ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
విభజనమున పంపకాలు
సక్రమముగ జరుగవనియు
అనుమానము కలుగుచుండె!
సచివాలయమందు ఉండ్రి
అధికారులు సీమాంధ్రులు
ఎనభై ఆరు శాతమ్ము!
తెలగాణులు పద్నాలుగు!!
విభజనమ్మునకు వ్యతిరే
కమ్ముగ పనిచేస్రి వారు!
వారలు రూపొందించిన
పట్టికలవి నమ్మదగునె?!
తెలగాణకు అన్యాయము
జరిపెను సీమాంధ్రప్రభుత!
సచివాలయ అధికారుల
శాతమందు మోసమాయె!!
అరువది సీమాంధ్రులకును
నలువది తెలగాణకు సరి!
అట్లుగాక, ఎనుబదారు,
పదునాలుగు న్యాయమౌనె?
ఇట్టి భేదముండె గాన,
తెలంగాణ ప్రాతినిధ్య
ముండు కొరకు ప్రతినిధులను
క్రాస్ చెకింగు కనుమతినిడి,
గవర్నరును, సెక్రెటరియు
తెలగాణకు అన్యాయము
జరుగకుండగాను పూని
న్యాయము జరిపింపవలెను!
అట్లుగానిచో తెలగా
ణకు నష్టము కలుగునయ్య!
పక్షపాత వైఖరితో
అన్యాయము చేతురయ్య!!
సచివాలయ అధికారులు
సీమాంధ్రకు తెలగాణులు
తగు నిష్పత్తిగ లేమికి
కారణమే ద్రోహచింత!
సీమాంధ్రుల పక్షపాత
మున కిదియే నిదర్శనము!
పక్షపాతమును ద్రుంచియు,
న్యాయము స్థాపింపవలెను!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
5 కామెంట్‌లు:
ఎప్పుడూ తెలంగాణపై విషం కక్కుతూ, పనికిరాని వ్యాఖ్యలు రాస్తూండే ఒక పనికిరాని మూర్ఖునికి ఈ బ్లాగులోకి రావద్దని ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ సిగ్గులేకుండా వస్తున్నాడు. రావద్దని ఛీకొట్టినా రోషం లేని జన్మ. కొందరికి ముఖంపై ఉమ్మివేసినా సిగ్గు శరం రాదు.ఆ దరిద్రుడు విలువైన రాతలు రాయకుండా తెలంగాణపై విషం కక్కడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. న్యాయాలూ, సత్యాలూ చెబితే సంతోషించేవాడిని. కాని విషం కక్కుతూ, అసత్యాలు మాత్రమే రాస్తున్నాడు. ప్రచురించనని తెలిసికూడా రాయడం అతని కుసంస్కారానికి నిదర్శనం. అతనికి సిగ్గుంటే మళ్ళీ ఈ బ్లాగులోకి రావద్దని తిరస్కారం తెలుపుతున్నాను.
ఓహ్! ఆ లెఖ్ఖలన్నీ నిజమేనా??? మరీ ఇంత తేడానా??
అన్నీ నిజాలే! తెలంగాణ ఉద్యోగాలన్నీ తెలంగాణులకు ఇవ్వకుండా సీమాంధ్రులకివ్వడం ద్వారా, ఇలాగే కొల్లగొట్టారు సీమాంధ్ర నేతలు! సీమాంధ్ర ప్రభుత్వమా...మజాకా...? కాబట్టే ఇంత తేడా ఉంది. ఇవే కాక ఇంకా ఇతర ఉద్యోగాలు కూడా కొల్లగొట్టారు. అందుకే మేం తెలంగాణాను కోరాం! పొందాం. కానీ తప్పుడు లెక్కలు చూపిస్తారేమోనని అనుమానంగా ఉంది. చూపించి, ఎందాక పారిపోతారు? ఉడత పరుగు ఎందాక? దొరకకపోతారా? తిరిగి వెళ్ళగొట్టకపోతామా? అక్రమంగా చొరబడినవాళ్ళనే సుమా!
ఐతే ఇక్కడి నాయకులకి ఇప్పటివరకు ఈ లెక్కలు తెలియదంటారా?
తెలిసినా ప్రయోజనం ఏముంది? వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడకూర్చున్నా మనకే లాభాన్నిస్తాడు. తెలంగాణ సీమాంధ్ర నిష్పత్తులు పాటించకపోవడం వల్లనే ఈ తేడాలు వచ్చాయి. సెలెక్షన్ అధికారులు సీమాంధ్రులే కాబట్టి అర్హతలున్న తెలంగాణులను అనర్హులుగా చూపి, తమ వాళ్ళకు ప్రయోజనం కూర్చారు. మాకు అన్యాయం చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి