గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జనవరి 05, 2014

బహురూపుల చేతలు!


ఏమయ్యా జగనయ్యా
ఎందుకు ఈ మాటలు?
చపలత్వం వీడనట్టి
బహురూపుల చేతలు!!

రాజకీయ ప్రయోజనం
నీకు ఉన్న దురాశయం!
వేరు పార్టి పెట్టుటయే
అగు దీనికి నిదర్శనం!!

తెలంగాణ సీమాంధ్రల
గుప్పిట పట్టుటకు కుట్ర!
తెలంగాణ సీమాంధ్రల
దోపిడి చేయుటకు కుట్ర!!

నాడు నీవు ఏమంటివొ
మరచినావె ఇప్పుడు!
కృతజ్ఞతను చూపించియు
కృతఘ్నతను వీడుడు!!

తెలంగాణ సెంటిమెంటు
గౌరవింతు ననలేదా?
అధికరణం మూడు ద్వార
ఇడిన ఒప్పె దనలేదా?

పరకాలకు వచ్చినపుడు
మీ అమ్మయె ఏమన్నది?
తెలగాణకు వైసీపీ
సానుకూల మనలేదా?

తెలగాణకు వచ్చినపుడు
నీ చెల్లియె ఏమన్నది?
తెలంగాణ అమరవీరు
లే, తన సోదరులన్నది!!

తెలంగాణలో జెండా
ఎత్తేసిన నీవు ఇపుడు
గతం మరచి ఏమంటివి?
సమైక్యాంధ్ర నాదంటివి!!

కాంగ్రెస్‍నూ టీడీపిని
దెబ్బతీయ బూను నీకు
ఇన్ని పాట్లు ఎందుకయా?
ఓట్ల కోసమే కాదా?

సీమాంధ్రుల మోసగించి
ఓట్లు దండుకొనుట కొరకె
బహురూపుల మాటలు!
బహురూపుల చేతలు!!

స్వచ్ఛమైన జనుల నిపుడు
మోసగింపబూనకయ్య!
సీమాంధ్రకు వలసినట్టి
చర్చలు చేపట్టుమయ్య!!

ఏమయ్యా జగనయ్యా
ఎందుకు ఈ మాటలు?
చపలత్వం వీడనట్టి
బహురూపుల చేతలు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి