గుండు జ్ఞానము అనగా నేమి ? అది ఎట్లు వచ్చును ? (ఈ శీర్షికపై క్లిక్ చేసినచో ఆ బ్లాగు తెరచుకొంటుంది)
గుండు అనగా పూర్ణము. పూర్ణము అనగా అసంపూర్ణము కానిది. అసంపూర్ణము అనగా అది ఏదియో తెలియనిది కొంత వదిలి వేయ బడినది.
అది ఏదియో తెలియనిచో అది వదిలి పెట్ట బడినది అని ఎట్లా తెలియును ?
అనగా అది ఏదియో తెలియనది వదిలి బెట్ట బడినది అను కించిత్తు జ్ఞానమే గుండు జ్ఞానమా అన్న ప్రశ్న ఉదయించును .
అనగా ఆ కించిత్తు దేనినో సూచించును . కాని అది ఏదియో తెలియదు .
కావున ఆ కించిత్తు ని వలవేసి పట్టు కుని అది ఏదియో దానిని పట్టుకొనుట కుదురును అను జ్ఞానమే గుండు జ్ఞానము అని అనుకోనవచ్చునా ??
గుండు జ్ఞానము కలదు అని విశ్వసించిన గుండు కాని జ్ఞానము కూడా ఉండ వచ్చును అని అనిపించు ను. కాని పూర్తి గా మనసును బెట్టి పరిశీలించిన ఉంటె గుండు జ్ఞానము మాత్రమె గలదు . అది లేని చొ ఏదియును లేదు అని సూక్ష్మము గా తెలుసు కొన వచ్చును .
ఇట్లాంటి గుండు జ్ఞానము ను తెలుసుకొనుటకు ఏది సౌలభ్యమైన మార్గము ? మనస్సు ద్వారా ఆ గుండు జ్ఞానము అవగాహన అగునా ? హృదయము ద్వారా అది అవగాహన అగునా అను సందేహము వచ్చును .
అసలు మనసు అనగా నేమి ? బుద్ధి అనగా నేమి ? అహం కారము అనగా నేమి ? హృదయము అనగా నేమి ? ఇవన్నీ తెలిసిన గుండు జ్ఞానము తెలిసినది అని నిర్దారించ వీలగునా ??
తెలుగు భాషలో అన్ని అచ్చులు హల్లు లు కొన్నింటి ని తప్పించి అనగా క, గ చ ఛ ద వంటి కొన్నింటి ని తప్పించి 'గుండు' నిబిడీ కృతమై ఉండడమును మనము గమనించ వచ్చును . ఇదియు ఒక విధమైన గుండు జ్ఞానమే !
జిలేబి గుండుగా ఉండును. గుండు గుండు గా ఉండే వన్నీ గుండు జ్ఞానము కలిగి ఉండునా ? అన్నది ప్రశ్న .
కావున గుండుగా ఉన్నంత మాత్రమున గుండు జ్ఞానము వశీకరణము అగునా అన్నది ప్రశ్నార్థకమే .
అటులే , గుండు కాని చో కూడా గుండు జ్ఞానము సాఫల్యము అగును అని ఖచ్చితము గా చెప్పలేము.
ఇటులు సర్వ వ్యాప్తమై ఉండి, సర్వ అవ్యాప్తమై ఉండి గుండు ఉండీ , అసలు ఉందా లేదా అన్న సందేహము ను ప్రతి క్షణము లోను లేవదీయు గుండు అసలైన సర్వ జ్ఞానము.
యస్య జ్ఞాన దయా సింధో ....
(గోడ దూకితే అదే సందు !)
ఇంతటి తో గుండు జ్ఞాన కాండ పరి సమాప్తము. దీని ని చదివిన వారికి గుండు జ్ఞానము మెండు గా నిండుగా గలుగ వలె నని జిలేబి ఆ గుండు గుండు ని వేడు కుంటూ ..
జిలేబి
మీకు గుండు జ్ఞానము పరి పూర్ణముగా కలిగినందు లకు మిక్కిలి ముదంబును చెందినాము :)
జిలేబి
గుండాత్ గుండుముదచ్యతే
గుండాస్య గుండుమాదాయ
గుండుమేవావశిష్యతే
(గుండోపనిషత్ మొదటి వల్లి, నాలుగో అనువాకం, మొదటి పద్యం)
అవున్నేను రాసిందే
అంతేనండి గుండు జ్ఞానం అంటే.
ఆహా డీ జీ గారు,
మీకు మీరే మాకు మేమే !!
జిలేబి
ఈ గుండు వారి ఆంజనేయ స్వామీ టపా వివరములు ఏమిటి ? తెలియ జేయవలె ! ఈ టపా అది చదివి వ్రాసినది కాదు; ప్రజ బ్లాగు లో కొండలరావు గారి ప్రశ్న కి| "అసమద్ శ్రమ దానం "
చీర్స్
జిలేబి
బుండిన నది యెట్టులుండు నుండునొ నది లే
కుండెనొ యని బెదరితి కల
గుండుపడితి గుండె చెదరి కూలి జిలేబీ
కం. మీ గుండోపనిషత్తిది
బాగున్నది గుండు తెలివి బహుచక్కగ హా
స్యాగమ సారవిచారము
నా గుండును పగులగొట్టి నాటె జిలేబీ
కం. గుండువివేకము కలుగుచు
నుండుట కే కారణంబు లుండెడు నొకఛో
నుండిమి కెయ్యది కతమని
గుండువివేకుకులకు తెలియు చుండు జిలేబీ
కం. మెండుగ గుండు తెలివి తల
పండున కలవారు బుధులు భావింపగ నది లే
కుండిన వారలు ఖాళీ
గుండుల వారనచు తెలిసి కొంటి జిలేబీ.
శ్యామలీయంవారి ఈ జిలేబి కందాలకి త్రాపించండి , బెనారస్ దూద్ ప్లస్ హాట్ హాట్ జిలేబీస్ !!
నెనరస్య నెనరః !
గుండు జిలేబి మకుటానికి ఇంతగా పని పెడుతుందని అనుకో లేదుస్మీ :)
జిలేబి
ప్రపంచమే ఒక పెద్ద మేషాండం కదా!
ఊహించారొక గాడ్ది గుడ్డు ఉండచ్చని మాం
పాహి మహా గుండువివే
కీ హన్నా గార్ధభములవేల జిలేబీ
ఆహా హరిబాబు గారి మేషాండం మరో జిలేబీ కి తావు తీసింది :)
శ్యామలీయం వారు, గాడిద గుడ్డు అంటే ఇదా అర్థం :) గాడ్ ఈజ్ గ్రేట్ నిజంగా నే : )
జిలేబి
(ఇదంతా నా బుర్రలోంచి వచ్చిందనుకుంటున్నారా? అబ్బే నాకంత సీనేదీ? నమస్తే గుండు సౌజన్యంతో)
"పోతన" అనే పదంలో "త" తెలంగాణాకి చెందినదే అని అభిజ్ఞాన వర్గాల భోగట్టా. "బమ్మెర" లో కానీ "పోతన" లో కానీ "సీమ" గానీ "ఆంధ్రా" కాని ఎక్కడైనా కనిపించిందా మీకు? ఆఖరికి "బాగవతం" లో కూడా "త" ఉంది గమనించారో లేదో? ఆ మాత్రం తెలియని మీరు పద్యాలు ఎలా రాస్తున్నారో? మొదటి తప్పుగా మీ అజ్ఞత ని మన్నించాం. ముందెప్పుడూ ఇలా అనకండి. మా భావాలు దెబ్బతింటాయ్. అవి దెబ్బతింటే మీ సీమాంధ్రా మరో మరు ముక్కలై ఉత్తి "సీమ", ఉత్తి "ఆంధ్రా" మిగుల్తాయ్! జాగ్రత్త!!
ఆ మూడూ గుళ్ళూ మనవే మూడు రకాల గుండ్లూ మనవే - మిగతావాళ్ళకు హక్కు గుండుసున్నా.
కం. గుండన సింహాచలపున్
గుండగు మరి యన్నవరపు గుండగు నాపై
గుండన తిరుపతి గుండే
గుండనదగు ఖ్యాతిదక్కి కులుకు జిలేబీ
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదన్నట్టు జిలేబి వారి గుండో పాఖ్యానం లో కూడా ఆంతెలంరాయ సమస్యా :) వామ్మో జిలేబి మాయమై పో ఇక్కడ నించి :)
గుండు మహత్వ పూర్ణ మైనది అది ఎక్కడ ఉన్నను అది సర్వ జనావాళీ కి చెందిందండి డీ జీ వారు !
జిలేబి
అద్దమూ దువ్వెనా లాంటి సోకులేమీ అక్కర్లేని గుండూ!
హరిబాబు గారు పేరడీ కి గుండు రెడీ !
జిలేబి
1.గుండు అనగానేమి?
2.గుండుకి బట్టతలకి తేడా ఏమీ?
3.గుండుని బట్టతల అని ఎందుకనరాదు?
4.ఎవరికి తెలివితేటలెక్కువ గుండున్నవారికా, బట్టతలవారికా?
5.గుండు అందరికీ ఉండునా, ఇందు స్త్రీ పురుషభేదము కలదా?
6.గుండు చేయించుకొనవలెనా, చేయువారు ఎక్కువగానే దొరుకుతున్నారా?
ప్రశ్నోపనిషత్తు ప్రశ్నలు సమాప్తం, జవాబివ్వకపోయిన గుండు పే...
కష్టే ఫలే వారు,
మీరు ప్రశ్నోపనిషత్తు వేయగల వ్రాయ గల సత్తా ఉన్నవారే , అదిన్నూ గుండు మీద ! తిరపతి గుండు కథ గుర్తు కోస్తోంది మీ ప్రశ్నో ప నిషత్తు చదివితే : )
జవాబులు ఎవరైనా ఇస్తారేమో వేచి చూడాలి !
జిలేబి
శర్మ గారు,
ఈ గుండు టపాలో కుట్ర కోణం లేదు గాని 'కుంభ' కోణం' ఉంది :)
జిలేబి
గుండూ గుండూ రాసుకుంటే చుండ్రు రాల్తుంది?
కం. గుండ్రాయి వంటి తలపై
చుండ్రెచ్చట నుండి వచ్చు చోద్యము గాదే
ఆండ్రెబ్బ జేసి అ చుం
డీండ్రబడం తరమె సత్యమెన్న జిలేబీ
తుపాకి గుండులాపేలెకదా గుండు టపా
కం.
గుండుంటే బుద్ధుండును
గుండే లేకున్న తెలివి కొండే యెక్కున్!
గుండుఁ దలఁచు మనసే బా
గుండును ఓ ఆంధ్రులార కోపమదేలా?
ఈ "గుండు"పైఁగల మీ అందఱి కోపములును, వెటకారములును శమించి, యందఱును స్వచ్ఛమనస్కులగుదురుగాక! స్వస్తి.
కొందరికేనేమోనండీ ...... అయినను పోవలె 'గుండు'లోనూ 'గుండె'లోనూ ఇతరులపై కారముల్.... వెటకారముల్.....
మీ పేరులో ఉన్న గుండు మీద సర్దాగా నవ్వుకుంటున్నాం.మీరు కూడా మీ గుండును నిమురుకుంటూ నవ్వుకోండి గుండులా!
"యిల్లు యిల్లనియేవు ! యిల్లు నాదనియేవు |
నీ యిల్లు యెక్కడే చిలుకా ? "
అనేది గుర్తుందిగా.
అదే అలవరస పై , ప్రస్తుతం "గుండు జ్ఞానం" సంపాదిచుకున్నవారిని చూసి :-
గుండు గుండనియేవు | గుండు నాదనియేవు |
నీ గుండు యెక్కడే చిలుకా?
అని ఇహనుంచీ జనం పాడతారేమో చూడండి :)
గుండు మధుసూదన్ గారు ఈ టపా విషయంలో తీవ్రమనస్తాపంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి రెండు పర్యాయాలు తెలంగాణా పదం కూడా కనిపించటంతో వారు అదీ ఇదీ కలిపి జోడించుకొని ఇది ఆంధ్రులకు తెలంగాణాపై ఉన్న విద్వేషపూరితమైన కుసంస్కారంలో భాగంగా లెక్కించి ఒక టపా కూడా వ్రాసారు తమ బ్లాగులో. ఈ టపానూ దానికి నిన్నటివరకూ వచ్చిన వ్యాఖ్యలనూ కూడా జోడించి చూపి ఈ టపాకర్త్రీ, వ్యాఖ్యాతలూ అనబడే నంగనాచులూ తేనెపూసిన కత్తూలూ చేసిన నిందాలాపాలను ఖండించాలని యావత్తు తెలంగాణావాసులకు పిలుపు నిచ్చారు! ఇదంతా వారి అపోహ అని ఎవరన్నా ఇది ఆంధ్రుల కుసంస్కారం క్రిందికే వారి లెక్కించే తీరుతారు కదా!
కాబట్టి అనవసరవాదవివాదాలకు తావివ్వకుండా ఈ టపాకు వ్యాఖ్యలు వ్రాసేవారి జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి.
ఇకపోతే ప్రతి విషవ్యాఖ్యకు క్రుంగిపోతే నష్టం మనను ద్వేషించే వారికి కాదు, మనకేనని మధు గారితో అందరికీ మనవి.
కొంత వ్యాఖ్యాత దృక్కోణబేధం వలన అపార్థాలు రావచ్చును. అలాగే అర్థం చేసుకొనేవారి దృక్కోణంలో ఉన్న బేదం వలన కూడా అపార్థాలు రావచ్చును. ఈ రోజున మీరే మరొకచోట ఒక వ్యాఖ్యలో "విశాలాంధ్ర కాదు విషాంధ్ర అనీ పీడా పోయింది!" అనీ అన్నారు. ఇవి కొందరికి రుచించకపోవచ్చును. మరలా దృక్కోణ బేధం వలననే. ఇప్పుడు విషం తిన్నట్లుగా గిలగిలలాడుతున్నది ఏ తెలుగుగడ్డ అన్నది ప్రతివారికీ తెలుసును, మీ రన్నది సబబుకాదు అని వారు అనుకోకూడదా? మాటవరసకు ఈ సంగతి ప్రస్తావించాను.
ఏవిషయానికి ఆవిషయం ఆలోచించినా, ఇక్కడ ఏ వ్యాఖ్యాతకూ తెలంగాణా ద్వేషం అంటూ ప్రత్యేకంగా ఏమీ నా దృష్టికి కనిపించటంలేదు. పోనివ్వండి. నేను అలా ఆలోచించలేనేమో!
మీరు నా వ్యాఖ్యను ప్రస్తావించారు కాబట్టి ముందు దాని గురించి మాట్లాడుదాం. "విశాలాంధ్ర" అంటే సీమాంధ్ర కాదు, అక్కడి ప్రజలు అంతకన్నా కాదు. తెలుగు మాట్లాడే ప్రజలు అందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని, ఇందుకు వేర్వేరు ప్రాంతాల ప్రజల అంగీకారం ఉన్నా లేకపోయినా ఫరవా లేదనే ఒక రాజకీయ ప్రయోగం మాత్రమె. దీన్నే విషమనో, దౌర్జన్యం అనో అనుకోవడంలో సబబు కానిదేమిటో నాకు తెలీడం లేదు.
ఆంద్ర రాష్ట్రం ఇప్పుడు విలవిలలాడుతుందన్నది మీ అభిప్రాయం కావొచ్చు నేను ఒప్పుకోనక్కరలేదు. కేవలం ఇట్లాంటి "దృక్కోణబేధం" వల్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు రావని నేను అనుకుంటున్నాను. Hatred is different from diasgreement.
మధు గారి మీదే కాదు మీతో సహా ఎందరి మీదో బ్లాగులలో విషం కక్కడం మీరు చూసే ఉంటారు. ఆ ద్వేషానికి కారణం సదరు రచయిత శైలి కొంతయితే వారి ఆలోచనల మీదే ఎక్కువ.
PS; తెలంగాణా ద్వేషం మీరు చూసారో లేదు నేను చూసాను.
తెలంగాణాని సంస్క్ర్తి గురించి మీరేమి మాట్లాడినా ఒప్పుకుంటూ మేము మీ మంభావాల్ని గౌరవించాలి,కానీ రవాణా పన్నుల విషయంలో ఒక బ్లాగరు ఆవెదన చెందుతుంటే "మీ మనోభావాల గొడవ మాకెందుకు?" అనే రకంగా మాట్లాడినా చెల్లుతుంది.మీ మనోభావాలు మాతర్ము మేము పట్టించుకుంటే చాలు,మా మనోభావాలు మీరు పట్టించుకోరు - అంతా యేకపక్షంగా మీకు ఫావరబుల్ అయీతేనే న్యాయం లేకపోతే ఆంధ్రా పెత్త్తందారీ తనం,అంతేనా?
బోడి అన్నా, పీడ అన్నా, దౌర్జన్యం అన్నా అన్నీ పైన చెప్పిన "విశాలాంధ్ర" గురించే.
మా సంస్కృతిని మీరు, మీ సంస్కృతిని మేము మెచ్చుకోవాలని అనలేదు సార్, కించపరచొద్దు చాలు.
రవాణా పన్ను ఆర్ధిక రంగానికి చెందింది, పైగా హక్కు కూడా. ఎవరివో మనోభావాలు దెబ్బ తింటాయని హక్కులను వదిలేసుకుంటే మొదటికే నష్టమే కాక ఆయన థాంక్స్ కూడా చెప్పడు. వారి మనోభావాలపై వారి ప్రభుత్వానికి అంత సోయి ఉంటె మాకు ఆమేరకు పరిహారం ఇస్తే పోతుంది. It was open to Andhra govt. to offer "please don't tax our people, we will compensate Telangana for the loss so incurred".
అన్నిటినీ అన్నది పైన చెప్పిన "విశాలాంధ్ర" అలియాస్ "తు హా కర్ యా నా కర్ తు హాయ్ మేరీ కిరణ్" భావజాలాన్నిసార్!
I did not claim these adjectives are synonymous. I only point out these were individually & severally used to describe the hegemonic concept of "unity with or without consent".
I am asking you about the usage of "బోడి ఆంధ్రప్రదేశ్".మీరు వాడిన మొత్తం వాక్యం ఇలా ఉంది "మాయమై పోయింది బోడి ఆంధ్రప్రదేశ్".అందులో ఉన్నది ద్వేషం కాదనీ కేవలం అభిప్రాయ భేదమని యెవరయినా యెలా అనుకోగలరు?
"విశాలాంధ్ర" అంటే సీమాంధ్ర కాదు, అక్కడి ప్రజలు అంతకన్నా కాదు. తెలుగు మాట్లాడే ప్రజలు అందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని, ఇందుకు వేర్వేరు ప్రాంతాల ప్రజల అంగీకారం ఉన్నా లేకపోయినా ఫరవా లేదనే ఒక రాజకీయ ప్రయోగం.
Visalandhra or Andhra Pradesh is *this* concept. I am not referring to the physical administrative region (much less its inhabitants).
మహానుభావు లారా!
ఈ టపా వ్యవసాయమున కు ఇంత గొప్ప గా కామెంటు 'weed' (feed we know but not weed you see!) వచ్చునని నా ఊహకు అందక పోయే !!
జేకే!
జిలేబి
ఇక్కడేదో అగ్గి బుగ్గవుతావుంది ! నారదా ఘ్రుతం ఎక్కడ ! వెంటనే పరుగెట్టు కు రా ! దిగిరా ! దివినించి భువి కి దిగి రా !
జిలేబి
(నారదా!)
@కామెంటిన /కామెంట బోయే అందరికి గమనిక - హెచ్చరిక ! ఖబడ్దార్ ! మీరెవరో ఎక్కడి నించి కామెంటు తున్నారో అంతా మా కెరుక !
ఈ టపా చాలా పవిత్రమైన గుండు జ్ఞానం గురించి. ఇందులో ప్రాంతీయ విభేదాలు గట్రా దయుంచి తీసుకు రావద్దు. ఆం తెలం రాయ కి గుండు జ్ఞానానికి సంబంధం అస్సలు లేదు గాక లేదు అని గుండు బల్ల గుద్ది వక్కాణిస్తున్నాది గుండు జిలేబి.
@గుండు మధుసూదన్ వారు,
ఈ గుండు జ్ఞానం టపా కి ప్రజ వారి టపాలో వచ్చిన ఒక గుండు టపా ఉత్ప్రేరకం. ఆ గుండు టపా కూడా మీ కు సంబంధించినది కాదు. జ్ఞానం ఎట్లా వచ్చును అన్న ప్రశ్న కి గుండు జ్ఞానం గురించి ఒక వాక్యం లో చెబితే, కొండల రావు గారు, గుండు జ్ఞానం ఎట్లా వచ్చును అని ప్రశ్నించేరు . దానికి సమాధానం ఈ టపా. కాబట్టి నిశ్చయం ఇది మీ పైన గుండు వేటు కాదు గాక గాదు,
ఇక మీ గుండు పద్యం సొబగు గుమ్మడి కాయ సొబగు ! సేహభేషు !!
జిలేబి
ఈ టపా కి ఉత్ప్రేరకమైన టపా లింకు ప్రజా బ్లాగు ది ఇది
http://praja.palleprapancham.in/2015/05/blog-post_50.html
కావున మీ కామెంటు లను ఈ టపా కంటెంటు ఐన గుండు జ్ఞానము వరకు మాత్రమె పరిమితము చేసుకుని గుండు జ్ఞానము ను మెండు గా పొందుడు !
ఆమెన్ !
జిలేబి
గుండును బండి యన్నా బండిని గుండు యన్నా
గుండు పగిలి పోతుంది ఆపై బండి నడవదు గువ్వల చెన్నా!
కం. ఒరు లేయవి యొనరించిన
నరవర యప్రియంబు తనమనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పథముల కెల్లన్.
స్వస్తిరస్తు.
నేను గుందువారిని గురించి అసలు యేమీ వెక్కిరింతగా గానీ కనీసం హాస్యంగ అనైనా అనలేదే?
మొదటి నుంచీ ఇప్పటి వరకూ నాకు ఆయన మీద యెలాంతి ద్వేషం గానీ కనీసం చినచూపు కూడా లేదు!
శుభమస్తు!