"నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నాకేటి వెఱపు?"
అని ముఖ్యమంత్రియే యక్రమమ్ముగను
పఱఁగ శాసనసభా వ్యవహార మంత్రిఁ
దొలఁగించి, తనమాటఁ దలఁదాల్చు నతని
నియమించి, తనయిచ్చ నెగ్గించుకొనెను!
తెలగాణ బిల్లును తెగనీయకుండఁ
జర్చకే రాకుండ సరగున నడ్డి,
వోటింగుఁ బెట్టియుఁ బూని బిల్లిపుడు
తమకనుకూల సత్తానుఁ జూపించి,
తీర్మానముం జేయు తీరుతోడుతను
దానిట్టి మార్పును బూనెనే కాని,
మూర్ఖత్వమే యిందుఁ బూర్తిగా నుండె!
బిల్లులో తానెన్ని పెనుమార్పు లిడిన
నెంత తీర్మానించి యేమి చేసినను
తన యిచ్చ చొప్పున తాను వర్తిలిన
గేంద్రమ్ము తనయిచ్చకే మొగ్గుఁ జూపు!
అధికార మున్నదం చాతనిన్ దింపఁ
దనను దింపెడివారు తనపైన లేరె?
సత్కార్యమును గోరి, సహియింత్రు గాని,
యెగురఁ గొట్టఁగఁ దన నెంతసేపగును?
ఎంత దూకుడుఁ జూపి, యెన్ని చేసినను,
తెలగాణ రాష్ట్రమౌ తీర్పు ఖాయమ్ము!
ముఖ్యమంత్రికి దక్కు మూర్ఖతే సుమ్ము!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
3 కామెంట్‌లు:
ముఖ్యమంత్రి పీటం కింద నేల కదలిపోతున్న ఈ సంధికాలంలో ఇదే కిరణ్ చివరి చర్య!!!
mari evari ishtam annatlu aa sridharbabu BAC lo discussion lekunda assembly lo charcha modalaindhi ani prakatana chestadu ?? appudu gurthu raaledha meeku rules ? em matladtunnaru meeru asalu.. naalugu linelu kottesi edo vemana padyala laaga vaatiki bhajana okati.
ముఖ్యమంత్రి పత్తా లేడు. రాష్ట్రపతి బిల్లు వచ్చి మూడు రోజులైనా అసెంబ్లీ సభ్యులకు అందజేయబడలేదు. సెక్రెటరీ సీఎం తొత్తులా మారాడు. ఏం చేయాలి? రాష్ట్రపతి నుండి బిల్లు వచ్చిందంటే, సభలో ఎన్ని బిల్లులున్నా అన్నీ పక్కన పెట్టేయాలి. రాష్ట్రపతిబిల్లుపై చర్చ జరపాలి. ఆమోదించి, వెంటనే పంపాలి. ఇదేదీ లేకుండా ముఖ్యమంత్రి పట్టనట్టుంటే సభాపతి తాను చేయవలసింది తాను చేశాడు. రాష్ట్రపతిబిల్లును అవమానించకుండా వెంటనే చర్చకు పెట్టాడు. దీనికి BACతీర్మానం ఎందుకు? ఎలాగైనా చర్చకు పెట్టవలసిందేగదా! శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలకు ముందు BAC తీర్మానం ననుసరించే నడచుకున్నాడు. ముఖ్యమంత్రే తప్పాడు.
నేను నాలుగు లైన్‍లు రాయగానే వేమనను అయ్యానని చెప్పుకోవటం లేదు. మీ సీమాంధ్రుల కుట్రలను ఎండగడుతున్నాను. ఐనా నీకేం తెలుసని వీటిని పద్యాలు కావంటున్నావు? పచ్చకామెర్లవానికి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు, నీకు నేను రాసింది కేవలం నాలుగు లైన్‍లలాగా కనబడటం నీ అజ్ఞానం. నేను రాసినవి లక్షణ బద్ధంగా ఉన్నాయి. ఏది రాసినా లక్షణ బద్ధంగానే రాస్తాను. నీకే లక్షణం తెలియదు. ఛందస్సు తెలిస్తే ఇలా మాట్లాడవు! వేమన సంఘంలో జరుగుతున్న అవినీతిని, చెడును నిరసించాడు.నేను సీమాంధ్రుల అకృత్యాలను ఎండగడుతున్నాను. మీలాంటి వాళ్ళు పనికిరాని వాదనలు చేస్తున్నారు. నేను ఖండిస్తుంటాను. తప్పదు..
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి