గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జనవరి 23, 2014

అన్నీ పచ్చి అబద్ధాలు!


మాట యిచ్చి తప్పినట్టి
ముఖ్యమంత్రివయ్య నీవు!
గత చరితను వక్రపఱచి
చెప్పినట్టి వక్తవీవు!!

ఒకరిద్దరు విశాలాంధ్ర
కోర, అంత కోరినట్ట?
జగ్గ రెడ్డి వంటి వారు,
వారలు కావచ్చుగదా!

కోటిమందిలో ముగ్గురు
కోరగానె సరియౌనా?
కోటిమంది వద్దనగా
మీరలెట్లు కలుపుదురయ?

ఇందిరమ్మ పలుకులన్ని
సీమాంధ్రకె వర్తించును!
వంకర మాటలు చెప్పియు
తెలంగాణకతికించకు!!

సీమాంధ్రా పక్షపాతి
వయ్యు, తెలంగాణమునకు
నష్టము కలిగించు మాట
లాడి మమ్ము వంచించకు!

సీమాంధ్రులు తెలంగాణ
నేమి చేసి రన్న దంత
కేంద్రమునకు తెలియునయ్య!
నీవు బొంక, నిజమగునే?

ముఖ్యమంత్రి సీమాంధ్రకె,
తెలంగాణ కీవు కావు!
పక్షపాతమున్నయట్టి
నీవా మా ముఖ్యమంత్రి?

తెలగాణకు వ్యతిరిక్తుడ
నేను కాను అంటూనే,
బిల్లుకు వ్యతిరేకిననుట
పొసగునట్టి మాటయా?

నీవు చొక్కమైన, మేము
ఊరక నిందించితిమా?
నోరు తెరువ నబద్ధాలె,
నిన్ను మేము నమ్మెదమా?

తెలగాణను మభ్యపెట్టు
మాటలు చాలించుమయా!
మాటను నిలబెట్టుకొనగ
బిల్ ఆమోదించుమయా!!

నేటి సభను నీ మాటలె
ఆఖరు బంతియె ఔనా?
పరుగులేవి పొందకయే
ఔటగుటయె నిజము కదా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

Trader చెప్పారు...

okadu iddaru pani leni politicians and chaduvu raakunda adda daarilo udyogalu kotteddam anukune students kavalante telangana icheyyala.. lol. idhi kuda adhe.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

Trader ! ఈ నీ వ్యాఖ్య పూర్తిగా నీ సీమాంధ్రులకే వర్తిస్తుంది. ఎందుకంటే, చదువు రాకున్నా మా తెలంగాణ ఉద్యోగాలు కొట్టేశారు. అన్ని ఉద్యోగులను నింపే అధికారులు మీ సీమాంధ్రులే ఉన్నారు. వాళ్ళు సీమాంధ్ర రాజకీయవాదుల అండదండలతోనే ఆ స్థాయికి వచ్చారు కాబట్టి రాజకీయవాదుల రెకమెండేషన్‍పై, ఎందుకూ పనికిరాని, చదువుసంధ్యలులేని వాళ్ళకు మా చదువుకున్న తెలంగాణ వాళ్ళకు ఇవ్వవలసిన ఉద్యోగాలను అక్రమంగా కట్టబెట్టి మా నోట మన్నుగొట్టారు. నిజానికి మా అన్నాన్ని మీ సీమాంధ్రులు పరాన్నభుక్కుల్లా తిని, బలిశారు. మేం కష్టజీవులం. ఇతరుల కష్టాన్ని రెకమెండేషన్‍ల పేరిట కొల్లగొట్టే దగుల్బాజీలం కాం. మమ్మల్ని దోచుకోవడానికే, సమైక్యాంధ్ర అంటున్నారు! అరవై ఏళ్ళు దోచుకున్నారు. ఇంకా సరిపోలేదని...మా బ్లాగుల్లో విషంకక్కుతున్నారు...నీలాంటి పనిలేని Traderలు! సోమరిపోతులు, చదువురాకున్నా రెకమెండేషన్‍లతో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందింది మీరు. మీ ఈ ఉద్యమం కూడా మా తెలంగాణులు మీ దోపిడికి మేం సహకరించలేదనే! ఎంత ఛీత్కరించినా వదలని కుసంస్కారులు! మీ దోపిడీ ఇకపై సాగదు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యతో మరోమారు రావద్దు. విషం కక్కవద్దు. మా తిరస్కారానికి గురికావద్దు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

Trader! మా బ్లాగుల్లో పనికిరాని వ్యాఖ్యలతో విషం కక్కవద్దంటే, విషం కక్కడానికి మళ్ళీ వచ్చి విషపువ్యాఖ్య రాశావు. నీ చవకబారు వ్యాఖ్యలతో మాకు అవసరం లేదు. మరో మారు రావద్దన్నా, మళ్ళీ వచ్చి వ్యాఖ్య పెట్టడం నీ కుసంస్కారానికి నిదర్శనం. మా తెలంగాణులపై తేలిక భావనతో, కుట్రలతో, కుతంత్రాలతో, విషపు రాతలతో మాబ్లాగుల్లోకి మరోమారు రాకు. తిరస్కరింపబడకు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి