరి 08, 2014

దురాశా పూరిత... గొంతెమ్మ కోర్కెలు...సీమాంధ్రుల కుట్రలే!


తెలంగాణ సోదరుడా
ఆందోళన వలదయ్యా!
ఆంధ్రుల కుట్రల, కేంద్రమె
భగ్నము చేసినదయ్యా!!

రాష్ట్ర పరిధిలోన లేని
వాటిని సాధింతుమనుట,
సీమాంధ్రుల దుర్మార్గపు
గొంతెమ్మల కోర్కెలయా!

బిల్లుపైన ఓటింగును
చేపట్టగ రాదనియును,
కొత్తవైన తీర్మానాల్
వ్యర్థములని కేంద్రమనెను!

బిల్లుపైన సవరణమ్ము
అసెంబ్లీ పరిధిని లేదు!
సవరణమ్ము కోరినచో
చర్చచేయుమయ ముందు!!

పార్లమెంటులో సవరణ
చేయు వీలు కలదయ్యా!
అసెంబ్లిలో సూచనములు
చేయువీలె కలదయ్యా!!

ఓటింగును జరుపుమనుట
సీమాంధ్రుల కుట్రయ్యా!
ముఖ్యమంత్రియే దీనికి
మొదటి సూత్రధారియయా!!

అసమగ్రం, దోషమయం
కాదు కాదు కాదయ్యా!
అనుమానాలకు తావిట
లేనే లేదో యయ్యా!!

బిల్లుపైన డిమాండులను
చేయుట మూర్ఖత్వమయ్య!
రాష్ట్రము కేంద్రముకు లేఖ
రాయుటయే బూటకమయ!!

బిల్లు తిప్పిపంపినా,
బిల్ వ్యతిరేకించినా
విభజనకంగీకారం
తెలిపినట్టులేనయ్యా!

ఇవియన్నియు సీమాంధ్రుల
కుట్రకుతంత్రాలేనయ!
ఎన్ని నాటకాలాడిన
తెలంగాణ ఆగదయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి