గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 09, 2015

బాబుగేటు వెనుక భారీ కుట్ర...!!!

-తొలి లక్ష్యం.. తెలంగాణను అస్థిర పరచడం
-రాష్ట్రం విఫలమైందని చూపే యత్నం
-150 కోట్లు పెట్టుబడి.. 20మంది ఎమ్మెల్యేలు టార్గెట్
-ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కుట్ర కోణం?
-ఏసీబీ విచారణలో బయటికి వస్తున్న కొత్త నిజాలు!
గెలిచినా ఉపయోగంలేని ఒక ఎమ్మెల్సీ స్థానంకోసం ఒక ఎమ్మెల్యే ఓటును ఐదు కోట్లతో కొనేందుకు చంద్రబాబు అండ్ బ్యాచ్ ఎందుకు సిద్ధపడటం వెనుక భారీ కుట్ర కోణం ఉందని తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఏసీబీ కూపీ లాగుతుంటే భారీ కుట్రల డొంకలు కదులుతున్నాయి. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేను కొనేందుకు పరిమితమైన వ్యవహారం కాదని, మొత్తంగా 20 నుంచి 25 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే భారీ పన్నాగంలో ఇదొక భాగం మాత్రమేనని, దీనికి చంద్రబాబు అండ్ పార్టీ రూ.150 కోట్ల పెట్టుబడితో సిద్ధమైందనే నివ్వెరబోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. 




త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వెన్ను విరిచేలా ఫలితాలు సాధించడం.. రాష్ట్రంలో అస్థిర వాతావరణాన్ని నెలకొల్పి.. మొత్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే కుప్పకూల్చి.. ఆ స్థానంలో తన తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే భయంకరమైన కుట్ర ఉందని విశ్లేషణలు విన్పిస్తున్నాయి. అన్నింటికి మించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నమని తేల్చే దుష్టబుద్ధి ఉందని తెలుస్తున్నది. అందుకోసమే ఇంత భారీ పెట్టుబడితో సిద్ధమయ్యారని సమాచారం. తాము దాదాపు 20 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేసేందుకు ప్రయత్నించామని అంతర్గత సంభాషణల్లో టీడీపీ నాయకులే చెప్తుండటం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన సీటు గెల్చుకోవడానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే సరిపోతారు. కానీ.. ఇంత మందిని తమవైపు తిప్పుకోడానికి టీడీపీ ప్రయత్నం చేసిందంటే.. అంతిమంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందనే విషయం స్పష్టమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆదినుంచి తెలంగాణ పట్ల వ్యతిరేకతే!


తెలంగాణ ఏర్పాటును అడ్డుకోడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్న విషయం యావత్ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. పలువురు టీడీపీ నేతలు సైతం ఈ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి ఉంది. తన అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయిన వాస్తవాన్ని అనేక సందర్భాల్లో యావద్దేశం చూసింది. తెలంగాణ రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టడానికి కరెంటు విషయంలో, కృష్ణా జలాల విషయంలో అనేక దుష్టయత్నాలకు తెర తీస్తూ, టీఆర్‌ఎస్ పరిపాలన చేయలేదని తేల్చాలని చంద్రబాబు అనేక కుట్రలకు పాల్పడ్డారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటుకు

బెడిసికొట్టాయి. ముందు చూపుతో వ్యవహరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. దాదాపు పాతికేండ్ల తర్వాత మండుటెండల్లోనూ కరెంటు కోతలనేవే లేకుండా చేసి.. రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందో ప్రజలు అనుభూతించారు. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం కిరికిరిపెడితే.. బోర్డుల ముందు పంచాయితీ పెట్టి.. రాష్ట్రవాటాను సాధించింది ఇక్కడి ప్రభుత్వం. ఇవన్నీ చూసిన చంద్రబాబుకు కన్నుకుట్టిందని, అందుకే ప్రభుత్వాన్నే కూలదోయాలనే పరాకాష్టకు తన ఏజెంట్ల ద్వారా వెళ్లారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే 150 కోట్ల పెట్టుబడితో 20-25 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పథకం రచించుకున్నారని సమాచారం. ఒక్క ఎమ్మెల్సీ గెలువడానికి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం కాగా టీడీపీకి బీజేపీ మద్దతు కలుపుకొని 16 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే టీడీపీ బరిలోకి దింపిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలువడానికి కేవలం ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తే సరిపోతుంది.. కానీ 20 మంది ఎమ్మెల్ల్యేలను కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నాలు దేనికి సంకేతం? 20 మంది ఎమ్మెల్యేలు టచ్ చేశామని టీడీపీ నాయకులు అంటున్నారంటేనే.. దీర్ఘకాలంలో ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర తప్ప ఇందులో మరొకటి లేదని విశ్లేషకులు అంటున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి