దృష్టి మళ్లించి.. దొంగతనం!! రోడ్డు మీద ఓ పది రూపాయల నోటు పడేయడం.. డబ్బులు పడిపోయాయని పిలిచి మరీ చెప్పి.. వారు ఆ నోటు తీసుకునేలోపు లక్షల రూపాయలతో ఉడాయించేయడం!! ఇదీ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ పని! ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇటువంటి గ్యాంగులు బయల్దేరాయి!
-సెక్షన్ 8 పేరుతో బాబును కేసునుంచి తప్పించే యత్నం
-ఏపీ సర్కారు యత్నాలకు ఆంధ్రజ్యోతి వత్తాసు..
-ఢిల్లీలో దిశానిర్దేశం చేస్తున్న న్యాయకోవిదుడు
-తెలంగాణ పాలనలో పుల్లలు పెడుతున్న బాబు
-హెచ్‌ఆర్‌డీపై పెత్తనానికి ఏకపక్ష నిర్ణయం
-అంతర్గత సిబ్బందిలో తెలంగాణవారికి ఉద్వాసన
-తెలంగాణలో కల్లోలమే ఏపీ సర్కార్ లక్ష్యం!
-మండిపడుతున్న తెలంగాణవాదులు
ఓటుకు నోటు కేసులో పీకలలోతు కూరుకుపోయిన చంద్రబాబునాయుడుని బయటపడేసేందుకు.. ఈ కేసును పక్కదారి పట్టించి.. జనం దృష్టి మరో సమస్యవైపు మళ్లించేందుకు ఈ గ్యాంగులు విరామం లేకుండా శ్రమిస్తున్నాయి! ఏపీ అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడే మీడియా.. ఢిల్లీలోని న్యాయవ్యవస్థలో కొందరు ఈ గ్యాంగులో సభ్యులుగా తేలుతున్నది. సెక్షన్ 8.. గవర్నర్ గిరీ పేరుతో చెలరేగి చిమ్ముతున్న విష అక్షరాల వెనుక ఉన్నది ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్!-ఏపీ సర్కారు యత్నాలకు ఆంధ్రజ్యోతి వత్తాసు..
-ఢిల్లీలో దిశానిర్దేశం చేస్తున్న న్యాయకోవిదుడు
-తెలంగాణ పాలనలో పుల్లలు పెడుతున్న బాబు
-హెచ్‌ఆర్‌డీపై పెత్తనానికి ఏకపక్ష నిర్ణయం
-అంతర్గత సిబ్బందిలో తెలంగాణవారికి ఉద్వాసన
-తెలంగాణలో కల్లోలమే ఏపీ సర్కార్ లక్ష్యం!
-మండిపడుతున్న తెలంగాణవాదులు
తెలంగాణలో ఏదో కల్లోలం జరిగిపోవాలి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగంగా తేలాలనే దుర్బుద్ధి ఏపీ ప్రభుత్వంలో మొదటి నుంచీ కనిపిస్తూనే ఉంది. తాజాగా ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడటం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో టేపులు బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కేసు నుంచి బయపడేందుకు వెతకనిమార్గం లేదు.
ఈ క్రమంలోనే తన మీడియాను యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నది. తెలంగాణపై విషం చిమ్మేందుకు సందుకోసం ఎదురుచూసే ఆంధ్రజ్యోతివంటి పత్రికలకు ఈ పరిణామంతో కోతికి కొబ్బరికాయ దొరికినట్లయిందని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆయన ప్రయోజనాలకు కొమ్ముకాసే మీడియా, ఢిల్లీలోని న్యాయ వ్యవస్థలో కొంద రు వ్యక్తులు కలిసి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌గా ఏర్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో మీడియాను మేనేజ్ చేయడంతోపాటు.. తెలంగాణ సర్కారును ఇరుకు న పడేసే దిశగా వార్తలు రావాలని నిర్దేశాలు జరిగినట్లు తెలుస్తున్నది.
నాలుగు రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రిక సెక్షన్ 8 అంశాన్ని తీసుకుని రాద్ధాంతం చేయడం, ఇప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గవర్నర్‌కు రాసినట్లు చెప్తున్న ఒక సాధారణ లేఖను పట్టుకుని నానా యాగీ చేయ డం.. ఏదో అయిపోతున్నదని, ఇక నగరంపై గవర్నర్ గిరీయేనని చంకలు గుద్దుకుంటూ కథనాలు ప్రచురించి, తమ మీడియాలో ప్రసారం చేయడం ఈ గ్యాంగ్ స్కెచ్‌లో భాగమేననే అనుమానాలను తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబును ఓటుకు నోటు కేసులో బోనెక్కించే ప్రయత్నాలు మానుకోకుంటే హైదరాబాద్‌పై సెక్షన్ 8 వస్తుందని బెదిరించే ధోరణి కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా చంద్రబాబు హెచ్‌ఆర్‌డీ నిర్వహణ విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణలో సాఫీగా సాగుతున్న పరిపాలనకు పుల్లపెట్టడమేననే వాదన వినిపిస్తున్నది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం పదో షెడ్యూల్లో ఉందంటూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీగా ముఖేష్ గుప్తాను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నియమించడం కొత్త వివాదానికి తెర లేపింది. ఈ కేంద్రం తమదేనని తెలంగాణ సర్కారు వాదిస్తున్న సమయంలో ఉన్నపళంగా సీజీజీకి కొత్త అధికారిని నియమించడం మరో వివాదం రేపేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే తన ఇంటిలో పని చేస్తున్న 20 మంది తెలంగాణవారిని చంద్రబాబు తొలగించారని వార్తలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు అంతర్గత భద్రత విభాగం నుంచి దాదాపు 40 మందిని ఏపీ అధికారులు రిలీవ్ చేశారు. తెలంగాణ వాసన కూడా తనకు రావద్దన్న చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. దశాబ్దాల పోరాటాలు, వందల ఆత్మబలిదానాలు, వేల కేసులు, లాఠీదెబ్బలు ఎదుర్కొని, త్యాగాల పునాదులపై ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం పురోగామి మార్గంలో దూసుకుపోవడం జీర్ణించుకోలేని అల్పబుద్ధి ఏపీ ప్రభుత్వ చర్యల్లో, దానికి అంటకాగే పత్రికల అక్షరాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
కేసునుంచి చంద్రబాబు బయటపడేందుకు అత్యంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రజ్యోతి.. గత కొద్ది రోజుల క్రితం అసలు ఈ కేసు మొత్తం నీరుగారిపోయినట్లేనని, ఉభయ రాష్ర్టాల సీఎంలు ఒక అవగాహనకు వచ్చి.. వెనక్కు తగ్గారని ఒక అభిప్రాయాన్ని రుద్దింది. నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఈ కేసుకు సంబంధించిన వార్తలు రాకపోవడం దీనికి నిదర్శనమని ఒక దిక్కుమాలిన సూత్రీకరణ కూడా చేసిపారేసింది. ఇప్పుడు హైదరాబాద్‌పై గవర్నర్ పూర్తి జోక్యానికి మార్గం సుగమం అయిపోయిందంటూ కొత్త భాష్యం చెప్తున్నది. నిజానికి సెక్షన్ 8 కొత్తగా అమలయ్యేదేమీ ఉండబోదని హోంశాఖ వర్గాలే తేల్చి చెప్తున్నాయి.
నగరంలో శాంతి భద్రతల పరిస్థితికి భంగం వాటిల్లినప్పుడు.. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతున్నదని భావించినప్పుడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పరిధి అంతవరకు పరిమితం. అంతేకానీ ఏదైనా గొడవ జరిగితే వెళ్లి పరిష్కరించాలని కానిస్టేబుల్‌ను గవర్నర్ పంపించే పరిస్థితి ఉండదు. కానీ.. ఈ వాస్తవాలను పక్కనపెట్టేసి.. ఒక అనధికారిక లేఖ పట్టుకుని ఆంధ్రజ్యోతి అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
నిజానికి శాంతి భద్రతలనేవి రాష్ర్టాల పరిధిలోని అంశం. ఒక సాధారణ చట్టం ద్వారా శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు ఎలా కట్టబెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి తెలియదనుకోలేమని, కానీ.. ఉన్న సమయంలో సాధ్యమైనంత గందరగోళం సృష్టించి, ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఆ పత్రిక ఇలాంటి రాతలు రాస్తున్నదని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
9 కామెంట్‌లు:
20 మంది తెలంగాణావారిని పనిలోనుండి తీసివేస్తే ఆంధ్రా వారిని కూడా పనిలోనుండి తీసివేస్తారు కదా ? ఒకరినొకరు నమ్ముకోవడం సాధ్యపడదు కనుక విభజనని ఇద్దరూ కలిసి అమలుచేస్తున్నట్లే. ఎలా జరిగినా తెలంగాణా వారు కోరుకున్నదే జరుగుతున్నది కదా ?
నీహారిక గారూ!
తెలంగాణలో పుట్టిన భర్తా, కొడుకూ ఉన్న మీరు పక్కా తెలంగాణీయులే! కానీ, ఇంకా మీలో ఆంధ్ర వాసనలు పోవడం లేదు. మా తెలంగాణులు ఒక్క ఆంధ్ర ఉద్యోగినైనా తొలగించారా? 20 మంది ఆంధ్రావాళ్ళను మేము తొలగిస్తారనేది మీ భ్రమ. మేం ఎత్తి చూపుతున్నదల్లా చంద్రబాబు అవినీతిని! ఒక అవినీతి పరుడు ఎక్కడ ఉన్నా అవినీతిపరుడే. మీరు అవినీతిపరుడిని సపోర్ట్ చేస్తున్నట్టు మేం భావిస్తున్నాం. ఇప్పుడు అటువైపు ఆంధ్రావాళ్ళూ, ఇటువైపు తెలంగాణవాళ్ళూ ఏ గొడవలు లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అయినా, ఏవో గొడవలు జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్న అవినీతిపరుడిని మీరు వెనకేసుకొనిరావడం దురదృష్టకరం. అన్యాయాన్ని అక్రమాన్ని బహిర్గతం చేయడం మీకు నచ్చదా? తెలంగాణలో ఉంటూ తెలంగాణ తిండి తింటూ, తెలంద్గాణ గాలి పీలుస్తూ ఇంకా ఆంధ్రపాట పాడుతున్న మీరు సంకుచితవాదులని ఋజువవుతున్నది. దయచేసి ఇలాంటి ఆలోచనలు మానండి. నిర్మొహమాటంగా అవినీతిని ఒప్పుకోండి. సమర్థించకండి. స్వస్తి.
విభజన అమలుజరుగుతున్నది అని అనడం చంద్రబాబు నాయుడుగారి అవినీతిని సమర్ధించినట్లా ?విభజన అంటూ జరిగాక ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఉండవలసిందే కదా ?ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకి వెళ్ళవలసిందే కదా ? నా గురించి తెలిసినవారెవరూ నేను అవినీతిని సమర్ధిస్తానని చెప్పలేరు.మీరు పొరపడుతున్నారు.కెసీఆర్ గారి వల్ల మాకు మేలు జరిగింది అని మేము భావిస్తున్నాము.విభజన మీకోసం చేసుకున్నా మా ప్రాంతాలు ఇపుడు అభివృద్ధి చెందుతున్నాయి.వ్యక్తిగతంగా కూడా ఆంధ్రాలో ఉన్న మా ఆస్థుల విలువలు పెరిగాయి.చంద్రబాబు అవినీతి బయటపెట్టడమే కాదు అరెష్టు చేయించినా నాకు ఇష్టమే.మాకు నాయకుల కొరత ఉండి ఆయన సీ ఎం అయ్యారు.మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి.
ద్వేషం మనిషిని సమూలంగా నాశనం చేస్తుంది
రెండుకళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడుకే కాదు ఆయనని సమర్ధించిన వారికీఉంటుంది కదా ? టిఆరెస్ పార్టీ ఆంధ్రాలో స్థాపించాలి.ఆంధ్రా లో కూడా కెసీఆర్ అభిమానులున్నారు.
నీహారికగారూ! చంద్రబాబుది సామ్రాజ్యవాద ధోరణి, కేసీఆర్‍ది తెలంగాణ అభివృద్ధివాద ధోరణి. ఇద్దరూ వైరుద్ధ్య వైఖరి కలవారు. ఇద్దరి ఉద్దేశాలు వేరు. ఇకపోతే, టీఆర్‍ఎస్ పార్టీని ఆంధ్రాలో కూడా స్థాపించడం కేసీఆర్ నైజానికి పడనిది! ఒక తెలంగాణీయుడు తెలంగాణలో తాను నాయకునిగా కొనసాగాలనుకుంటాడు. చంద్రబాబులాంటి ఆంధ్రుడు తన రాష్ట్రాన్నీ, ప్రక్క రాష్ట్రాన్నీ ఏలాలనుకుంటాడు. ఇది ఎన్నో సార్లు చంద్రబాబు మాటల్లో ఎన్నోసార్లు బహిర్గతమయింది. కానీ, కేసీఆర్ ఆంధ్రా ప్రాంతాన్ని ఏలాలని కోరుకోవడం లేదు. కాబట్టి ఆయన ఆంధ్రాలో టీఆర్‍ఎస్ పార్టీని స్థాపించడం కల్ల. అయినా మీరు కేసీఆర్‍ను, ఆయన నాయకత్వాన్ని అభిలషించి అభిమానించేవారిలో ఉన్నారని మీ మాటలవల్ల బహిర్గతమవుతున్నది. సత్యమో...అసత్యమో మీ మనస్సుకే తెలియాలి. అయినా, మీరు ఆయన నాయకత్వాన్ని సమర్థించినందుకు, రాష్ట్రవిభజన మేలే కలిగించిందన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
ఆంధ్రావారు మాకు సోదరులు. వారిపై మాకు ఏలాంటి ద్వేషభావమూ లేదు. మా కోపం అంతా, మా నీళ్ళు, నిధులు, కొలువులు, భూములూ మొదలైనవి కొల్లగొట్టిన ఆంధ్రానాయకులపైనా, పెత్తందారులపైనా, అక్రమార్కులపైనా ఉన్నది. అంతేగానీ, ఆంధ్రులపై ద్వేషం లేదు. అకారణ ద్వేషంతో రగిలిపోయేవారు తప్పక సమూలంగా నాశనమవుతారు. స్వస్తి.
ప్రస్తుతం కేసీఆర్ ఆంధ్రాలో అభ్యర్ధుల్ని నిలబెడితే గెలిచే అవకాశం లేదు కాబట్టి పోటీ చెయ్యకపోవచ్చు,కానీ యేదో ఒకనాడు ఆ అవకాశం ఉంటే మాత్రం వొదులుకోడు కదా!
పేరుకే యెన్నికలు,వోట్లు నే హడావిది జరుగుతున్నది తప్ప పై స్థాయిలో అధికార నిర్వహణ అంతా రాచరికంలాగాఎ ఉంది,నేనంటున్నానై కాదు పరిశీలించి చూడంది తెలుస్తుంది.నేను అంతున్నది కూడా లోతయిన పరిశీలన చేసినాకనే అంటున్నాను.చానక్యుడు "రాజు విజిగీషువు.ఈ సమస్త భూమండలాన్నె గెలిచే హక్కు అతనికి ఉంది" అన్నాడు.ఒక వూరుని పట్టగలగదం నుంచి మొదలయిన రాజరికం యెక్కడ ఆగాలి అన్న ప్రశ్నకి "యెక్కది వర్కూ యెదగగలిగితే అక్కడి వరకూ విస్తరించడమే రాజు లక్ష్యం" అని జావాబు చెప్పినట్టూ!అలా యెదిగే అవకాశం ఉన్నవాడు వొదిగి ఉండడు కదా - మరి ఇవ్వాళ తెదెపాకి కూడా డీ అంటే డీ అని నిలబడగలిగిన సత్తా ఉన్నప్పుడు మీరు అతను ఆంధ్రాకి మాత్రమే పరిమితం కావాలి,తెలంగానని కూడా యేలాలనుకోవటం తప్పు అని యెలా అనగలరు?
యే పార్టీ కయినా ఒక రాస్ట్రంలో తగినన్ని వోత్లు లేకపోతే దానంతటదే పెట్టె మూసుకుని పోతుంది.కానీ తగినంత బలం ఉన్నా కూడా ఆ పార్టీ అసలు ఇక్కడ పోటీ చెయ్యడానికే వీలు లేదు అని అనటం ఈ కాలానికి సరిపడిన మాటయేనా?
హరిబాబుగారూ!
టీఆర్‍ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏర్పడిన ఉద్యమపార్టీ! పైగా దీనికి "తెలంగాణ రాష్ట్ర సమితి" అని స్పష్టంగా, ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన పార్టీ అని విశదమౌతుంటే...మునుముందు టీఆర్‍ఎస్ ఆంధ్రలో కూడా ఎలా మనగలుగుతుంది? చంద్రశేఖరరావుగారి మదిలో సామ్రాజ్యవిస్తరణ కాంక్ష ప్రబలవచ్చు ననెడి ఊహకే తావులేదు. ఆయన తెలంగాణకే అంకితమై బంగారు తెలంగాణకై అహరహమూ శ్రమిస్తున్నారు. వారికి అంతటి దురాశ...ఆంధ్రలోనూ తన పార్టీ కొనసాగాలనే దురాశ ఉంటుందని నేననుకోను! తన బలాబలాల్ని తెలంగాణకే పరిమితం చేసి, ఇతర పార్టీలకు స్థానం లేకుండా (ఎందుకంటే ఇతర పార్టీలవాళ్ళు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా నిలుస్తున్నందున) చేసి, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి పాటుపడుతున్నారు. ఎవరేమనుకున్నా తనపని తాను చేసుకుపోతున్నారు. "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్చయే గాక నాకేటి వెరపు?" అన్నట్టుగా తనదైన బాణీలో, తనదైన పంథాలో మునుముందుకు సాగిపోతున్నారు. కాబట్టి మీ ఊహకు బలము లేనే లేదని చెప్పవచ్చును!
మొత్తానికి ఇక్కడి పరిణామాలు మాకు శుభకరముగానే ఉన్నాయి. నా వ్యాఖ్యకు స్పందించి ప్రతివ్యాఖ్య లిఖించినందుకు ధన్యవాదములు స్వస్తి.
నీరజగారూ!
మీ వ్యాఖ్య మా తెలంగాణులకు కొంత అభ్యంతరకరముగనున్నది. కాబట్టి ప్రచురించుటలేదు. మరోలా భావించకండి!
టీఆర్‍ఎస్ ఉద్యమపార్టీ. ఉద్యమం దేనికోసం సాగినదో అది సాధించబడింది. ఇప్పుడు బంగారుతెలంగాణ దాని లక్ష్యం. అంటే దాని పరిధి తెలంగాణకే పరిమితమని అర్థం చేసుకొనగలరు.
తెలంగాణులు తమకున్నదానితోనే సంతృప్తి పడే గుణం కలవారు. ఇంకొకరిది లాగికొని అనుభవించే తత్త్వం గలవారు కారు. మాకు మా తెలంగాణ రాష్ట్రం కావడమే లక్ష్యం. మాకు ఆంధ్రలోని ప్రాంతాన్ని ఆక్రమించాలనే కాంక్షలేదు. కాని, ఆంధ్రనాయకులు మా భద్రాచలంలోని కొన్ని ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకొనే కుట్రపన్ని కృతకృత్యులయ్యారు. మేము ఈ విషయంలో బాధ పడ్డామేగానీ...ఎదిరించలేదు. మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే కొద్దిపాటి భూభాగం పోతేనేం అనుకొన్నాముగానీ...కేంద్రంతోనూ, ఆంధ్రవాళ్ళతోనూ పోరాటం జరుపలేదు. ఇదీ మా ఔదార్యం. మాకు పెద్ద సంతృప్తి కలుగనుండగా చిన్న అసంతృప్తిని గురించి పట్టించుకోవడమెందుకనుకున్నాం. మీలాంటివాళ్ళు మా తెలంగాణులు దుబారా చేస్తారేగాని, సంపాదించుకొనడం తెలియదనుకుంటున్నారు. మా ఔదార్యం మీకెలా అర్థమవుతుంది? మేం సామ్రాజ్యవాదులం కాం. ఇతరుల భాగాన్ని అన్యాయంగా గుంజుకోవాలనే దురాశ లేనివాళ్ళం. తమ ఆస్తులను తాము కష్టించిన సొమ్ముతో పెంచుకుంటూ పోవడం...ఇతరుల ఆస్తిని దౌర్జన్యంగా లాక్కోవడం ఒక్కటి కావు. మాకు ఆంధ్రలోని ప్రాంతాలను తెలంగాణలో కలుపుకోవాలనే దురాశ లేదు. మా సొమ్ము మాకు కావాలిగానీ, ఇతరుల సొమ్ము మాకెందుకు? ఇది ఒక సగటు తెలంగాణుని అభిప్రాయం. మీరు మమ్మల్ని వ్యంగ్యంగా దుర్భాషలాడవలసిన అవసరంలేదు. చర్చ చాలును. దీనితో ఆపేద్దాం. స్వస్తి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి