గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 06, 2015

ఆంధ్రోళ్లు అనొద్దు.. ఆంధ్రా ఎంపీలకు పౌరుషం లేదా?

Andhra MPs do not have guts? questioned Pawan Kalyanప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు... అని జనం నిలదీసే సరికి ఎట్టకేలకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ముందుగా సీఎం కేసీఆర్‌ను ఒక మాటలో పొగిడారు. యాదగిరి నరసింహ స్వామి ఆలయం డిజైన్ చేయడానికి ఆంధ్రా వ్యక్తిని నియమించి తెలుగు జాతి ఐకమత్యానికి కృషి చేస్తున్నందుకు కేసీఆర్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.


ఆ తరువాత ఓటుకు నోటు కేసుకు తనకు సంబంధం లేదన్నారు. ఆ పని కోర్టులు పోలీసులు చూసుకుంటాయన్నారు. కాసేపు ఆంధ్రా ఎంపీలను తిట్టారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన ప్రసంగంలో ఈ ఒక్క ప్రశ్న మాత్రం కరెక్టుగా అడిగారు. కానీ అందులో చంద్రబాబు, వెంకయ్య నాయుడు, మురళీమోహన్‌లను వదిలేసి మిగతావారి పేర్లు చెప్పారు. ఆంధ్రా పాంతం నుంచి ఎన్నికైన ఎంపీలంతా పార్లమెంటులో ఏం చేస్తున్నారని, గోడలను, స్తంభాలను చూస్తూ మైమరిచి పోతున్నారా? అంటూ నిలదీశారు. 


తెలంగాణ ఎంపీలను చూసి నేర్చుకోండి, వారు స్వరాష్ట్రం కోసం ఎలా పోరాడారో! ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రంతో కొట్లాడండని పవన్...ఏపీ ఎంపీలకు సూచించారు. ఆయన ప్రసంగం ఆథ్యంతం ఆంధ్రా రాష్ట్రం, ఆంధ్రా ఎంపీలు అంటూ మాట్లాడిన పవన్ తెలంగాణ వారు మాత్రం ఆంధ్రా ప్రజలను ఆంధ్రోళ్లు అనొద్దని చెప్పారు. చంద్రబాబును సైతం ఆంధ్ర సీఎం అనొద్దట. ఈ మాట అన్నపుడు మీడియా ప్రతినిధులకు అర్థం కాలేదు. కోపమొస్తే తిట్టేటపుడు ఆంధ్రా సీఎం అనో ఆంధ్ర చంద్రబాబు అనో కాకుండా డైరెక్టుగా చంద్రబాబు అని తిట్టండని సూచించారు. 


మొత్తం మీద వెనకది ముందుకు, ముందుది వెనకు మాట్లాడుతూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడి అందరినీ కాస్త ఇరిటేట్ చేశాడు. ఆయన ప్రసంగంలో ఒక్కటి మాత్రం స్ఫష్టంగా చెప్పాడు. తెలంగాణ ఎంపీలను ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రత్యేక హోదాకు పోరాటం చేయండని ఆంధ్రా ఎంపీలను, ఇతర రాజకీయ పార్టీ నేతలను డిమాండ్ చేశారు. తాను మాత్రం పూర్తి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత ప్రత్యేక హోదాకోసం పోరాటంలో కలసి వస్తానని చెప్పారు.


సెక్షన్-8కు తాను వ్యతిరేకమని పవన్ స్పష్టం చేశారు. సెక్షన్-8ను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ప్రజల్లో ఏర్పడిన ఆనందంపై నీళ్లు చల్లొద్దన్నారు. ఈ సెక్షన్‌ను అమలు చేస్తే రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఉధ్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సెక్షన్-8 అమలును కేంద్రానికి అప్పగించి తప్పు చేయొద్దన్నారు. ఈ బాధ్యతను తెలంగాణ సీఎం కేసీఆర్ చూసుకోవాలని సూచించారు.(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!4 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

సెక్షన్ 8 వద్దని వూరుకుంటే బాగనే ఉండేది.ఒక ఐ.యే.యస్ ఆఫీసర్ని పెట్టి అతన్ని దైరెక్తుగా ప్రధానమంత్రి అధీనంలో ఉంచాలట! ఈ పిచ్చివాణ్ణి "పవన్ ఈస్ గాడ్" అంటూ దేవుడితో సమానం చెయ్యడం.మోదీ దగ్గిర్నుంచి బాబు వరకూ గొప్ప వ్యక్తిగా ప్రకతనలు ఇవ్వటం.ఆపాయింటుమెంతు ఇవ్వటానికే పనికిరానోణ్ణి ఆకాశాని కెత్తటం.

ఇండైరెక్టుగా తెలంగాణాని బ్లెం చేస్తున్న అతని తత్వం దాపరికం లేకుండా తెలిసిపోతుంటే ఇంకా నిష్పక్షపాతంగా ఉంటున్నాడంటే నమాలా?

తెలుగు ప్రజల్ని కలపడమంటే ఇట్లా కాదు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఆంధ్రాను గానీ, తెలంగాణను గానీ బ్లేం చేయడాన్ని ఎవరూ సమర్థించరు! ఈ నీతులు చెప్పడం...ఎదుటివానికి చెప్పేటందుకె నీతులు వున్నాయి అన్నట్టుగా ఉన్నది. నిత్యసత్యవ్రతుడైనట్టు తానే గొప్పవానిగ భావిస్తూ నీతులు చెప్పడం వల్ల ఎవరూ అపర సత్యవంతులు కాలేరు. ఎర్రగురివింద తన నలుపును ఎరుగనట్లు నీతులు చెబుతుంటే నలుపును ఎత్తి చూపాల్సిందే కదా! తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు...! అంత మాత్రాన వాళ్ళు ప్రజల్లో నీతిమంతులు కాబోరు. క్లీన్ చిట్ ఇవ్వటం కూడా జరుగదు...కానీ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకొని మాట్లాడడం...స్వాతిశయాన్ని ప్రకటిస్తుంది! ఇది సరైనది కాదు. ఖండించదగినదే! ఒకరిని ఆకాశానికి ఎత్తడం ఇంకొకరిని పాతాళానికి తొక్కడం కూడా మంచిదికాదు. అలా అని, తెగడవలసిన వాళ్ళను ఉపేక్షించడం కూడా మంచిదికారు. దోషులెవరో...నిర్దోషులెవరో...నేరచరితులెవరో...నేరరహితులెవరో చక్కగా తెలిసి వ్యవహరించాలి...లేదా...లోకంలో వారి చరిత నిరూపణ ఐన తర్వాత మాత్రమే వారిపై పొగడ్తలుగానీ, తెగడ్తలుగానీ సంధించాలి. మన దృష్టిలో మంచివాడైనవాడు ఇతరుల దృష్టిలో చెడ్డవాడు కావచ్చు. కాబట్టి మన కోణం నుండి కాకుండా అన్నికోణాల నుండి దర్శించి ఆ తర్వాత స్పందించాలి. తొందరపడి నిర్ణయానికి రాకూడదు. మొత్తానికి...చెడ్డవాడు చెడ్డవాడే, మంచివాడు మంచివాడే. ఒకరు తిట్టడం వల్లగానీ, మెచ్చుకోవడం వల్లగానీ వారి చెడ్డతనం/మంచితనం మాసిపోదు.

స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. స్వస్తి.

Unknown చెప్పారు...

తెలంగాణా వాడిని "తెలంగాణా వాడు" అంటే గర్వంగా ఫీలవుతాడు! మరి ఆంధ్రుడిని "ఆంధ్రుడు" అనకూడదట! కావాలంటే తిట్టండి కానీ "ఆంధ్రోళ్ళు" అని మాత్రం అనొద్దు అంటున్నారంటే ఆ పదమంటే వారికే అసహ్యంగా వుందేమో పాపం!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులు శ్రీకాంత్ చారిగారూ!

మన దృష్టిలో ఆంధ్రులంటే...తెలంగాణకు నష్టం చేసి అక్రమాస్తులు కూడబెట్టుకున్న అక్రమార్కులని, పెత్తందారులని, దోపిడీదారులని, నమ్మకద్రోహులని...తేనెపూసిన కత్తులని మనమంటున్న మాటలను బట్టి పవన్ ఆ విధంగా తమను "ఆంధ్రులు" అని పిలిపించుకోవడానికి జంకుతున్నాడని ఎందుకనుకోకూడదు?

ఆంధ్రులు మన సోదరులని మన మనుకుంటున్న విషయం అతనికి తెలియదేమో! మనను అణచివేతకు గురిచేసిన వాళ్ళను "ఆంధ్ర"పదంతో మనం నిందించడం వల్ల (...అతనిలో కూడా అలాంటి ఆలోచనా బీజమున్నదేమో..అందుకే...) తమను "ఆంధ్రులు" అని పిలవ వద్దని...ఆ మాటంటే ఏవగింపు కలుగుతున్నట్టుగా ఫీలవుతున్నాడేమో! ఎవరికి తెలుసు?

ఇది మన సోదరాంధ్రుల పట్ల వర్తించని విషయం. అక్రమార్కులకు మాత్రమే వర్తించే విషయం. అందుకే ఉలిక్కిపడుతున్నారు వారు!

స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు కృతజ్ఞతలు! స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి