గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జనవరి 18, 2014

ఇంకా ఆ పాటే పాడుతారా?


చర్చలు జరుపుమటంచును పిల్వగ,
పాడిన పాటే పాడుట యేలా?
కేంద్రమునకు వినిపించిన పిదపయె,
తెలగాణా బిల్ వచ్చెనుగా!

అన్ని పార్టీల పిలిచి గతములో
పార్టీ అభిమతములు కోరిరిగా!
అభిప్రాయములనందరు తెలుపగ,
తెలగాణా బిల్ వచ్చెనుగా!

బిల్లు రాజ్యాంగ విరుద్ధమంచును
అసత్యాలు పలుకంగనేలయా?
బిల్లుపైన అభ్యంతరమున్నచొ,
అంశమువారిగ చెప్పితివా?

బిల్లుపైన చర్చలను జేయకయె,
ఊకను దంచిన బియ్యము వచ్చునె?
వారల వీరల పైనను  నిందా
రోపణ చేయుట సబబేనా?

కేంద్రమునపహాస్యమ్ము చేయుచును,
అసత్యాలతో కాలము గడిపియు,
కాలము సరిపోదంచును పలుకుచు,
గడువు పెంచుమన, పెంచెదరా?

పనికిని వచ్చెడి చర్చ సేయుచో
గడువును తప్పక పెంచెదరయ్యా!
నవ రాష్ట్రమ్మున త్వరిత వృద్ధి గొను
చర్చల నిప్పుడు జరుపుమయా!!

చిత్తశుద్ధితో చర్చల జరుపక,
బొంకుల మాటలు పలుకుట యేలా?
ఒక్క మాటైన సీమాంధ్రకు మును
ముందు వృద్ధినిడు మాటుందా?

"మా తాతలు నేతులు తాగిరి మా
మూతులు వాసన చూడం"డనుచును,
నీతి శాస్త్రములు వల్లించంగను,
దొంగయె దొరగా మారేనా?

తెలంగాణమును దోచిన వారలె
"ప్రోచితి"మనగను నమ్మెదమే?
అరువదేండ్ల మా బానిసత్వమే
మీ దోపిడీకి సాక్ష్యమయా!

"మానితి మాంసాహార"మని పలుకు
పిల్లిని, ఎలుకలు సమీపించునే?
మేక వన్నె పులి పోలిక మోసపు
మాటలు చెప్పిన, నమ్మెదమే?

తెలంగాణమును మోసగించియును,
"వృద్ధి చేసితిమి" అనగా తగునే?
మాయలు చేసి, "అమాయకుల"మ్మన
గుడ్డిగా మిమ్ము నమ్మెదమే?

చాలును నటనలు! చాలునసత్యాల్!
మోసాల్ చాలును! వేసాల్ చాలును!
సీమాంధ్రకు వలసినది కోరుడయ!
తెలంగాణమే వచ్చునుగా?

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

తోట భరత్ చెప్పారు...

సీమాంధ్రుల తీరును గన
గా మేక ముఖమ్ము దాల్చు ఘనవ్యాఘ్రంబే
మా మనసుకుఁ దోఁచునుగద
మోమోటం బేల వారి బుద్ధిఁ దెగడఁగన్.

తోట భరత్ చెప్పారు...

పాడిన పాటే పాడుచుఁ
బాడుపడిన నోటితో నబద్ధమ్ముల వే
యాడన్ నమ్ముదురే జన
మోడక సీమాంధ్రుల కిఁక బుద్ధిం జెపుఁడీ.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

గోముఖ శార్దూలమ్ములు
వేమఱు తెలగాణ జనుల వివిధమ్ములుగా
నీమమున దోచి, రిఁకపై
సీమాంధ్రుల దుష్టబుద్ధి సీమను జెఱచున్!

పాడుదురయ్యా వారలు
పాడినదే పాచిపండ్ల భట్రాజు వలెన్!
మూడెను కాలము వారికి!
నేఁడిటఁ దెలగాణ వెలుఁగు నిత్య నవమ్మై!!


మీ పద్యములు బాగున్నవి. స్పందించి కందపద్యములలో తమ అభిప్రాయములను తెలిపినందులకు ధన్యవాదములతో.... జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి