గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జనవరి 13, 2014

భావి తెలంగాణ

బ్లాగు వీక్షకులకు
భోగి పండుగ శుభాకాంక్షలు!


తెలంగాణ ప్రజల కలయె
సాకారము కానున్నది!
రాష్ట్రమ్మేర్పడిన పిదప
బాధ్యత పెరుగును మనది!!

స్వార్థ కాంక్ష లేని నాయ
కుల పాలన తేవాలి!
దోచుకొనెడివారు లేని
అధికారులు కావాలి!!

గతం మనకు నేర్పినదయ
భావి కొరకు గుణపాఠం!
ప్రజాజీవితమునందున
వెలుగు నింపుటే శ్రేష్ఠం!!

ధనదాహం కలవారిని
గద్దెనెక్కనీయవద్దు!
సత్వరాభివృద్ధి కొరకు
పూనుకొనుటయే ముద్దు!!

కల్లా కపటం లేకయె
అందరమూ మెలగాలి!
సమతా మమతల నెప్పుడు
అందరికీ పంచాలి!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

బాగా చెప్పారు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు ఫణీంద్రగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి