తెలంగాణ ముసాయిదా
బిల్లులోని అంశాల్లో
కొన్ని తెలంగాణమునకు
విఘాతాలుగా ఉన్నవి!
అసెంబ్లిలో తెలంగాణ
నేతలంత ఐక్యముగా
ఈ సవరణముల కొరకై
చర్చ చేసినను చాలును!
1. ఉమ్మడి రాజధాని రెండేండ్లకు మించి ఉండరాదు.
ఉమ్మడిగా రాజధాని
రెండేండ్లకు మించి వద్దు!
ఎక్కువైనచో ఆంధ్రులు
ఇల్లంతా నాదందురు!!
2. దీన్ని ఖైరతాబాద్‌కు మాత్రమే పరిమితం చేయాలి.
జీ హెచ్ ఎం సీ పరిధిన
వలదయ్యా వలదయ్యా!
ఖైరతబాద్ వరకె దీని
పరిధి చేయవలెనయ్యా!!
3. శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించవద్దు.
గవర్నరుకు శాంతి భద్ర
తలను అప్పగించ వలదు!
రాష్ట్ర కైవసమున నుంట
అందరికీ మేలయ్యా!!
4. ఇందుకై ఒక మానిటరింగ్ కమిటీ వేస్తే చాలు.
మానిటరింగ్ కమిటీని
నియమించిన సరిపోవును!
ఇంతమాత్రమునకే ఇది
గవర్నరుకు ఇడుట ఏల?
5. తెలంగాణకూ, సీమాంధ్రకూ రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పరచాలి.
ఉన్నత న్యాయస్థానాల్
వేరు వేరుగా నుండిన
కలహమ్ములు రాకుండును!
ఎవరి స్వేచ్ఛ వారికుండు!!
6. కరెంటు సరఫరాలోని గందరగోళాన్ని తొలగించాలి.
7. తెలంగాణకు కావాల్సిన కరెంటును కేంద్ర విద్యుత్ సంస్థల ద్వారా సర్దుబాటు చేయించాలి.
విద్యుత్తుని ఇచ్చుటలో
లోపాలవి తొలగించియు,
కేంద్రపు విద్యుత్ సంస్థల
నుండియె మా కిప్పింపుడు!
8. ఉద్యోగుల పంపిణీకై విధిగా స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి.
9. పెన్షనర్లను కూడా స్థానికత ఆధారంగా పంచాలి.
తెలగాణపు, సీమాంధ్రపు
ఉద్యోగుల, పెన్షనర్ల
పంపకమున అనుసరింప
స్థానికతయె ప్రమాణమ్ము!
10. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్
వేరువేరుగా నిడుడయ!
ఒక్కటియే ఉండిన తెల
గాణకు నష్టమ్మగునయ!!
11. గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి బోర్డులు అనవసరం.
గోదావరి నదీ జలపు
వినియోగము గూర్చి పర్య
వేక్షణ బోర్డులు ఎందుకు?
అవసరమే లేదయ్యా!
12. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలి.
పోలవరం ప్రాజెక్టును
నిర్మించుట నష్టానికె!
ఈ నిర్ణయమును మీరలు
ఉపసంహరణము సేయుడు!!
13. ఉన్నత విద్యా రంగంలో ఉమ్మడి ఎంట్రెన్స్ పరీక్షల పద్ధతిని ఉపసంహరించాలి.
ఉన్నత విద్యా రంగము
నుమ్మడి ఎంట్రెన్సు వలదు!
ఎవరి పరీక్షలు వారే
నిర్వహించుకొనగవలెను!!
*** *** ***
బిల్లు పార్లమెంటునకును
వచ్చినపుడు పై సవరణ
లన్ని చేయ తెలగాణము
తప్పక వర్ధిల్లునయా!
తెలంగాణ ప్రజలు కోరు
సంపూర్ణపు తెలంగాణ
మిటుల సేయ విలసిల్లును!
వెలుగొందును నిత్యమై!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
"11. గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి బోర్డులు అనవసరం"
కృష్ణా పారివాహిక ప్రాంతంపై కూడా బోర్డు అనవసరం. రెండో కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ (KWDT-II; బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్) ఇప్పటికే తన నిర్ణయంలో కృష్ణా జలాల నిర్ణయ అమలు బోర్డు (Krishna Waters Decision- Implementation Board) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీమాంధ్ర తెలంగాణా రాష్ట్రాల నీటి వాటాను కొత్త ట్రిబ్యూనల్ ద్వారా తెల్చాక, ఇదే బోర్డు పరిధిలోకి ఈ వాటాలను కూడా తీసుకొస్తే సరి
కామెంట్‌ను పోస్ట్ చేయండి