కాంక్షతోడ నేఁడు కాంగ్రెస్సు టీడీపి
చర్చ సేయఁగాను సమ్మతింప,
వలదటంచుఁ దెలిపి వైయెసార్ సీపీయె
మూర్ఖమునను విడదు మొండిపట్టు!
రాష్ట్రపతియె బిల్లు రాష్ట్రమ్మునకుఁ బంప,
నొకఁడుఁ జించెఁ, గాల్చె నొకఁడు! యిటులఁ
బ్రథమపౌరుఁడైన రాష్ట్రపతిని నేఁడు
భంగపఱుపఁ దగునె భ్రష్టుల వలె?
తివిరి యడ్డగింపఁ దెలగాణ మాగదు!
రాష్ట్ర జనుల క్షేమ లాభమెంచి,
చర్చసేయఁబూన, శాంతి సౌఖ్యమ్ములు
కలుగునయ్య! వేగఁ గలుగు సుగతి!
సర్వవిషయ మెఱిఁగి, సన్నాసులందునఁ
గలిసెదమని పలుక, ఘనత యగునె?
స్వార్థకాంక్ష వీడి, చర్చలం జేపట్టి,
వృద్ధిఁ గనుఁడు మీరు వేగముగను!
కేంద్ర మిపుడు పూని, క్షేమమందింపఁగ
నేఁడు రాష్ట్రములను నేర్పరింప
బిల్లుఁ బంపె! చర్చ వెంటనే ముగియించి,
త్రిప్పి పంపుఁడయ్య ప్రీతితోడ!
భిన్నమైన పట్టు వేగమే వీడియుఁ,
జర్చ సేయ, మీకు జరుగు శుభము!
చేయకున్నఁ జర్చ, సీమకే నష్టము!
కాక యున్నను దెలగాణ వచ్చు!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి